నా పుట్టిన రోజు వేడుకనేవరు
ఆచరించకున్నా…
నా ఎదుగుదల ఎత్తుల నెవరూ
అభిలషించకున్నా…
నా చదువు సంస్కారాల పూ పరిమళాన్నెవరు
ఆఘ్రాణించకున్నా …
నా ఆట పాటల విజయ సోపాలనేవరు
ఆమోదించకున్నా…
నా గుణాల ముత్యపు రాశుల నెవరూ
అభిమానించకున్నా …
నాలోని భూదేవంత ఓరిమినెవరూ
అభినందించకున్నా…
అలక్ష్యపు అలల తాకిడిని సృష్టించి
అనుక్షణం వెనక్కి నెడుతున్నా…
అవహేళనల రాళ్ళను విసిరి
అనుకోని గాయాలు చేస్తున్నా…
సంయణపు చెరుకు తీపి రుచి చూపాలని …
చెలిమి చెలామనై బీడు గుండెల్ని మెత్తబరచాలని…
సంతోషపు దివ్వెగా హృదయాలయాలలో వెలగాలని …
సంబంధాల పదిలానికి తలపు చెవినై నిలవాలని…
మమతల మల్లియనై మదిమదిలో విరియాలని…
మానవతత్వాలను మనసు పొరల్లో పాడుకొలపాలని…
మారణ హోమాలు లేని మహత్తరమైన భవితకు నాంది నవ్వాలని…
మళ్ళీ మళ్ళీ సహనంగా ప్రయత్నిస్తూనే ఉండే ‘‘స్త్రీ మూర్తి’’ ని