సాయి పద్మ మేడం, ఆనంద్ సార్ కలిసి స్థాపించిన గ్లోబల్ ఎయిడ్ అనే సంస్థ ద్వారా మా జీవితాలనే మార్చేశారు. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేశారు. అందులో నేనూ ఒక దానిని.
ఆరవ తరగతి నుండి గ్లోబల్ ఎయిడ్ హాస్టల్‌లో ఉండి చదివాను. మా అక్క నాగమణి కూడా వీరి దగ్గర ఉండి బ్యూటిషియన్ కోర్సు చేసేది. మేడం ఇంట్లో ఉంటూ నా బీ.సీ.ఎ. డిగ్రీని పూర్తి చేశాను. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటూ కాంపిటీటివ్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాను.
మా నాన్నగారు యాక్సిడెంట్‌లో చనిపోతే సాయి పద్మ మేడం ఓదార్చి మా కుటుంబానికి ఎంతో సాయం చేశారు. మేడం ఇచ్చిన ధైర్యం, స్ఫూర్తి, ప్రేమ, అభిమానం, ఆశీర్వాదాలు నాకెప్పుడూ ఉంటాయి. వారు లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. మేడం ఐ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ. మీ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. `