‘ఆయనకు చెప్పాలి’ ` ఎందుకు? – డా.పద్మ మీనాక్షి

‘ఆయనకు చెప్పాలి’ చాలా మంది మహిళలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఇంట్లో భర్తనో లేదా కొడుకునో, పెళ్ళి కాని అమ్మాయిలైతే తండ్రినో, తల్లినో అడిగి చెబుతాం అంటారు.
మహిళ సొంతంగా నిర్ణయం తీసుకోలేదా?

ఈ విషయం మీద సాయి పద్మకు, నాకు చాలాసార్లు చర్చలు జరిగేవి. ఆ చర్చల్లో మా మధ్య దొర్లిన విషయాలనే ఈ బ్లాగ్‌లో మీతో పంచుకుంటున్నాను.
చాలామంది అమ్మాయిలు, గొప్ప ప్రొఫెషనల్స్‌ అయినా కూడా ఆఖరికి ఒక డ్రెస్‌ లేదా చీర కొనుక్కోవాలన్నా, లేదా ఇష్టమైన బిర్యానీ తినాలన్నా భర్త లేదా బాయ్‌ ఫ్రెండ్‌ అభిప్రాయం కోసం ఎదురుచూస్తూ ఉంటారు, వాళ్ళ సంపాదన లక్షల్లో ఉన్నా కూడా.
తమకి నచ్చింది వండుకోవాలంటే ఆయనకు నచ్చదు కాబట్టి, నేను కూడా తినను అని ఆ ఇష్టాన్ని పక్కన పడేస్తారు. ఒక్కొక్కసారి ఇంట్లో రెండు వంటలు చేసే ఓపిక లేక తమ ఇష్టానికి స్వస్తి చెప్పేస్తారు.
‘‘స్త్రీ తనని, తన కుటుంబాన్ని వేర్వేరుగా చూడదు. తన శరీరంలో, తనలో ఒక భాగం అనుకుంటుంది’’ అని అంటూ, ‘‘ఇది తరతరాలుగా జరిగిన కండిషనింగ్‌. పతి పరమాత్మ, భర్త మాట జవదాటకూడదు అనే మెంటల్‌ కండిషనింగ్‌ కొన్ని తరాలుగా నాటుకుపోయింది’’ అనేది.
కొన్ని లక్షల రూపాయలు సంపాదించే మహిళలు కూడా భర్త మాట జవదాటితే తనపై ప్రేమ తగ్గిపోతుందేమో అనే భయంతో ఉంటారు. లేదా కుటుంబాన్నీ, భర్తనూ ఈ విధంగా సంతృప్తి పరుస్తూ చూశారా మీ మాటకు ఎదురు తిరిగి ఏ పనీ చేయను అని చెప్పాలని అనుకుంటారు. లేదా ఈ క్షణానికి ఈ పరిస్థితిని చల్లారుస్తున్నాం అనుకుంటారు. అనవసరమైన వాదనలెందుకండీ అంటారు. తమకీ కొన్ని అభిప్రాయాలుంటాయని, ఇంట్లో ప్రతి చిన్న విషయానికీ వాళ్ళ అనుమతి అవసరం ఉండదని అనుకోరు.
మరి కొంతమంది పూర్తిగా భర్తపై ఆధారపడి బ్రతుకుతూ ఉంటారు. తమకంటే భర్త తెలివైన వాడు, సంపాదనా పరుడు, ఏదీ చెప్పకుండా చేయకూడదు అనే అభిప్రాయంతో ఉంటారు. భర్తతో చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవాలని కాదుÑ ఇంటికి, పిల్లలకు, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు సమిష్టిగా తీసుకోవాల్సిందే. కానీ తన చిన్న చిన్న కోరికలు… చీర లేదా డ్రెస్‌ కొనుక్కోవాలన్నా లేదా ఇష్టమైన వంట చేసుకోవాలన్నా, లేదా పాటల పోటీలో పాల్గొనాలన్నా కూడా భర్త అనుమతి లేనిదే చేయరు.
‘‘ఇదే ఒక మనిషి అస్థిత్వాన్ని లేకుండా చేస్తుంది. తానేమిటో తెలుసుకునేసరికి వయసు అయిపోతుంది’’ అనేది పద్మ.
కానీ, భర్తకు చెప్పడంలోనే వాళ్ళకు ఆనందం ఉందని అనుకుంటారు. భర్త కూడా తాను తీసుకునే ప్రతి నిర్ణయంలో భార్యను సంప్రదిస్తున్నాడా? ఆ ప్రశ్నలు భార్యలు వేసుకుంటున్నారా? ఫర్వాలేదు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదని సరిపెట్టుకుంటున్నారా?
స్త్రీల స్వతంత్రం గురించి మాట్లాడుతూ, ‘‘సమాజం, స్త్రీలు కూడా మారాలి’’ అనేది సాయి పద్మ. ‘‘పైకి ప్రేమలా కనిపించే చాలా వాటి వెనుక భరించలేనంత హింస, బరువు ఉంటాయి. ఇన్నేళ్ళు ఇలా ఉన్నామా? అని అర్థమయ్యేసరికి ఒక్కోసారి జీవితం గడిచిపోతుంది’’ అనేది. ‘‘పూనకాల వాళ్ళకి ఒళ్ళు నొప్పులు తెలియనట్లే, పనిలో ఉన్న ఆడవాళ్ళకి చుట్టూ జరిగే విషయాలు తెలియవు. అలాగే, తాము భర్త చాటు స్త్రీలు అనుకుంటూ, వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటారు. స్త్రీ తన అస్థిత్వాన్ని, ఉనికిని భర్త కుటుంబంతో కలిపే చూసుకుంటుంది తప్ప తనకంటూ స్వతంత్రంగా ఒక వ్యక్తిత్వం ఉందని అనుకోదు’’ అనేది సాయి పద్మ.
చాలామంది ఇది తాము ఇష్టంతో చేస్తున్నామని అంటారు. వాళ్ళని ఒక కేటగిరీలో వేసి వదిలేద్దాం. కానీ, ఇష్టాలను చంపేసుకుని కూడా ఆయనకు ఇష్టముందదు అంటూ బ్రతికేస్తూ ఉంటారే, వాళ్ళ గురించి మనం మాట్లాడేది.
‘‘డ్యామేజ్‌ జరగటం లేదు, బయటకు కనపడటం లేదని అనుకుంటారు. కానీ, అభిప్రాయాలు చెప్పుకోవడానికి కూడా సంశయిస్తే, ఆ ఇంట్లోని పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. భర్త లేదా పురుషుడు ఒక సూపర్‌ హ్యూమన్‌ అనే భావనలో ఉంటారు. ‘తరాల తరబడి చెప్పుకోలేని నిశ్శబ్దంలో, డిప్రెషన్‌లో గడుస్తుంది. మనుషులు బతుకుతూనే ఉంటారు. జీవం ఉండదు. అంతే… ఇది చాలా భయంకరంగా ఉంటుంది.’’
అభిప్రాయాలు మాత్రమే కాదు, ఇష్టం లేని పద్ధతులను మహిళలు ప్రశ్నించాలి అనేది సాయి పద్మ. వరకట్నమైనా, ఇంట్లో జరిగే హింస అయినా భర్త కాబట్టి భరించాల్సిన అవసరం లేదు. అందుకే, మహిళలు తమ సొంత కాళ్ళపై నిలబడటం మాత్రమే కాదు, సొంతంగా ఆలోచించగలగాలి. అలా జరగాలంటే, కొంత వరకు ఆర్థిక స్వాతంత్య్రం దోహదం చేస్తుంది అని భావించి, ఆడపిల్లల చదువు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో మహిళలకు శిక్షణ ఇచ్చే పనులు చేసింది గ్లోబల్‌ ఎయిడ్‌ అనే తన సంస్థ ద్వారా.
మహిళా సాధికారత, స్వయం నిర్ణయాధికారం, సాదికారత తనకు హృదయానికి చాలా దగ్గరైన విషయాలు.
ఒకరోజు ఈ తండ్రి లేదా భర్త భక్తి గురించి రాస్తూ, ‘‘పితృస్వామ్యంగా, కండిషనింగ్‌ పోవడం, హీల్‌ అవ్వడం అంత సులభం కాదు. చుట్టూ ఉన్న వంద మందికి ఒక కేరాఫ్‌ ఉన్నప్పుడు, మనం మరోలా ఉండటానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంలో తల్లులు, సంస్థలు విఫలమవుతున్నాయి’’ అని రాసింది పద్మ. సాయి పద్మ చెప్పేది ఒక్కటే, ‘‘నిజంగా ప్రేమ ఉంటే విను, చెప్పింది పాటించు. కానీ, పక్కవాళ్ళ కోసమో, సమాజం కోసమో చేస్తే అది నీలో నీకే ఘర్షణను కలిగిస్తుంది. ఇదంతా నీ మిగిలిన సంబంధాలపై కూడా పడుతుంది, పక్క వాళ్ళ కోసం ప్రేమ నటించకు.’’
‘‘మానసిక స్వాతంత్య్రం, ఆర్థిక స్వాతంత్య్రం కంటే గొప్పది. వంద రూపాయలు సంపాదించే మహిళ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలనే విషయంపై సొంత నిర్ణయం తీసుకోలేకపోతే ఎన్ని స్వతంత్రాలున్నా నిరర్థకమే. దీన్ని ప్రతి మహిళా సొంతం చేసుకోగలగాలి’’ అని చెప్పేది. తాను మాత్రం తాను జీవించినంత కాలం తాను నమ్మినదాన్నే ఆచరించింది. తను దీపావళికి రాసిన ఒక కవిత్వంతో ముగిస్తాను.
నరకాసురుడికో నీతి ఉంది
తనతో పాటు అందరినీ చీకట్లో పెట్టే
నార్సిస్ట్లు, అందరికీ ఒక జస్టిఫికేషన్‌ ఉంటుంది.
అలాంటి వాళ్ళను దేవుళ్ళుగా పూజించే
అజ్ఞానులకు ఒక సుఖం ఉంది.
ఏదీ ప్రశ్నించనక్కరలేదు.
సమాధిలో తుళ్ళిపడే అవసరమూ రాదు.
ఉల్లిపాయల్లాగా విప్పే కొద్దీ ప్రతి మనిషి పొరా కన్నీళ్ళే
మిగులుస్తాయి.
మన అకారణ ప్రేమని, లాయల్టీని కాలంతో పరిహసిస్తాయి.
తన కోసం బాణాలు సంధించే సత్యభామలు కావాలిప్పుడు.
చెప్పే మాటల కన్నా చేసే వికృతాలు కనిపెట్టగలిగే దీపాలు కావాలి.
సెల్ప్‌ కేర్‌ లగ్జరీ కాదబ్బా
అదే అసలు మనః తిమిరాన్ని దాటించగలిగే దీపావళి.
` సాయిపద్మ
(ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌)

Share
This entry was posted in సాయి పద్మ ప్రత్యేకం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.