నా ప్రియ శిష్యురాలు శ్రీమతి సాయిపద్మ ఈ లోకంలో ఇక లేదు అని మీ అందరికీ చెప్పటానికి చాలా చింతిస్తున్నాను. తను చేసిన గొప్ప సంఘ సంస్కరణలు ద్వారా తను ఎప్పుడు మన మనుసుల్లో మనతోటే ఉంటుంది. సాయి ఎంత అన్యాయం అమ్మ ఇలా అర్థాంతరంగా అందరిని వదిలేసి వెళ్లిపోవడం తట్టుకోలేకపోతున్నాను తల్లి. ఆ భగవంతుడికి కూడా దయలేదా?
నీ తద్వారా ఎంతోమంది ఉద్ధరింపబడుతున్నారు. నిన్నే నమ్ముకుని జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు వారికి ఇప్పుడు ఎవరు దిక్కు?ఎవరు అసరా? హాస్పటల్‌లో ఆనంద్‌ని చూస్తే చాలా బాధ వేసింది. ఇలా అర్థాంతరంగా వెళ్లిపోవడం ఏమిటి సాయి.
నడక కోసం 18 సర్జరీలు, 52 షాక్ ట్రీట్మెంట్స్ ఇచ్చినా తట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుతు స్విమ్మింగ్ కూడా చేస్తూ ఇది నేను చేయలేను నావల్లకాదు అని చెప్పడం తన డిక్షనరీలోనే లేదు అని నిరూపించిన సాయి ఇక లేదు.
సంగీతం మీద ఎంతో మక్కువ ఎంతో భక్తి కలిగిన సాయి నా దగ్గర సంగీతం నేర్చుకుంటూ వీలు చిక్కినప్పుడు సావకాశం దొరికినప్పుడు కచేరీలలోకూడా పాల్గొంటూ ఇటు సంగీతం ద్వారా తను ఆనందాన్ని పొందుతూ తన చుట్టూ ఉన్నవారికి సంగీతాన్ని పరిచయం చేస్తూ.. రచయిత్రి, కవయిత్రి, మానవతావాది, గొప్ప సామాజికవేత్త, విశాఖపట్నం గ్లోబల్‌ఎయిడ్ స్త్రీ శక్తి ఇలా ఎన్నో ఎన్నెన్నో పాత్రలు జీవితంలో పోషిస్తూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ ఇంత అర్ధాంతరంగా మనందరినీ వదిలి వెళ్లిపోయిన సాయిని విగత జీవిగా చూసి తట్టుకోవడం నా వల్ల కాలేదు. `