నేపథ్యం: భారతదేశంలో 19వ శతాబ్ది ప్రారంభంలో అనేక సాంఘిక దురాచారాలుండేవి. సతీసహగమనం, బాల్యవివాహాలు, వర్ణవిభేదాలు, భ్రూణ హత్యలు, ఆడ శిశువుల వధ, ప్రథమ సంతానాన్ని గంగానదిలో పారవేయడం లాంటి దురాచారాలు ప్రధానంగా స్త్రీలకు
సంబంధించినవే. ఆనాటి ప్రజానికానికి పాత ఆచారవ్యవహారాల పట్ల గౌరవభావం, నిరక్షరాస్యత, సంస్కరణలకు ప్రోత్సాహం లభించకపోవడం వంటి వాటిని సాంఘిక దురాచారాలకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. భారతీయుల్లో స్వాతంత్య్ర వాంఛ పుట్టుక ముందే సాంప్రదాయ సమాజాన్ని సంస్కరించాలన్న కోరిక బయలుదేరింది. 19వ శతాబ్దపు ఉత్తరార్థంలో క్రమంగా జాతీయోద్యమం బలాన్ని పుంజుకుంది.
1890 ప్రాంతం నుంచి ఇటు సంస్కరణోద్యమం, అటు స్వాతంత్రోద్యమం రెండూ సమాంతరంగా సాగుతూ వచ్చాయి. దీనికి కారణం: భారత జాతీయోద్యమ నాయకులు దురాచారాల సమస్యలు తొలిగిస్తే గానీ, భారత దేశం సంఘటితంగా ఉద్యమం సాగించలేదని భావించి జాతీయోద్యమంతో పాటు, మత`సాంఘిక సంస్కరణోద్యమాల ప్రాముఖ్యాన్ని గుర్తించి కొనసాగించారు. ఆత్మ విమర్శపట్ల ఉత్సాహం, విప్లవాత్మకమైన మార్పుల్ని ప్రవేశపెట్టవలెనన్న వాంఛ బెంగాల్లో 19వ శతాబ్ది ఆరంభంలోనే బయలుదేరింది. రాజారామ్‌మోహన్‌రాయ్ తలపెట్టిన మత, సంఘసంస్కరణ కార్యక్రమాలు వీటికి దోహదం చేశాయి. భారతీయ సాంస్కృతికోద్యమంలో బ్రహ్మసమాజం పాత్ర మరువలేనిది. ఆంధ్రదేశంలో కూడా బ్రహ్మసమాజం ప్రముఖ పాత్ర వహించింది. ఈ ఉద్యమం ద్వారా ఎన్నో అత్యుత్తమ వ్యక్తిత్వాలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి వాళ్లలో కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు.
పాశ్చాత్య విద్యా విధానం, ఆపైన ఆంగ్ల భాషా సాహిత్య ప్రభావం చేత మధ్య తరగతి మేధావులెందరో బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. వాళ్లు బౌద్ధిక స్వాతంత్య్రానికి, సామాజిక చలనశీలతకు ప్రతినిధులుగా ఉండి కొత్త భావాలకు వాహకులైనారు. సంఘ సంస్కరతోద్యమాలకు అవసరమైన దృక్పథాన్ని సామాజిక పునాదిని సమకూర్చిపెట్టారు. సామినేని ముద్దునరసింహం, కందుకూరి, గురజాడ, రఘుపతి వెంకటరత్నం, చిలకమర్తి మున్నగువారు సంఘ సంస్కరణోద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. వీళ్లతోపాటు ఆంధ్రదేశంలో అనేకమంది మహిళా సంఘ సంస్కర్తలు కూడా పుట్టుకొచ్చారు.
స్త్రీని శక్తితో పోలుస్తాం. స్త్రీలోని విశేష లక్షణం సహనం. ఈ సహనంతో స్త్రీ సాధించలేనిది లేదు. సంసారం, రాజకీయం, సంఘసంస్కరణ, చదువు, ఆరోగ్యం, శాస్త్రం, చట్టం మున్నగు క్షేత్రాల్లో చదువు వల్ల వచ్చే సామర్థ్యాలతో సాధించే కార్యాలే కాకుండా అనుభవం, ధైర్యం, తెలివీ, త్యాగభావం వల్ల వచ్చే యోగ్యతలతో సాధించే కార్యాలు కూడా స్త్రీ జాతి మహిమను చాటి చెప్పే సందర్భాలున్నాయన్నది తెలిసిన విషయమే. స్త్రీ తనని తాను సంస్కరించుకుంటూ ఇంటినీ, పిల్లల్నీ, తన బరువు బాధ్యతల్నీ, ఇరుగుపొరుగుల్నీ అన్నీ ఒకతాటి మీద నడిపే శక్తి గలది. సహజసిద్ధంగా పంచిపెట్టే గుణం కలది స్త్రీ. ఆహారం, సేవ, సంస్కారం, మంచిచెడుల విచక్షణా జ్ఞానం కుటుంబ సభ్యులందరికీ పంచిపెడుతూ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతూ భావి పౌరులుగా తీర్చిదిద్దగల చతుర నారి. ఇలాంటి బరువు బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే తనని తాను అబలకాదు సబల అని అనేక క్షేత్రాల్లో నిరూపించుకోగల సమర్థరాలని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. అలాంటి వాటిలో సంఘసంస్కరణోద్యమాన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. పురుష ప్రధాన వ్యవస్థ కలిగిన భారతీయ సమాజంలో దేశీయ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమంలో ఆంధ్రదేశంలోని మహిళా సంఘ సంస్కర్తలు ధైర్యంగా సమాజానికి ఎదురొడ్డి నిలబడి పోరాడి సమాజంలో మార్పుకు తోడ్పాటును అందించిన వారిలో ప్రధానంగా కందుకూరి రాజ్యలక్ష్మమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ, దువ్వూరి సుబ్బమ్మ, సంగెం లక్ష్మీబాయి, గోగినేని భారతీదేవి, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, ఎల్లాప్రగడ సీతాకుమారి, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి వాళ్ళను ప్రస్తావించవచ్చు.
కందుకూరి రాజ్యలక్ష్మమ్మ (1851 ` 1910) తూర్పుగోదావరి జిల్లా కంతేరు గ్రామంలో జన్మించారు. ఈమె అసలు పేరు బాపమ్మ. కాన్పు సమయంలో తల్లి చనిపోగా మేనమామ వెన్నేటి వేంకటరత్నం వద్దనే పెరిగింది. తన 8వ ఏటనే కందుకూరి వీరేశలింగాన్ని మనువాడిరది. తన చిన్నతనంలో నేర్చిన విద్య, మేనమామ నేర్పిన సంస్కారం తన భర్త చేపట్టే సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశాయి. భర్త స్థాపించిన వితంతు శరణాలయంలోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పించింది. తాను నివసించే ఆనందాశ్రమంలో వితంతువులకై ఒక ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది. కందుకూరి రాజ్యలక్ష్మమ్మ ఆంధ్రదేశంలోని అనేక మంది స్త్రీలకు ప్రేరణను కల్గించింది. దీంతో అనంతర కాలంలో ఎక్కువ మంది స్త్రీలు సంఘసంస్కరణోద్యమాల్లో పాల్గోనడానికి ఉత్సుకతను ప్రదర్శించారని చెప్పవచ్చు.
స్వాతంత్య్ర సమరయోదుడు, సంచలనం రేకెత్తించిన నిమాలపల్లొ నవలా రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ సతీమణి ఉన్నవ లక్ష్మీబాయమ్మ (1882 ` 1954). ఈమె 1882లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా అమీనాబాద్ గ్రామంలో జన్మించారు. వీరిది మధ్య తరగతి నియోగి బ్రాహ్మణ కుటుంబం. ఈమె కందుకూరి వీరేశలింగంచే ప్రభావితురాలై బాలవితంతువుల దీనస్థితిని చూసి వారి ఉద్ధరణకై గుంటూరులో 1902లో ావితంతువుల వివాహ్ణ కేంద్రాన్ని నెలకొల్పింది. ఆ సంవత్సరంలోనే మొదటి వితంతువు వివాహాన్ని జరిపించింది. తదనంతర కాలంలో దేశభక్త కొండా వెంకటప్పయ్య ఇంట్లో విద్యా బోధన, చేతి వృత్తులకై ఒక పాఠశాలను ప్రారంభించదలచారు. కాలక్రమంలో అదే నిశారదా నికేతనరుగా రూపొందింది. ఈ సంస్థ దీనస్థితిలో ఉన్న బాలికలకు, వితంతువులకు ఆశ్రయం కల్పించింది. ఈమె సహాయ నిరాకరణోద్యమం, ఉప్పుసత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిస్కరణ ఉద్యమాల్లో పాల్గొన్నారు. కొద్దిరోజుల పాటు లక్ష్మీబాయమ్మ ాశ్రీశారదా నికేతన్ణం అనే మాసపత్రికను కూడా నడిపారు. ఆ పత్రిక ద్వారా సంఘ సంస్కరణోద్యమానికి కృషి చేశారు.
దువ్వూరి సుబ్మమ్మ (1880 ` 1964) తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో 1880లో మధ్యతరగతి వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈమె భర్త మరణించగా శేష జీవితాన్ని దేశసేవలో గడిపింది. ఈమె 1920లో కాకినాడలో ప్రకాశం పంతులు అధ్యక్షతన జరిగిన రాజకీయ మహాసభలో గంభీరమైన ఊపన్యాసం చేశారు. 1932లో సత్యాగ్రహం చేసి రాజమండ్రి జైల్లో శిక్ష అనుభవించారు. సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆంధ్రదేశమంతటా ప్రచారం చేసింది. స్వదేశీ ఉద్యమం, ఖద్దరు అభివృద్ధికి ప్రచారం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్రోద్యమంతో పాల్గోని జైలుకెళ్ళిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ. సమాజ సేవకై, స్త్రీ జనోద్ధరణకై కృషి చేసిన నారి సుబ్బమ్మ. విరాళాలు సేకరించి స్త్రీలకు విద్య, వసతి సౌకర్యాలను కల్పించి, రాజమండ్రిలో సనాతన స్త్రీ విద్యాలయమనే బాలికల పాఠశాలను స్థాపించింది. అంతే కాక అనేక సంస్కరణోద్యమాల్లో పాలు పంచుకున్నారు.
సంగెం లక్ష్మీబాయమ్మ (1911 ` 1979) తెలంగాణాలోని ఘట్‌కేసర్ సమీపంలో ఒక కుగ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు భర్తను కూడా కోల్పోయింది. సంఘసేవకురాలు. గుంటూరు ాశారదా నికేతన్ణంలో హిందీ విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ఉప్పు సత్యాగ్రహంలోనూ, ఆచార్య వినోభాబావే భూదాన ఉద్యమంలోనూ జైలుకెళ్లారు. హైదరాబాదులో ాఇందిరా సేవా సదన్ణం అనే అనాథ బాలికల వసతిగృహాన్ని నిర్వహించారు. 1954లో బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది స్త్రీలను ఉద్యమాల్లో భాగస్వాములను చేసింది. మరణించేంత వరకు స్త్రీలు, బాలికల సంక్షేమానికై నిర్విరామంగా కృషి చేశారు లక్ష్మీబాయమ్మ.
గోగినేని భారతీదేవి గుంటూరు శారదా నికేతనం, మద్రాసు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించారు. ఈమె కిసాన్ సంఘం ఉద్యమనేత ఆచార్య రంగా సహధర్మచారిణి. ఈమె రంగాగారితో పాటు భారత జాతీయోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం వంటి వాటిలో పాల్గొని జైలు శిక్షను కూడా అనుభవించారు. కర్షక, కార్మిక, విద్యార్థి ఉద్యమాలకు విశేషంగా సేవలందించారు.
దుర్గాబాయి దేశ్‌ముఖ్ పుట్టింది రాజమండ్రిలోనైనా పెరిగింది కాకినాడ. అందుకే సాంఘిక, రాజకీయ కళారంగాలపై ఆమెకి బలమైన నమ్మకాలు ఏర్పడడానికి దోహదం చేసింది. దుర్గాబాయి హిందీ ప్రచారానికి, ఖాదీ అభివృద్ధికి, స్త్రీ మానసిక వికాసానికి ఎనలేని సేవ చేశారు. ఉప్పు సత్యాగ్రహం విషయంలో మూడుసార్లు ఖైదు జీవితం చవిచూశారు. వితంతువులు, వయస్సు మళ్లిన స్త్రీల కోసం 1938లో ఆంధ్రమహిళా సభను మద్రాసులో స్థాపించారు. స్త్రీల కోసం 1942లో ఆంధ్రమహిళ పత్రికను నెలకొల్పారు. 1958లో హైదరాబాదులో ాఆంధ్ర మహిళా శాఖ్ణను ప్రారంభించారు. ఈ శాఖ ద్వారా చేనేత వుత్పత్తిలో తర్ఫీదు, ప్రాంతీయ చేతిపనుల కేంద్రం, నర్శింగ్ హోమ్‌లు, నిరక్షరాస్యత నిర్మూలన కేంద్రాలు నెలకొల్పింది. 1972లో హైదరాబాదులో ాలిటరసీ హౌస్ణ్‌ను ప్రారంభించింది. రాజ్యాంగ సభలో ప్రథమ మహిళా సభ్యురాలుగా, కేంద్ర సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకురాలిగా, మహిళల హక్కుల కోసం నిరంతరం పోరాడారు. ఈమె సేవలకు గుర్తింపుగా 1975లో పద్మవిభూషణ్ బిరుదుతో భారత ప్రభుత్వం సత్కరించింది.
ఎల్లాప్రగడ సీతాకుమారి స్త్రీల చైతన్యం కోసం, నిరాశ్రయులైన స్త్రీల కోసం నిర్మాణాత్మకమైన కృషి చేశారు. ాఆంధ్ర యువతీ మండల్ణి సంస్థాపక సభ్యులలో ఈమె ఒకరు. 1934లో ఖమ్మంలో జరిగిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలో స్త్రీల సభకు సీతాకుమారి అధ్యక్షత వహించారు. మహిళా చైతన్యం, మహిళాభివృద్ధి, సంఘసేవా కార్యక్రమాలు నిర్వహించి వందలాది నిరాశ్రయులైన స్త్రీలకు రక్షణ కల్పించారు. పైన చెప్పిన ప్రముఖ ఆంధ్ర స్త్రీ సంఘ సంస్కర్తలే కాక ఇంకా అనేక మంది స్త్రీ సముద్ధరణకై పాటుపడ్డారు. వారిలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తంజావూరుకు చెందిన ఆర్.ఎస్.సుబ్బలక్ష్మీ 10 సంవత్సరాలకే వితంతువయ్యింది. ఈమె వితంతువుల కోసం కుల, మత, జాతి వివక్షణ లేకుండా వితంతువుల పునర్వివాహాల కోసం ఎంతగానో కృషి చేసింది. సంఘ సంస్కర్తగా, విద్యావేత్తగా గుర్తింపు పొందారు.
సరోజినీ నాయుడు, విజయలక్ష్మీ పండిట్, కమలాబాయి ఛటోపాద్యయ వంటి పలువురు మహిళా సంఘసంస్కర్తలు జాతీయోద్యమంలో సాంఘిక సంక్షేమ సేవా రంగాల్లో విశేషంగా శ్రమించి, నేటి మహిళా సంస్థలకు ఆదర్శ ప్రాయంగా నిలిచారనటంలో సందేహం లేదు. వీళ్లే కాకుండా స్త్రీల వ్యక్తిత్వాన్ని గౌరవించి వాళ్ల సేవా నిరతిని, సామర్థ్యాన్ని గుర్తించి దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు శ్రమించిన యామినీ పూర్ణ తిలకం, గంధం ఆమ్మన్న రాజాలు గాంధీజీ స్ఫూర్తితో సేవలు అందించారు. తెలంగాణా పోరాటకాలం (1946`1952)లో ప్రముఖపాత్ర వహించిన ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, నరసమ్మలు స్త్రీలలో జాగృతిని, చైతన్యాన్ని తీసుకువచ్చారు. కొమర్రాజు అచ్చమాంబ, ప్రేమలతా గుప్త, ఎల్లా ప్రగడ సూర్యకుమారి తదితరులు కుటుంబ నియంత్రణ ఉద్యమానికి సారథ్యం వహించారు.
స్త్రీ సముద్ధరణలో ఆంధ్రరాష్ట్ర మహిళా సంఘాలు
1929లో డా.ముత్తు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన ప్రథమాంధ్ర రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ సదస్సులో దేవదాసీ వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిషేదం, తండ్రి ఆస్తిలో కుమార్తెకు వాటా కోరుతూ తీర్మానాలు ఆమోదించారు. 1932లో ఆచంట లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన మహాసభలో వివాహాలను రిజిష్టరు చేయించాలని తీర్మానించారు. తెలంగాణాలో 1934, 1936 ఆంధ్ర మహిళా సభలకు టి.వరలక్ష్మమ్మ, ఎల్లాప్రగడ సూర్యకుమారి, బూర్గుల అనంతలక్ష్మీ అధ్యక్షత వహించారు. 1940లో చిలుకూరులో రంగమ్మా ఓబుల రెడ్డి అధ్యక్షతన జరిగిన 8వ ఆంధ్ర మహిళా సభలో వితంతువులకు భర్త ఆస్తిలో హక్కులు, పునర్వివాహ హక్కులు కోరబడినాయి. పరదా వ్యవస్త తొలిగించాలని, బహుభార్యత్వం నిషేదాన్ని ఆశించారు. 1945, 1946లలో ఆంధ్ర రాష్ట్ర మహిళా సభలు అస్పశ్యతా నివారణ, మధ్యపాన నిషేదాన్ని కోరాయి. ఆంధ్ర ప్రాంతపు కమ్యూనిష్టు మహిళలు1947లో ప్రథమ రాష్ట్ర మహాసభను నిర్వహించారు. గ్రామాలలో కార్యకలాపాలు అధికంగా నిర్వహించారు. 1964లో ాఆంధ్ర మహిళా సమాఖ్య, ఆంధ్ర మహిళా సంఘ్ణం రెండిరటినీ కమ్యూనిష్టులు స్థాపించారు. అఖిల భారత మహిళా సభకు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర యువతీ మండలి, మహిళా నవజీవన మండలి, లేడీ హైదర్ క్లబ్, విజయవాడలో ాభారత మహిళా మండల్ణి స్త్రీల ఉన్నతికి విశేష కృషి చేశాయి.
హైదరాబాద్ ాఆంధ్ర మహిళా సభ్ణ నిరక్షరాస్యత నిర్మూలనం, వికలాంగుల సేవా కేంద్రం, ఆసుపత్రి, పదవీ కళాశాలలు, నర్సుల శిక్షణ కేంద్రాల్ని కె.సుగుణమణి నాయకత్వంలో కృషి చేస్తోంది. ఓల్గా సహాయంతో ఫెమినిస్ట్ స్టడీ సర్కిల్ స్త్రీ అధ్యయన తరగతులు నిర్వహించింది. మహాళాభ్యుదయం కోసం అవేర్, క్రాస్, ఆర్టిక్, దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ వంటి సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి.
విజయవాడలో మైత్రీ పోద్భలంతో వాసవ్య మహిళామండలి, నిజామాబాద్‌లో హేమలత పర్యవేక్షణలో ాభోగినుల్ణకు సహాయం చేసే ాసంస్కార్, సమత్ణా జ్ఞాన ` విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తున్నారు. మల్లాది సుబ్బమ్మ ాఅభ్యుదయ మహిళా సంస్థ్ణను స్థాపించి కుటుంబ సలహా కేంద్రం, స్త్రీ విమోచన, స్త్రీల హక్కుల పరిరక్షణ వంటి విషయాల్లో స్త్రీలలో జాగృతి కలిగించడానికి కృషి చేస్తోంది.
ముగింపు: భారతదేశంలో నేడు స్త్రీలు ప్రాచీన మధ్యయుగపు బానిస సంకెళ్ళు నుంచి విముక్తి పొంది, స్వాతంత్య్రపు స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుతున్నారంటే సంఘంలో అనేక మంది స్త్రీ పురుష సంఘ సంస్కర్తల కృషి ఫలితమే. మహిళా ఉద్యమం, సంఘసంస్కరణలు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ` కందుకూరి సతీమణి రాజ్యలక్ష్మమ్మ. స్త్రీ జన పునర్వికాసానికి ఆంధ్రదేశంలో బాటలు వేసి, మార్గదర్శకులైనారు. స్త్రీల విద్యకు, మూఢవిశ్వాసాల నిర్మూలనకు, స్త్రీలను బాధించే దురాచారాలను ఖండిరచడానికి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ఉపన్యాసాల ద్వారా మహిళాభ్యుదయానికి కందుకూరి దంపతులు ఎంతో పాటుపడ్డారు. అనంతర కాలంలో దేశంలో జనించిన జాతీయోద్యమం, సంస్కరణోద్యమాలలో పాల్గొంటున్న మహిళల ప్రేరణతో ఆంధ్రదేశంలో కూడా అనేక మంది స్త్రీలు సంఘ సంస్కరణోద్యమంలో పాలుపంచుకొని మహిళా అభ్యున్నతికి, సామాజిక పురోగమనానికి తమ జీవితాల్ని అంకితం చేశారు. సంఘంలోని దురాచారాలు, మూఢాచారాల బాహువుల్లో బంధించబడిన మహిళల విముక్తికై ఎంతో మంది ఉద్యమాలు సాగించి సమాజంలో అలుముకొన్న దురాచారపు చీకట్లను తొలగించి స్త్రీ స్వేచ్ఛా జీవితాన్ని గడపడానికి, స్త్రీ సముద్ధరణకై పాటుపడ్డారు.
ఉపయుక్త గ్రంథ సూచి
1. లలిత.కె (1985). నిమనకు తెలియని మన చరిత్ర, తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు, స్త్రీ శక్తిు. సంఘటన ప్రచురణలు, హైదరాబాద్.
2. వరలక్ష్మి జె. (1977). నియుగయుగాలలో భారతీయ మహిళు. ప్రియదర్శిని ప్రచురణ, హైదరాబాద్.
3. విజయలక్ష్మి సి. (1965). నివిషాద భారతరు. అభ్యుదయ సాహితీ ప్రచురణ, హైదరాబాద్.
4. ముద్దుకృష్ణ (1966). నివైతాళికులు. ఆదర్శ గ్రంథ మండలి, విజయవాడ.
5. ఎస్.హెచ్.సౌభాగ్యమ్మ (1989). నిమనం మన పాత్రికేయులు. ఎస్.హెచ్.ప్రచురణలు, తిరుపతి.
6. డా.నాగయ్య జి. (2004). నితెలుగు సాహిత్య సమీక్షు. నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి.
7. డా.ద్వా.నా.శాస్త్రి (2001). నితెలుగు సాహిత్య చరిత్రు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
8. ఆంధ్ర విదుషీమణులు. నిఆండ్ర శేషగిరిరావు. ఆంధ్రభూమి బుక్ డిపో, విశాఖపట్నం.
9.Sita Anantha Raman (2009). “Women in India : A Social & Cultural history. Vol-I..
10. www.andhramahilasabha.org.in
11. www.teluguwishes.com (సహాయ ఆచార్యులు, తెలుగు అధ్యయన శాఖ, బెంగుళూరు విశ్వవిద్యాలయం)