‘‘గిట్టయితే మా బతుకులేంగాను, మేమెట్ల బతకాలమ్మ’’ బాధ వెళ్లగక్కుకుంటూ వచ్చింది యాదమ్మ.
ఏమైందన్న మా అత్తగారి ప్రశ్నకు జవాబుగా ‘‘ఆ ఉమా మేడం ఒకటో తారీకెల్లి పని బంద్ పెట్టమన్నది. కొలువు దిగిపో యింది కద. పనంతా ఆమెనే చేసుకుం టదట’’ దీనంగా చెప్పింది యాదమ్మ.
‘‘ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఆరోగ్యమే కదా’’ మా అత్తగారి సమర్ధన.
యాదమ్మ లేకపోతే అరగంట సైక్లింగ్ చేసి ఉదయం టీ తాగుతూ పేపర్ చదవ గలనా… అప్పుడది ఓ లక్సరీగా ఉండేదేమో! అనుకుంటున్న నా ఆలోచనలకు అంత రాయం కలిగిస్తూ ‘‘ఏంటో ఈ జనాలు. డబ్బిచ్చి పని చేయించుకొని ఒళ్ళు పెంచుకు ంటారు. జబ్బులు పెంచుకుంటారు. మళ్ళీ డబ్బు వదిలించుకుని ఒళ్ళు కరిగించు కుంటారు. సోమరితనం వదిలి ఎవరింటి పని వాళ్ళు చేసుకుంటే ఎంత సొమ్ము ఆదా…’’ గొణిగింది మా అత్తగారు.
ఆవిడ అన్నట్లు ఇంటి పని చేసుకుంటే సరిపోతుందా. ఆడవారికి వ్యాయామం అవసరం లేదా?
పురుషులకు ఆరోగ్యం, ఫిట్నెస్ ఎంత అవసరమో స్త్రీలకు కూడా అంతే అవసరం. సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితం పురుషులకు ఎంత అవసరమో మహిళలకు అంతే అవసరం. మరి ఫిట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండాలంటే వ్యాయామం చేయాల్సిందేగా. నిజానికి, వ్యాయామం చేసిన పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఆరోగ్య ప్రయోజ నాలు పొందుతారని అధ్యయనాలు చెబు తున్నా పట్టించుకోము.
హార్మోన్లలో హెచ్చుతగ్గులు, మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలులు, రకరకాల వత్తిడులు మహిళల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని గ్రహించం. చాలా మంది స్త్రీలు ఇంటి పని, పిల్లల పని, ఆఫీసు పని అంటూ సాకులు చూపి వ్యాయామం చేయడానికి వెనకడుగేస్తారు. ఇంటి పనులు చేసుకున్నా, చేసుకోకున్నా ఒక క్రమపద్ధతిలో వ్యాయామం మాత్రం చాలా అవసరం.
ఇప్పుడు దంచడం, రుబ్బడం, విసరడం వంటి పనులు లేవు. ఉరుకుల పరుగుల జీవితంలో బట్టలు ఉతకడానికి, ఇల్లు ఊడ్చి తుడవడానికి, గిన్నెలు తోమడానికి ఇలా అనేక రకాల యంత్ర పరికరాలు వచ్చి ఇళ్లలో చేరాయి. పనిని సులభం చేశాయి. లేదా మనిషితో చేయించుకోవడం అలవా టైంది మధ్యతరగతి ఆపై స్థాయి మహిళలకు. నడిచే పని కూడా ఉండటం లేదు. ఇంట్లోం చి కదిలితే బైక్ లేదా కారు తీస్తున్నాం. శరీర కదలికలు బాగా తగ్గిపోయి మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
యోగా, స్కిప్పింగ్, సైకిల్ తొక్కడం, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం, నృత్యం చేయడం, ఈత కొట్టడం, వేగంగా నడవడం, టెన్నిస్ ఆడటం వంటి హృదయ స్పందన పెంచే వ్యాయామం రోజుకి కనీసం 25 నిమిషాలు అవసరం అంటారు వైద్యులు. కానీ మన దేశంలో కేవలం 3 శాతం మహి ళలు మాత్రమే వ్యాయామం చేస్తున్నారు. కుటుంబ పని వత్తిడిలోనో, ఆసక్తి లేకనో వ్యాయామం చేయని వాళ్లే కాకుండా ఆసక్తి ఉండి కూడా కొందరు చేయలేకపోతున్నారు. అందుక్కారణలనేకం.
సమయం లేకపోవడం, కుటుంబ బాధ్య తలతో పాటు భర్త, అత్తమామల అనుమతి లేకపోవడం, వస్త్రధారణ వ్యాయామానికి అనువుగా లేకపోవడం, పరిగెత్తితే నలుగురూ ఏమనుకుంటారో అని వెనుకంజ, ఇంట్లో వ్యాయామం చేయడానికి సరైన స్థలం లేక పోవడం, తెల్లవారుజామున లేచి నడకకు వెళ్తే వీధుల్లో భద్రత కొరవడటంతో పాటు మహిళలు అధిక బరువులు ఎత్త కూడదు, ఇంటెన్సిటీ వర్కవుట్ చేయకూడదు, కండరాల నిర్మాణంపై మహిళలు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదనే అపోహలు.
ఇటువంటి స్థితిలో ఒక మహిళ స్వేచ్ఛగా ఉదయపు నడకకు వెళ్లి, లేదా వ్యాయామం చేసి స్వచ్ఛమైన గాలి పీల్చలేకపోతున్నది. నగరాలు, పట్టణాలతో పోలిస్తే గ్రామీణ భారతంలో మహిళల పరిస్థితి మరింత అధ్వాన్నం.
మధుమేహం సాధారణం అయిన ఈ రోజుల్లో టైపు 2 మధుమేహానికి వ్యాయా మంతో 50% చెక్ పెట్టొచ్చు. అట్లాగే గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని 35 శాతం, రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 20 శాతం, కోలన్ కాన్సర్ 50 శాతం తగ్గించుకోవచ్చు. డిప్రెషన్ తగ్గుతుంది. కాల్షియం పెరిగి ఎముకల వ్యాధులు తగ్గుతాయి.
మహిళల ఆరోగ్యం విస్మరించలేని కీలక అంశం. ఇంటి పనిలో, పిల్లల పనుల్లో, అత్తమామల పనుల్లో, ఉద్యోగ, ఉపాధి బాధ్యతల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సంప్రదాయాలు కాదన్నప్పటికీ వెనుకడుగు వేయొద్దు. స్త్రీలు తమ కోసం తాము కొంత సమయం కేటాయించుకుని వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది. తమ ఆరో గ్యాన్ని కాపాడుకోవాలంటే ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
మహిళకు మంచి పోషకాహారంతో పాటు వ్యాయామం కీలకమే.