స్త్రీవాద సాహిత్య యుగకర్త ఓల్గా – డా.అయ్యగారి సీతారత్నం

సాహిత్య చరిత్రలో యుగవిభజన అనేక విధాలుగా చేశారు. కానీ ప్రధానమైన, ప్రభావశీలిjైున కవులను బట్టి జరిగే కవుల యుగ విభజననే ఎక్కువమంది అంగీకరించారు. తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ, విప్లవ సాహిత్యానంతరం యుగ విభజన అనకుండా స్త్రీవాదాన్ని కూడా ఒక సాహిత్య ధోరణిగా ప్రధాన రచయితల రచనలను

పరిచయం చేస్తున్నారు. నిజానికి 1975 మహిళా సంవత్సరం తర్వాత ఆరంభమై 1980 నాటికి స్పష్టమైన స్త్రీవాదం… ఆ తర్వాత అన్ని సాహితీ ప్రక్రియల్లోనూ పరిపుష్టమైంది. సమాజం అనివార్యంగా స్త్రీవాద ప్రభావానికి గురైంది. నేడు ప్రభుత్వాలు కూడా స్త్రీవాదం అందించిన జెండర్‌ దృక్పథాన్ని గ్రహించి సంక్షేమ పథకాలు, చట్టాలు, మహిళా సాధికారత కోసం పనిచేయాల్సిన స్థితి వచ్చింది. స్త్రీవాద సాహిత్యం అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చే వ్యక్తి ఓల్గా. స్త్రీవాద ప్రక్రియలన్నింటినీ సృజించడమే గాక ఒక సామాజిక కార్యకర్తగా స్త్రీవాద భావజాలాన్ని సమాజంలో ఇంకింపజేయడానికి అహర్నిశలు కృషి చేసిన, చేస్తున్న వ్యక్తి ఆమె. సృజనాత్మకతకి, కార్యాచరణకి ఉన్న సరిహద్దులు చెరిపేశారు ఓల్గా. ఆమె మొదట విరసంలో పనిచేశారు. విప్లప రాజకీయ పార్టీల్లోని పితృస్వామిక ధోరణులను వ్యతిరేకించారు. ‘సరిహద్దులు లేని సంధ్యలు’ అనే పుస్తకం ద్వారా ఆమె ఏ విధంగా ఫెమినిస్టు రాజకీయాల్లోకి వచ్చారో తెలుస్తుంది. శ్రీశ్రీ మొదట కృష్ణశాస్త్రి ప్రభావంతో భావకవిత్వమే రాసి తర్వాత మార్క్సిజం ప్రభావంతో అభ్యుదయ కవిత్వం రాశారు. అలాగే ఓల్గా విప్లవ కవిత్వం వైపు ఆకర్షితులై, తర్వాత దాన్నుంచి బయటపడి స్త్రీవాద చైతన్యంతో స్త్రీవాద రచయిత్రిగా స్థిరపడ్డారు. స్త్రీవాదం స్థిరపడడానికి కావల్సిన ప్రతిపాదనలు, విశ్లేషణలు నిరంతరం చేసి అన్ని ప్రక్రియల్లో సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించి ఎందరినో ప్రభావితం చేశారు.
సి.నారాయణరెడ్డి, ‘‘ఎవరు తమ రచనల ద్వారా వర్తమాన కాలాన్నే కాక భవిష్యత్తాల వారికి అభినవోత్తేజం కల్గింతురో, ఎవరుగ తాను గతికమైన ఘనీభవించిన భావ ప్రపంచంలో ఉద్దామమైన ఉద్దీపన కలిగింతురో, ఎవరు తమ తరువాత అనేక కవులకు అనుకరణీయలౌదురో వారిని సాహిత్య రంగమున యుగకర్తలనవచ్చు’’ అని నవ్య కవిత్వ యుగకర్త చర్చలో పేర్కొన్నారు. ఈ నిర్వచనం ప్రకారం ఓల్గా సాహిత్యం పరిశీలిస్తే, ఓల్గా చూపిన దృక్పథంలో రచనలు చేసిన వారు ఉన్నారు. ఆమె అన్ని ప్రక్రియల్లో స్త్రీవాద రచనలు చేశారు. కవయిత్రిగా, కథకురాలిగా, నవలా రచయిత్రిగా, విమర్శకురాలిగా, పరిశోధకురాలిగా, సైద్ధాంతిక ప్రతిపాదకురాలిగా, వ్యాసకర్తగా, నాటకకర్తగా, అనువాదకురాలిగా, రిపోర్టర్‌గా, సంపాదకీయ రచయిత్రిగా, సినిమా, టెలిఫిల్మ్‌లు, టీవీ సీరియల్‌ రచయిత్రిగా, కాలమిస్టుగా, నృత్యరూపకర్తగా అనేక రచనలు చేశారు. ‘ఓల్గా కవితలు కొన్ని’, అనే కవితా సంకలనంÑ సహజ, స్వేచ్ఛ, మానవి, కన్నీటి కెరటాల వెన్నెల, ఆకాశంలో సగం, గులాబీలు, గమనమే గమ్యం, యశోబుద్ధ నవలలుÑ రాజకీయ కథలు, ప్రయోగం, భిన్న సందర్భాలు, మృణ్మయనాదం, విముక్తి కథా సంకలనాలు, సామాన్యుల సాహసం, భూమి పుత్రిక, మిస్సింగ్‌, మూడు తరాలు, పుట్టని బిడ్డకు తల్లి ఉత్తరం, ఉరికొయ్య అంచున, నేను సావిత్రీ బాయిని, అక్షర యుద్ధాలు వంటి అనువాదాలూÑ వాళ్ళు ఆరుగురు, చరితస్వరాలు నాటికలుÑ అతడు`ఆమె`మనం, కుటుంబ వ్యవస్థ`మార్క్సిజం`ఫెమినిజం, సహిత విమర్శ వ్యాసాలుÑ యుద్ధము శాంతి, లక్ష్మణరేఖ, ద్రౌపది నృత్యరూపకాలుÑ భద్రం కొడుకో, తోడు, గాంధీ (డబ్బింగ్‌), పాతనగరంలో పసివాడు, గులాబీలు, అమూల్యం సినిమాలుÑ ఆడపిల్లలం, పురిటినొప్పులు, ఒక పెళ్ళి కథ, సారీ నసీమా, తప్పెవరిది?, అమీనా, ఓ ప్రేమ కథ, టెలిఫిల్మ్‌ వెలుగు, వెలుగునీడలు, సీతారామపురం అగ్రహారం, బాంధవ్యాలు, మానవి, రాణిగారి కథ టీవీ సీరియల్స్‌ రచించారు. అంతేగాక మాకు గోడలు లేవు, నీలిమేఘాలు, నూరేళ్ళ చలం, సారాంశం, సరిహద్దులు లేని సంధ్యలు, మహిళావరణం, జీవితమే ఒక ప్రయోగం, అలజడి మా జీవితం, నవలా మాలతీయం పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.
ఓల్గా, రచనలను ఒక ఉద్యమంగా చేశారనే చెప్తారు విమర్శకులు. తాను స్త్రీవాదం కోసమే రచించానని ఓల్గా చెప్పారు. స్త్రీల జీవనం లోపలికి, మనసు లోలోపలికి వెళ్ళి తను తెచ్చిన జెండర్‌ లెన్స్‌తో చూసి వాస్తవికాంశాల్ని బయటపెట్టారు. లోతుగా వేళ్ళూనిన పితృస్వామ్యాన్ని గుర్తించి, దాని నుంచి ఒక సామాజిక మార్పు కోరుతూ దానిని త్వరితగతం చేశారు. నిజానికి ఏ కొత్త ఉద్యమం, సాహిత్యం వచ్చినా మొదట కొంత వ్యతిరేకతని ఎదుర్కోవలసి వస్తుంది. మిగిలిన వాటికన్నా స్త్రీవాదం ఎక్కువగానే విమర్శని, దాడుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ విమర్శలను, దాడుల్ని తిరగగొట్టి నిలబెట్టడానికి సాహిత్య సామాజికామోదాలు పొందేటట్లు చేయడానికి ఓల్గా చేసిన కృషి ఎన్నదగినది. ఓల్గా భవిష్యత్తరాలకు కూడా ఉత్తేజం కలిగేలా ఎదుర్కొన్నారని చెప్పవచ్చు.
జ్వాలాముఖి, ఎస్వీ సత్యనారాయణ, సోమసుందర్‌ మొదలైనవారు స్త్రీవాద కవిత్వాన్ని, వారు వాడిన భాషని చాలా తీవ్రంగా విమర్శించారు.
‘‘జుగుప్స కలిగించే శరీర ధర్మాన్ని, ప్రకృతి అసౌకర్యాన్ని అస్తిత్వ విశేషాలుగా చాటుతున్నారు’’.` జ్వాలాముఖి.
‘‘ఇది స్త్రీల ఆర్థిక, సామాజిక, రాజకీయ దోపిడీని ప్రతిబింబించడం లేదు. క్రమంగా ఉచ్చ కవిత్వం, ముట్లు కవిత్వం, రక్తస్రావ కవిత్వంగా పరిణమిస్తుంది’’. ` ఎస్వీ సత్యనారాయణ
‘‘మర్యాదస్తులు నోటపెట్టని మాటల్ని సైతం మేము ధైర్యంగా అనగల స్త్రీ స్వేచ్ఛావాదులం అని చాటుకుందుకి తప్ప వేరే ప్రయోజనం కనిపించదు’’. ` సోమసుందర్‌.
ఇలాంటి విమర్శలతో స్త్రీవాద రచయిత్రుల ఆత్మవిశ్వాసాన్ని పోగొడుతున్న సందర్భంలో ‘అస్మిత’ ద్వారా ‘నీలిమేఘాలు’ కవితా సంకలనాన్ని ప్రచురించి ఇలాంటి విమర్శలను తిరస్కరిస్తూ స్త్రీవాద దృక్పథం, ప్రయోజనం, నీలిమేఘాలు కవితా సంకలనానికి ముందుమాటగా నిలబెట్టారు. రావిశ్రాస్తి లాంటి రచయిత కూడా ఇంటర్వ్యూలో ‘‘మధురవాణి మధురమే, ఫెమినిస్టులే గయ్యాళులు’’ అని చెప్పినప్పుడు, ‘‘ఔను మేము గయ్యాళులమే. నూరేళ్ళ క్రితం మధురవాణి మృదువైన మందలింపులు మీ దళసరి చర్మాలను ఆననప్పుడు మేం ఈటెల్లాంటి మాటలతోనే పొడుస్తాం…’’ అని ‘‘ఔను మేం గయ్యాళులమే’’ అనే కవితలో రావిశాస్త్రి మీద జాలితో ఆమె స్పందించగలిగిన తీరు ఆమె నిబద్ధతకి నిదర్శనం.
ఘనీభవించిన పితృస్వామ్య భావజాలాన్ని ధృవీకరింపజేసి, దాని బిందురూపం కూడా లేకుండా చేయడానికి అనేక రచనలు చేశారు ఓల్గా. ఆమె రాజకీయ కథల ద్వారా కలిగించిన శారీరక స్పృహని, ఎరుకని చాలామంది కథకులు మరికొంచెం ముందుకు తీసుకెళ్ళారు. ముఖ్యంగా స్త్రీ, పురుషుల సంబంధాలపై నిశితమైన విమర్శ చేస్తూ రాసిన ప్రయోగం, ‘మానవి’ లాంటి నవలలు చాలా ఆలోచింపచేస్తాయి. కుటుంబ వ్యవస్థని కూలంకషంగా చర్చించిన ‘స్వేచ్ఛ’ నవల సమాజంపై చాలా ప్రభావం చూపింది. ఆ నవల మీద ఏడేళ్ళ పాటు చర్చ జరగడమే అందుకు నిదర్శనం. పురాణ పాత్రలను తీసుకొని స్త్రీవాద దృక్కోణంలో ‘విముక్తి’ కథలు రాశారు. స్త్రీల రాజకీయ ప్రవేశానికి అడ్డుకునే స్థితిగతులను తెలిపే ‘గమనమే గమ్యం’ లాంటి చారిత్రక రాజకీయ నవల రాశారు. ‘యశోబుద్ధ’ ద్వారా స్త్రీలు స్వీయ ప్రతిపత్తి గురించి నిలబడాలని తెలియజెప్పారు. స్త్రీల శ్రమ, ప్రతిభ మరుగున పడిన వైనాన్ని గుర్తించి, ‘మహిళావరణం’ నిర్మాణానికి కారకులయ్యారు. స్త్రీలపై ఉన్న అణచివేతను బయట పెట్టడానికి ‘తోడు’ లాంటి సినిమాలు తీశారు. ఇలా స్త్రీవాదాన్ని అన్ని ప్రక్రియల్లోకి ప్రవేశపెట్టిన వ్యక్తి, అంతర్జాతీయ సదస్సులకి వెళ్ళి ఆ కార్యాచరణ ప్రణాళికను దక్షిణ భారతదేశ భాషలన్నింటిలో తయారుచేశారు. ఓల్గా కన్నా ముందే సావిత్రి ‘బందిపోట్లు’ వంటి పదునైన స్త్రీవాద కవిత్వం కన్పిస్తుంది. కానీ, వారి రచనలు బహు తక్కువ. సమాజంపై, తర్వాత రచయితలపై భావజాల మార్పునకు పూర్తిస్థాయిలో నిరంతరం దోహదపడలేవు. ఓల్గా బహుముఖ ప్రజ్ఞతో రచన, ఆనువాదాలను ఉద్యమ స్థాయిలో చేశారు. స్త్రీవాదాన్ని నిలబెట్టారు. కనుక ఓల్గాని యుగకర్తగా చాలామంది అంగీకరిస్తారు.
‘ఓల్గా అత్యంత బలమైన స్త్రీవాద రచయిత్రి అని, ఉద్యమ నేత్రి అనీ నేను కొత్తగా చెప్పనక్కరలేదు’
` ఎన్‌.గోపి
‘రాశిని బట్టి చూసినా, వాసిని బట్టి చూసినా ఓల్గా దరిదాపులకు రావడం ఎవరికైనా కష్టమే. మహిళల స్వేచ్ఛ, హక్కుల గురించి సామాన్యులకు అవగాహన కల్పించిన రచయితల్లో అగ్రస్థానం ఓల్గాదే’
` వసంత కన్నాభిరాన్‌.
‘తెలుగు సాహిత్యాలలో ఓల్గాది చెదిరిపోని సంతకం. ఎవరూ చెరపరాని సంతకం’ ` వంశీకృష్ణ.
‘ప్రతి సాహిత్యం, సందర్భం కొంతమంది కొత్త రచయితలను రంగం మీదకి తెస్తుంది. వర్తమాన సాహిత్య రంగంలో, ముఖ్యంగా స్త్రీవాద సాహిత్యరంగంలో ప్రముఖంగా చెప్పుకోవల్సిన పేర్లలో ఓల్గా ఒకరు’ ` డా.శ్రీదేవి.
‘తెలుగు సాహిత్యంలో తనని తాను నిరంతరం పండిరచుకొని ఒక సాహిత్య పరుస వేదిగా మారింది ఓల్గా’ ` పాడిబండ్ల రజని.
స్త్రీవాదం తొలిరోజుల్లో విపరీతంగా దాడిచేసి స్త్రీవాద వివాదాలు అనే పుస్తకాన్ని ప్రచురించిన ఎస్వీ సత్యనారాయణ గారే నిజాయితీగా తర్వాత స్వేచ్ఛ నవలపై చక్కని విశ్లేషణాత్మకమైన వ్యాసం రాశారు. ‘స్త్రీవాద నవలా సాహిత్యానికి లక్ష్యప్రాయంగా నిలిచిన రచన ఓల్గా రచించిన స్వేచ్ఛ’ అని పేర్కొన్నారు. ఇలా దాడిచేసిన వారి చేత శ్లాఘించబడి స్త్రీవాద సాహిత్య యుగకర్తగా నిలిచిన వ్యక్తి ఓల్గా.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.