ఆలోచించు – దినవహి సత్యవతి

పసి మొగ్గలను విరిసీ విరియక మునుపే
నిర్దాక్షిణ్యంగా నలిపి మసి చేస్తున్నావే
నీకు నాన్న అనిపించుకునే అర్హత ఉందా?

అక్క చెల్లెళ్ళ వంటి స్త్రీల స్వర్ణ భవితను
మదమెక్కి అంధకారం చేస్తున్నావే
నీకు అన్నతమ్ముడయ్యే అర్హత ఉందా?
మాతృమూర్తుల వంటి స్త్రీలపై కూడా
అత్యాచారానికి పూనుకుంటున్నావే
నీకు పుత్రుడు అనిపించుకునే అర్హత ఉందా?
మామ్మ వయసున్న మహిళలను సైతం
అమానుషంగా మానభంగం చేస్తున్నావే
నీకు పౌత్రుడని పిలిపించుకునే అర్హత ఉందా?
సృష్టికి కారణభూతురాలు, జనని వంటి
స్త్రీని కామాంధుడవై కబళిస్తున్నావే
నీకు ఒకరికి భర్త అయ్యే అర్హత ఉన్నదా?
పురుషుడవని అహంభావంతో విర్రవీగుతూ
పురుషుడికి ఆవశ్యకమైన సద్గుణములలో
మచ్చుకి ఏ ఒక్కటైనా లేని నీకు అసలు
లోకంలో జీవించి ఉండడానికి అర్హత ఉన్నదా?

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.