నా పేరు నాగమణి. నేను ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు గ్లోబల్ ఎయిడ్ సహాయ సహకారాలతో చదువుకున్నాను. సాయి పద్మ మేడం, ఆనంద్ సార్ నన్ను వారి ఇంట్లో ఉంచుకుని బ్యూటీషియన్ కోర్సులో చేర్పించారు.
వారు నన్ను తమ సొంత కూతురిలా చూసుకునేవారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా కుటుంబానికి వారు ఎంతగానో సహాయపడ్డారు. వారితో కలిసి కొద్ది కాలమే ఉన్నా ఎంతో ఆనందంగా ఉండేదాన్ని. వారు చదివించిన పిల్లలు మంచి స్థాయికి చేరుకున్నారు. మా సాయి పద్మ మేడం, ఆనంద్ సర్ ఎంతో సేవా గుణం ఉన్నవారు. నిస్వార్థంగా సేవ చేస్తారు. దేన్నీ తిరిగి ఆశించరు. మేడం గారు గిరిజన ప్రాంతంలో నివసించే వారికి పాఠశాలలు లేవని, పిల్లలు చదువుకోవడానికి చిన్న గుడిసెలు వేయించి, శిక్షణ ఇప్పించిన టీచర్లను నియమించి చదువు చెప్పించేవారు. ఇలాంటి వ్యక్తిని నా జీవితంలో చూడలేదు. వీల్‌చైర్‌లో ఉంటూనే ఎందరికో సహాయం చేశారు. ఆమె న్యాయం కోసం పోరాడే వ్యక్తి. అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మేడం! మీరు లేకపోయినా మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి. ఐ మిస్ యూ ఫరెవర్ అమ్మా…! `