అదే చట్రం…..

డా|| ఎ.సీతారత్నం
‘పూర్వంలా కాదు. ఇప్పటి ఆడపిల్లలకేం… కావాలంటే ఆ అమ్మాయిని అడగండి…’ అని ఒక మేడమ్‌ నావైపు చూపడంతో నాతో పనిచేస్తున్న టీచర్స్‌ అందరి దృష్టీ నామీద పడింది.
 నా పేరు కాంచన. మా నాయనమ్మ పేరు. కాంచనదుర్గ. నాజూగ్గా ఉండదని దుర్గ తీసేసి కాంచన అని పెట్టారు. చిన్నప్పుడు మా నాన్న సినిమా ఏక్టర్‌ కాంచనలా వుంటానని మురిసిపోయేవారు. పెద్దయ్యాక సినిమా ఏక్టర్‌ అనుష్కలా అందంగా వుంటానని తీర్మానించారు. నేను అందగత్తెననే విషయం నా అయిదో ఏడునే అర్థమయ్యేటట్టు చేసారు. ఎమ్‌.సెట్‌లో లక్షల మీద రేంక్‌ వచ్చింది. రెండులక్షలు కడితేగాని సీటు రాదన్నారు. దానికి తోడు ఎక్కడికో పంపాలి. మళ్లీ పెళ్లికి ఖర్చే కదా… అని, దూరంగా ఇంత అందమైన అమ్మాయిని ఏం పంపుతామని ఔ.ఐబీ. కంప్యూటర్‌లో చేర్చారు. నేను |రీశి ్పుజిబిరీరీ డిగ్రీ తెచ్చుకొన్నాను. ఎమ్మెస్సీ చదువుదామనే అనుకొన్నాను. కానీ వీధి చివర ఆంటీవాళ్ల అబ్బాయి ఔ.ఊలిబీనీ చేసి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న గణేష్‌ నన్ను చూసి చాలా ఇష్టపడ్డాడుట. అందుకని వాళ్లు పిల్లనియ్యమని అడిగారు. వాళ్లంతట వాళ్లు అడిగారు. ఆస్తిపరులు. మంచివాళ్లు. చదువుకొన్నవాళ్లు. పైసాకట్నం లేదు. కాదనడానికి మావాళ్లకి కారణం లేదు. నాకు మాత్రం ఆ.స్త్ర. చేస్తే మంచిదేమో అన్పించింది. యూనివర్శిటీ మెట్లు ఎక్కే యోగం లేదేమో అనుకొన్నాను. కొంతమంది మాత్రం అప్పుడే పెళ్లికి తొందరేంటి, చదివించు… అని సలహా ఇచ్చారు. నేను కూడా అమ్మని నెమ్మదిగా అడిగాను. అమ్మా నాన్నలకి నేనంటే ఎంతో గారం. ఒక్కర్తినే. అబ్బాయికోసం చూడకుండా నన్ను బాగా చూసుకోవాలని ఆపరేషన్‌ చేయించుకున్నారు. అందుకనే అమ్మతో పోట్లాడాలన్పించదు. అమ్మని పదేపదే అడిగా. అమ్మ ”నీ మొహం. తర్వాతైనా చదువుకోవచ్చు. చుట్టాల కబుర్లు వినకు. అందరికీ జెలసీనే. ఇంత మంచి సంబంధం కాళ్ల దగ్గరకొచ్చిందనీ కుళ్లుబోయేవాళ్లే. వాళ్లకేం తెలుసు. నువ్వు మా బంగారానివి. నే చెప్పినట్టు విను. నాన్నకి ఈ సంబంధం చాలా ఇష్టం. ఆ కుర్రాడు ఎంత బాగున్నాడు. షారూక్‌ఖాన్‌లా ఉన్నాడు. మీ ఇద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా ఉంటారు… అని అనగానే అతని రూపం కళ్లల్లో కనబడింది. అతని నవ్వు నిజంగానే చాలా మోహనంగా ఉంటుంది. కనుబొమ్మలెగరేస్తూ చూపుతోనే పలకరించే తీరు… తలచుకొంటేనే వొళ్లు ఝల్లుమంది. అంతే, చదువు సంగతి వదిలేసాను. పెళ్లయ్యాక చదువుతానులే అనుకొన్నాను. పెళ్లి సందడిగా జరిగింది. పూర్వంలా మగపెళ్లివారి అలకలు అవీ ఏవీ లేవని, అంతా మురిసిపోయారు.
 పెళ్లయ్యాక అతను విలన్‌లా ఉంటాడని అనుకోకండి. అతను చాలా మంచివాడు. నా చదువుకీ ఓకే అన్నాడు. ఇంటిపనులన్నిటిలో సాయం చేస్తాడు. ఉల్లిపాయ తరిగితే నాకు కళ్లనీళ్లు వస్తాయని అతనే తరుగుతాడు. పొద్దున్న ఏడుగంటలకి కాఫీ ఇస్తే తాగి వెళ్లిపోతాడు. టిఫిన్‌, భోజనం అన్నీ కంపెనీలోనే. రాత్రి నేను చేస్తే తింటాడు. లేదా పేక్‌ చేసి ఇద్దరికీ తెచ్చేస్తాడు. ఆదివారం అంతా తిరుగుడే. అసలుకాలం తెలియలేదు. ఇల్లు అందంగా సర్దుకోవడం. అతను వెళ్లగానే తలుపు వేసుకొని నిద్రపోవడం… నచ్చినపుడు లేవడం… ఇష్టమైనవి తినడం… స్వేచ్ఛగా అన్పించింది. యూనివర్శిటీలో చేరదామనుకొన్నాను. బెంగుళూరులోనే చదవమని రిక్వెస్ట్‌ చేసాడు. సరేననుకొన్నాను. అప్లికేషన్‌ పెట్టే సమయానికి మా అత్తగారికి హైబీపీ రావడం, హాస్పిటల్‌లో చేరడం… ఆమెకు సాయంకోసం నేను మావూరు వెళ్లాను. అర్ధరాత్రి ఇంటికి చేరే గణేష్‌కి అప్లికేషన్‌ తెచ్చే సమయం లేదు. ఒక్కసారి ఫ్లైట్‌లో వచ్చి వాళ్లమ్మని చూసి తల్లి అనారోగ్యంకి బాధపడుతూ వెళ్లిపోయాడు. నెలాపదిహేనురోజుల తర్వాత బెంగుళూరు వెళ్లాను. అప్పటికి టైమ్‌ అయిపోయింది. మూడుపూటలా ఫోను చేస్తుంది అమ్మ. అమ్మకి ఈ ఏడాది ఎమ్‌ఎస్సీలో చేరడం అవదని బాధగానే చెప్పాను. పోన్లెద్దూ, కరస్పాండెన్స్‌ కట్టేయ్‌. సంవత్సరం దండగ అవదు. యూనివర్శిటీల్లో మాత్రం అన్ని క్లాసులు అయిపోతాయా ఏంటి? నాన్న ముందే ఈ మాట అన్నారు. కాలేజీకి వెళ్లి వచ్చి ఇంట్లో చేసుకోవడం కష్టం. మీ అత్తగారు కూడా వస్తారట కదా… అంది. ఆ మాట నిజమేనన్నాడు గణేష్‌. ఎవరో ఫ్రెండ్‌కి చెప్పి అప్లికేషన్‌ తెప్పిస్తానన్నాడు. ఇంకా చాలా టైమ్‌ ఉంది. గణేష్‌ బిజీ అయిపోయాడు. ఇంట్లో ఒక్కర్తినీ… అంతకుముందులా స్వేచ్ఛగా హాయిగా ఉన్నానన్పించడంలేదు. బోర్‌గా అన్పించింది. ఆ మాట అంటే బోర్‌ కొడితే ‘షాపింగుకి వెళ్లు’ అని జు.ఊ.ఖ. కార్డ్‌ ఇచ్చాడు. అక్కడ నుండీ షాపింగు హేబిట్‌ అయింది. కనిపించినవన్నీ కొనడం… అక్కడా ఏదో ఒకటి తినేయడం… ఇంటికి రావడం మొదలెట్టాను. మధ్యలో ఎప్పుడైనా ఆ.స్త్ర. పుస్తకాలు తీస్తున్నాను. ఒకసారి వైరల్‌ ఫీవర్‌ వచ్చింది. ఏంటీబయాటిక్‌ రియాక్షన్‌ ఇచ్చింది. కదిలే స్థితిలేదు. మా అమ్మ పరిగెత్తుకు వచ్చింది. ఇల్లంతా సర్దుతూ… ఏవిటీ సామాను. ఇద్దరి మనుషులు. అయిదు రకాల కుక్కర్లు, రైస్‌కుక్కర్‌… ఎనిమిదిరకాల డిష్‌లు గరిటలు… ఆరురకాల డైనింగు సెట్స్‌… ఎందుకివన్నీ… కుప్పలు కుప్పలున్న బట్టలు… సర్దడానికి విసుగొచ్చింది అమ్మకి. రకరకాల జీన్స్‌లు, గాగ్రాలు… డబ్బుంటే బంగారం కొనుక్కో. ఇలా తగలబెట్టకు… అని చెప్పింది. ఆ మాటవిన్న గణేష్‌ ‘నిజమేనండీ. మొన్న రూబీ సెట్‌ బలవంతాన కొన్నాను. మళ్లీ నెల పగడాలసెట్‌ కొంటాను… అన్నాడు. అక్కడనుండీ బంగారం కొనడం మొదలెట్టాను. ముత్యాలు, పగడాలు… పదివారాల నగలు… పెళ్లికి ఉన్న హారాలు… గాజులు… బేంక్‌లాకర్‌లో పెట్టాము. ఇంట్లో వుంటే భయం. ఒక్కర్తినీ ఉంటా గదా! మొదట్లో ఏ ఫంక్షన్‌కి వెళ్లినా తెచ్చుకొనేదాన్ని. తర్వాత గణేష్‌కి బిజీగా ఉండి, ఒక్కర్తినీ వెళ్లలేక మానేసాను. అమ్మ, నాన్న మూడుపూటలా ఫోను చేస్తారు. అమ్మ పుట్టినరోజుకి వెళ్లినా ఏదో సెట్‌ పెట్టుకొని వెళ్లమంటుంది. బేంక్‌కి వెళ్లి తెచ్చుకోమంటుంది. కానీ నాకు బద్ధకం…
 అమ్మతో వెళ్లిన పెళ్లికి మాత్రం అన్నీ తీసుకువెళ్లాలి. అన్నీ పెట్టుకొని పట్టుచీర రెపరెపలాడిస్తూ తిరుగుతుంటే అమ్మకి ఎంతో గర్వం. చిన్నప్పుడు కనురెప్పలు వేసి తెరుస్తూ వుండే నా డాలీ బొమ్మని చూపించి నేను ఎలా మురిసిపోయేదాన్నో అమ్మ నన్ను చూపించి అందరికీ అలానే మురిసిపోతుంది. అటు ఇటూ తిరుగుతూనే ఎమ్‌ఎస్సీ పూర్తిచేసాను. కానీ 55% కూడా రాలేదు. మా అమ్మా, నాన్న మాత్రం సంతోషించారు. ‘ముందు పెళ్లి చేసేసామని అంతా అన్నారుగానీ ఏం కోల్పోయింది. దానికీ తోటివాళ్లతో పాటు ఎమ్‌ఎస్సీ అయిపోయింది. దానికి ఉద్యోగం అవసరం ఏముంది? వాళ్లాయన సాఫ్ట్‌వేర్‌ అనేది. నిజమేననుకొన్నా. నాన్న కూడా వాళ్ల అమ్మ ఉద్యోగంతో పడిన పాట్లు చూసింది కదా, అవసరం లేనపుడు ఉద్యోగం దేనికీ?’ అన్నాడు. పెళ్లిళ్లలో మాత్రం చాలామంది సరదాగా పొట్ట మీద చెయ్యివేసి విశేషమా అనేవారు… లేదంటే ఇంకా లేకపోవడమేమిటనేవారు. ఆ మాటకి మా అమ్మ చివుక్కుమనేది. ఒకసారి ఒక ఆంటీ 21/2 సంవత్సరాలవుతున్నా పిల్లలు లేకపోవడమేమిటి? అసలే సాఫ్ట్‌వేర్‌ వాళ్లకి ‘ఇన్‌ఫెర్టలిటీ’ వస్తోందంటున్నారు. ‘తొందరబడండి…’ అని ఉచిత సలహా ఇచ్చారు. అలా ఒకరూ వొకరూ హాస్పిటల్‌కి తీసుకువెళ్లమన్నారు. అంతే, అమ్మ వెంటనే పదమంది. దాని వయసు అనగా ఎంత, అని కొందరు అన్నా విన్పించుకోలేదు. నలుగురూ చంకన బిడ్డని వేసుకొని తిరుగుతుంటే దానికీ ఉంటుందిగా… అని తనే బాధపడి పదమంది. క్లీనింగు చేస్తామన్నారు. ఏవో టెస్ట్‌లు చేసారు. లోపం ఏదీ లేదంటూనే నాలుగయిదుసార్లు రమ్మన్నారు. విటమిన్స్‌.. ఏవో కొన్ని మాత్రలు ఇచ్చారు. రెండునెలల్లో జీవితం డాక్టర్‌ చేతిలోకి వెళ్లింది. తర్వాత స్పెర్మ్‌కౌంట్‌ టెస్ట్‌ చేసారు గణేష్‌కి. కొద్దిగా తక్కువ వుందని ట్రీట్‌మెంట్‌ మొదలెట్టారు. అలా ఆరునెలలయింది. కౌంట్‌ పెరిగిందన్నారు. అయినా నేను ఏ నెలా తప్పలేదుగాని పూర్వంలాగ ఎక్కడకీ వెళ్లడం లేదు. ఎప్పుడూ ఏదో బాధలానే ఉంది. ఆ తర్వాత హార్మోన్‌ ఇంజక్షన్‌ ఇచ్చారు. అమ్మకి సెలవులేక నాన్న నెలరోజులు సెలవుపెట్టి వచ్చారు. నేను చాలా నీరసంగా తయారయ్యాను. తర్వాత అమ్మ మెడికల్‌ లీవ్‌ పెట్టి వచ్చింది. తనకేదో చాలా లోటు ఉందన్పించింది. మనసంతా బాధ. ఏలోటూ లేని జీవితం నీదని అనుకొంటే ఇలా అవుతోందేంటని అమ్మ బాధ… అసలు చూడలేకపోయాను. తిరుపతి మెట్లు నడిచి ఎక్కింది. అయినా ఫలం లేదు. పైగా టైఫాయిడ్‌ వచ్చింది. దాంతో జీవితం విరక్తిగా అన్పించింది. ఎప్పుడూ బెడ్‌రెస్టే. హార్మోన్‌ ఇంజక్షన్‌ వలనో… బెడ్‌రెస్ట్‌ వలనోగానీ వొళ్లు బాగా వచ్చింది. నాజూగ్గా, అందంగా ఉండే నేను లావుగా తయారవడం మరింత దిగులు కలిగించింది. అమ్మకి సెలవు లేదు. గణేష్‌ పొద్దున్నపోతే రాత్రి 10 గంటలదాకా రాడు. అందుకని అమ్మ తనతో రమ్మనమంది. డాక్టర్స్‌ హార్మోన్స్‌కి రాకుంటే |.ఙ.ఓ. చేయించుకోండి… స్పెర్మ్‌ డైరక్ట్‌గా ఎక్కించి గర్భం తెప్పిస్తాం అన్నారు. టైఫాయిడ్‌ తగ్గి కాస్త కోలుకొన్నాక వస్తామని మావూరు వచ్చేసాం. రెండునెలలయేసరికి కాస్త కోలుకొన్నాను. ట్రీట్‌మెంట్‌కి మళ్లీ వెళ్దామంది అమ్మ. మా అత్తగారు మాత్రం నాకు 12 సం|| తర్వాత సంతానం కలిగింది… అన్నారు. అయినా అమ్మ, నాన్నకి బాధే. మా ఆడబడుచు పురుటికి వచ్చింది. పురుడు అయ్యాక ట్రీట్‌మెంట్‌ మొదలెట్టమన్నారు అత్తగారు. ఆవిడకి 65 సం|| వయసు. కోడలు సాయం ఉండాలనుకొంది. మా అమ్మకి చాలా బాధ. నువ్వు కడుపుతో ఉంటే నీకూ ఆ పని తప్పదుగా… అంది. నేను పట్టించుకోలేదు. ”ఈశుకి ఇల్లు కట్టగలం గానీ పంతానికి పాపని కనగలమా” అని మా అత్తగారు తేల్చిపారేసారు. ఆడబిడ్డ పాపని చూసాక నాకూ కావాలన్పించింది. అమ్మ మాటకి సరేనన్నాను. కంపెనీ డబ్బులు ఇస్తుంది. దానికి డబ్బుకి లోటులేదని… అమ్మ కాస్త గర్వంగానే మొదలెట్టింది. సాఫ్ట్‌వేర్‌ వాళ్లంటే కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కి చాలా ఇష్టం. బిల్లు కూడా చూపించక్కర్లేదు మాకు. గణేష్‌ సంతకం పెడితే చాలు. వాళ్లే కంపెనీ నుండీ డబ్బులు తెచ్చుకొంటారు. నెలసరి వచ్చిన 5వ రోజే మొదలెట్టారు ట్రీట్‌మెంట్‌. సాయంత్రం దాకా హాస్పిటల్‌లోనే ఉండి ఇంటికి వచ్చాము. తర్వాత బెడ్‌రెస్ట్‌. అమ్మ కంటికిరెప్పలానే చూసింది. నెలయింది. కలలు కనడమే మిగిలింది. చక్కగా పీరియడ్స్‌ వచ్చాయి. ఉసూరుమన్పించింది. ప్రతివాళ్లూ ఫోన్లే… ఏదో పోగొట్టుకొన్న ఫీలింగు.
 మూడుసార్లు అయితే సాధారణంగా వస్తుందన్నారు డాక్టర్లు. నాలుగుసార్లయింది. డబ్బు మంచినీళ్ల ప్రాయమంది. ఆరుసార్లయింది. ఒళ్లు గుల్లయింది. నాన్న కూడా మూడు లక్షలు ఖర్చు పెట్టాడు. గణేష్‌ కంపెనీ లిమిట్‌ దాటిపోయింది. నాన్న మొహం మాడిపోయింది. మేము కొంత పెడ్తాం బాబూ… అని అమ్మ చాలాసార్లు చెప్పడంవల్లనేమో ఆ మూడులక్షలు వాళ్లే పెట్టుకొన్నారనుకొన్నాడు గణేష్‌. అప్పుడే మార్కెట్‌ డౌన్‌. అతనికి ఉద్యోగ టెన్షన్‌ పెరిగిపోయింది. అమ్మ ఫరవాలేదన్నా… నాన్న ముఖంలో ఏడాదిలో రిటైర్‌ అయిపోతున్నా… చాలా ఖర్చయిపోయిందన్న బాధ కన్పించింది. అమ్మకి మాత్రం ఏదోలాగ ఒక బిడ్డకి తల్లినిచేసి… దీనికి జీవితంలో ఏ లోటూ లేదన్పించాలని తాపత్రయం. నాకయితే జీవితం ఏదో పెద్ద సమస్యల వలయంలో కూరుకుపోయిందన్పించింది. డిప్రెషన్‌… డిప్రెషన్‌… అమ్మా, నాన్న వెళ్లిపోతే ఒంటరిగా వుండాలనే భయం… డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నా… ఏ పనిమీదా ఆసక్తి లేదు. ఎవరికోసం బ్రతకాలన్నంత దుఃఖం. డాక్టర్‌ కౌన్సిలింగుకి తీసుకువెళ్లమంది. అమ్మ నిజమేనంది. కౌన్సిలింగుకి మళ్లీ డబ్బులు… గణేష్‌ డబ్బులిచ్చాడు. హమ్మయ్య అనుకొన్నాను. మూడు సిట్టింగులయ్యాయి. ఏంటో ఊ.ఙ. స్విచాఫ్‌ చేసినట్టుగా బ్రెయిన్‌ స్విచాఫ్‌ చేసి వెళ్తున్నాను. మరో రెండు సిట్టింగులు అయినా పెద్దగా లాభం లేకపోయింది. బిడ్డ వుంటేగానీ ఆ అమ్మాయి సరికాదు… |ఙఓ అదే టెస్ట్‌ట్యూబ్‌ బేబీకి ట్రై చేయమన్నారు. అమ్మకి నిజమేనన్పించింది. చాలా డబ్బులవుతాయి. జెనెటిక్‌ టెస్ట్‌లు అవీ… అని మొదలెడితే… అసలే కంపెనీ మారాలనుకొంటున్న గణేష్‌కి కష్టమన్పించి మౌనంగా ఉన్నాడు. నాన్న ఇప్పట్నించీ ఎందుకు? దాన్ని కాస్త తేరుకోనీయి… అన్నాడు తను డబ్బులు పెట్టలేక… ఆ సందర్భంలోనే ఆంధ్రా వచ్చేస్తే గానీ నాకు డిప్రెషన్‌ తగ్గదని… ఆంధ్రాలో ఉద్యోగం చూసుకోమని తేల్చేసారు. దానికి మా అత్తగారు కూడా వత్తాసు పలికారు. అమ్మానాన్న మా ఊరు వెళ్తే నన్ను కూడా తీసుకువెళ్లారు. గణేష్‌ సీరియస్‌గా ఉద్యోగప్రయత్నం చేసి హైద్రాబాద్‌ వచ్చేసాడు. అంతా సంతోషించారు. అమ్మా నాన్న హైదరాబాద్‌లో దింపారు. అన్నీ సర్దిపెట్టారు. నాకు మాత్రం వొళ్లు బాగా వచ్చిందికానీ ఉత్సాహం అంతా పోయిందన్పించింది. జీవితం దిగులుగా అన్పించింది.
 ఉద్యోగంలో చేరితే బాగుంటుంది… కాస్త దిగులు తగ్గుతుంది అన్నాడు నాన్న. నిజమేనన్నాడు గణేష్‌. వాళ్ళు ముగ్గురూ నేను ఉద్యోగంలో చేరాలని నిర్ణయించారు. నిజమేననుకొన్నాను. తనకి పి.జి.లో 55% రాలేదు కనుక లెక్చరర్‌ పోస్ట్‌ రాదు. బి.ఎస్సీ కంప్యూటర్స్‌ ఎప్పుడో మరచిపోయాను. కంప్యూటర్‌ ఫీల్డ్‌కి కొత్తవాళ్లకే ప్రాధాన్యత… స్కూల్‌లో టీచర్‌గా చేరాలి. 4000 రూపాయలు ఇస్తామన్నారు. పొద్దున్న 9 గంటలనుండీ అయిదు దాకా… బస్సు పట్టుకొని 7.30కి వెళ్తే రాత్రి 8.30కి వస్తాను. కష్టమేమోనన్పించి అమ్మకి చెబితే… ఔ.జూఖి. చేసిన మహామహావాళ్లకే 5000 రూపాయలు ఇవ్వడం కష్టంగా ఉంది. అంతకన్నా ఎవరు ఇస్తారే నీకు… ఒక పిల్లో పిల్లాడో వుంటే… వాళ్లని చూసుకోవడంతో అయిపోయేది… ప్చ్‌…! ఏం చేస్తాం… అని నాన్న మాట కూడా అమ్మే చెప్పి – పెళ్లి, బిడ్డ… స్త్రీకి విధాయకాలని మరోసారి చెప్పారు. అంతేకాదు, ప్రొఫెషనాలిటీ సంపాదించుకోవాలనుకోవాలి గానీ డబ్బు లెక్కేస్తే ఎలా?… అన్నారు. వీళ్లు ఎంత బాగా చెప్పగలరు?… ఏ చట్రాన్నయినా ఎంత బాగా బిగించగలరు? అన్పించింది.
 స్కూల్‌కి వచ్చేక… ఇక్కడ పనిచేస్తున్న మిగిలినవారిని చూసినపుడు తను ఎంత కృత్రిమ సమస్యలతో బాధపడిందో తెలిసింది. చట్రం బ్రతుకులు కాకుండా వుండాలంటే… స్థిరమైన ఆలోచన నిర్ణయాత్మకశక్తిని పెంచే చదువు… సోషల్‌ లైఫ్‌ అవసరం తెలుస్తోంది నెమ్మదిగా… అని నా కథ చెప్పడం ముగించాను.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.