వర్షాకాలం! – ఆపర్ణ తోట

కాలమ్‌ రాయాలి! రాద్దామని కూర్చుంటే అన్ని పెద్ద పెద్ద ఆలోచనలు. ఏం రాయాలా అని ఆలోచిస్తూ స్నేహితురాళ్ళ గుంపులో (అదేనండి వాట్సాప్‌ గ్రూపులో) సలహాలు అడిగాను.  వర్షం గురించి రాయమని రెస్పాన్స్‌. మొదలు పెట్టేశా. మిగిలిన వారు మాట్లాడేలోగా లాప్టాప్‌ కీబోర్డ్‌ మీద నా వేళ్ళు చకచకలాడాయి.

వర్షాకాలం!
శ్రావణ మాసం. బద్ధకపు నిద్ర, దుప్పటిలోకి దూరి వర్షపు చప్పుడు వినడం ఎంత బావుంటుంది!. పక్కనే ఇష్టమైన వెచ్చనైన తను. అప్పుడప్పుడు తగులుతూ, అప్పుడప్పుడు కౌగిలించుకుంటూ, మన అదృష్టానికి మనమే అసూయపడుతూ… వర్షం. పిల్లల కేరింతలు, గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుండి వినబడే అర్ధం లేని కేకలు. అక్కడక్కడా కాగితపు పడవలు. ఎదురొచ్చే బాల్యం. చల్లటి గాలి. వేడి వేడి కాఫీ. కొన్ని కబుర్లు. బేకరీ నుండి ఆహ్లాదపరిచే వాసనలు.
వర్షం పడగానే మీకు ఏం గుర్తుకు వస్తుంది అని అడిగాను ఒక ట్రైనింగ్‌ సెషన్‌ లో. మగవారు, అల్లం చాయ్‌, బజ్జీలు, వేడి బ్రాందీ అని చెప్పారు. ఆడవారంతా ఒకే మాట చెప్పారు- బయట ఆరుతున్న బట్టలు. సఫాయి కర్మచారుల నుండి కార్పోరేట్‌ వనితల వరకు ఒకటే సమాధానం.
వర్షం. తడారని బట్టలు, పనికి రాలేని పనిమనుషులు. ఇల్లంతా రొచ్చు, బాత్రూం తడి ఆరదు. కానీ బజ్జీలు తినొచ్చు. మరి బజ్జీలు చేసేది ఎవరు? తడి ఆరని బట్టలు. ఒకానొక ఇంట్లో అందరు టీవీ చూస్తున్నారు. ఉన్నట్టుండి వర్షం మొదలైంది. పెద్దావిడ హడావిడిగా లేచి పరిగెత్తింది. అవును, బట్టలు తీద్దామని. కాలు జారి పడిరది. తుంటి ఎముక విరిగింది. హాస్పిటల్‌, ఖర్చులు పోగా మిగిలినవి తిట్లు. ఎందుకా తాపత్రయం. ఎండిన బట్టలు తడిస్తే ఏమి అని. శతాబ్దాలు నాయనా! శతాబ్దాలుగా వర్షం పడగానే బట్టల గురించి ఆలోచించే జీవులం. ఎలా పోతుంది తాపత్రయం. మాకు ఆస్తులా, అవసరాలా? ఇటువంటి తాపత్రయాలు పై బతికిన ప్రజలం కదా. వదిలించుకోవడం కష్టం.
ఇదంతా రాసి మళ్లీ ఫోన్‌ తెరచి చూస్తే బోల్డన్ని మాటలున్నాయి మా స్నేహితురాళ్ళ సమూహంలో.  ముందు వాటినన్నిటిని పొందుపరచి వ్యాసంగా రాద్దామనుకున్నాను. కానీ  వారి గొంతుకలతోటే చెప్పడం సమంజసమనిపించింది.
‘‘ఈ సన్నివేశం నా మనసులో ముద్రించుకు పోయింది. ఒక మనిషి తన భార్యను చాచి పెట్టి చెంప మీద ఒక్కటి కొట్టాడు తన చొక్కా ఆరలేదని. వారి దగ్గర ఇస్త్రీ పెట్టె లేదు. అతను చొక్కా వేసుకునే సమయానికి ఆ చొక్కా ఆరలేదు. వర్షం తెరిపి లేకుండా పడుతోంది.’’
‘‘పెళ్లికి ముందు వరకు వర్షంలో కావాలని తడిచి డాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేసేదాన్ని. ఇంటిలో ఉన్నా సరే, బయటకు రావలసిందే. ఇంటికి రాగానే వేడి వేడి నీళ్లతో తల స్నానం చేసేదాన్ని. కానీ వీడు పుట్టాక తడవడం మానేశా. జలుబు, జ్వరం రాకూడదని. కానీ ఇప్పటికీ బాల్కనీలో నుంచుని చేతులు బయటకు పెట్టి, చినుకులతో ఆడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉంటా.’’ ‘‘వర్షం వలన ఎంత లాభం ఉంటుందో అంత కష్టం ఉంటుంది. పట్టణ, నగరాల్లో మహిళలకు ఒక రకమైన కష్టాలు ఉంటే, గ్రామీణ మహిళలకు వేరే కష్టాలు ఉంటాయి. నగర మహిళలు ఆఫీసుకు సమయానికి చేరలేక పోవడం, బాస్‌లతో లేదా హయ్యర్‌ అఫీషియల్స్‌తో తిట్లు తినడం, లేదా రకరకాల ఇన్ఫెక్షన్స్‌కి గురై ఆరోగ్యం పాడవడం, ఇంట్లో బట్టలారక పోవడం, పదేపదే కరెంటు పోవడం వలన వంట సరిగ్గా కాకపోవడము… ఇవి! ఇక వలస వచ్చిన మహిళలకు చెప్పలేనంత కష్టం. బస్తీల్లో బతకడమే కష్టం. పైగా వర్షం పడినా పడక పోయినా మొగుడెప్పుడూ తాగే ఉంటాడు. కాకపోతే వర్షం లేనప్పుడు కూలి చేసుకుని వచ్చిన డబ్బుతో తాగేవాడు, వర్షం పడ్డప్పుడు కూలి పని దొరకక పెళ్ళాం దాచుకున్న పదో పరకో ఇవ్వమని కొడతాడు. తిండి దొరకని పరిస్థితి. పిల్లలకు పెట్టుకోలేని పరిస్థితి. బస్తీల్లో మామూలుగా ఉండడానికి చోటు కూడా సరిగ్గా ఉండదు. మురుగు నీరు నిలచిపోవడమో, వరదలు రావడమో, పని లేక తిండి దొరకకపోవడమో’.’ ‘‘వర్షం వస్తే చిన్నప్పటి స్నేహితురాలు కలిసిన ఫీలింగ్‌ ఉంటుంది. ఇప్పటికి వాన వస్తే బీచ్‌ని మిస్‌ అవుతా. వర్షంలో తడిచే సముద్రం అందం ఒక అద్భుతం. మాటలకు, ఏ రంగులకు అందని చిత్రపటం అది.’’ ‘‘డ్రైనేజీ ప్రాబ్లమ్‌ వలన బస్తీల్లో టాయిలెట్లలో చెత్త చేరి మూసుకుపోతాయి. ఆడవారు చాలా ఇబ్బంది పడతారు, ముఖ్యంగా పీరియడ్స్‌ లో ఉన్న ఆడవారు. బట్టలు ఆరకపోవడమే కాదు,  ఇల్లు కురుస్తుంది. ఆ కురిసే కంఠాల కింద గిన్నెలు పెట్టడం, అందులో నీళ్లు నిండగానే పడేయడము, అది కూడా ఆడోళ్ళ పనే.  వర్షానికి వాన వాన వెల్లువాయే పాడడము, ఇవన్నీ ఎలైట్‌ సంతోషాలు, ఎందుకంటే వర్షం వలన వచ్చే ఇబ్బందులు వారు అనుభవించరు, కాబట్టి, వారికి వర్షం బావుంటుంది. దిగువ మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళ అనుభవాలు పూర్తిగా వేరే.’’ ‘‘ఇది నేను కూడా ఫేస్‌ చేశా. పెంకుటిల్లు వానాకాలం కురిసేది. మగ్గులు, గిన్నెలు పట్టుకొచ్చి, అమ్మా, నేను ఇంట్లో పెట్టేవాళ్ళం. ఒక్కోసారి మంచాలు, సామాను కూడా జరపవలసి వచ్చేది.’’
‘‘మా పనమ్మాయి పోయిన రెండు రోజులు రాలేదు. గొడుగు వాళ్ళ ఆయన తీసుకెళ్తున్నాడట. ఈ రోజు కాస్త వర్షం తగ్గిందని వచ్చింది. నా దగ్గర ఉన్న గొడుగు ఇచ్చాను. తనకి నాలాగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఫెసిలిటీ లేదు కదా. మనమే చూసుకోవాలి.’’ ‘‘వర్షాకాలంలో పిల్లలకి చాలా ఇన్ఫెక్షన్స్‌, జ్వరాలు వస్తుంటాయి. ముఖ్యంగా బస్తీలలో పరిస్థితుల వలన. ఈ పిల్లలను చూసుకునేది అమ్మలే. వారి సంపాదనకు గండి పడడమే కాదు, ఖర్చులు పెరుగుతాయి, శ్రమ ఒత్తిడి కూడా పెరుగుతుంది.’’ ‘‘స్కూళ్లలో అంతంత మాత్రంగా ఉన్న టాయిలెట్లు వర్షం పడినప్పుడు ఘోరంగా మారతాయి. కొన్ని టాయిలెట్లలో పైకప్పులు ఉండవు. కౌమార దశలో ఉన్న అమ్మాయిలు, ముఖ్యంగా  మెన్సస్‌లో ఉన్న అమ్మాయిలైతే వర్షం పడినప్పుడు అసలు స్కూళ్లకే రారు. ఇవన్నీ లేని సమయాలు కూడా ఉంటాయి. అప్పుడు వర్షాన్ని వాళ్ళు భలే ఎంజాయ్‌ చేస్తారు..’’
‘‘వర్షం! వర్షంతో నాకు భలే మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. స్కూల్‌ నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఒక కిలోమీటర్‌ నడిచే వాళ్ళం. ఒకరోజు సాయంత్రం స్కూల్‌ నుండి వెనకకి వస్తుంటే సగం దారిలో ఏవో తెల్లని రాళ్లు మా మీద పడుతున్నాయి. అవి తెల్లగా ఉన్నాయి. గుండ్రంగా లేవు – ఏంటో ముడుతలుగా కనబడ్డాయి. అవి మా మీద పడుతున్న కొద్దీ దెబ్బలు తగుల్తున్నాయి. నేను, మా చెల్లి, ఇంకొందరం కలిసి ఒక కొట్టంలోకి పరిగెత్తాము. చెట్ల నుండి రాళ్ళో, కాయలో పడుతున్నాయి అనుకున్నాం. చెట్ల నుండి ఇంత ఘోరంగా రాళ్లు పడుతున్నాయేమిటా అని చూస్తున్నాము. అయితే అవి కాయలు కాదు, వడగళ్ళు అని అర్థం అయింది.’’
‘‘వర్షాకాలంలో అన్నిటి కన్నా పెద్ద కష్టం ఏంటంటే కట్టెలు దొరకవు. దొరికినా అవి పచ్చిగానే ఉండేవి. గ్యాస్‌ నూనె పోసి మండిద్దామన్నా వెలగవు. వర్షపు గాలి, పై నుండి కారే వర్షపు నీరు, పచ్చి కట్టలు! వంట చేయడం ఎంత కష్టమయ్యేదో… మళ్ళీ ఈ కట్టెలు కూడా ఆడవాళ్లమే తెచ్చుకోవాలి. అప్పట్లో ఎనిమిదేళ్లు కూడా లేవు నాకు, అంత చిన్న పిల్లని అయినా నేనే తెచ్చేదాన్ని. కొంతకాలానికి అప్డేట్‌ అయ్యాము. మా నాన్న పొట్టు పొయ్యి తెచ్చాడు. ఇది కాస్త నయం అనిపించినా, పొట్టు పొయ్యిలో పొట్టు తడిస్తే అంటుకోవడానికి చాలా టైం పడుతుంది.’’
‘‘వర్షాకాలంలో పల్లెటూరిలో మనమేం నాటకపోయినా బోల్డన్ని మొక్కలు, పాదులు మొలుస్తాయి. సొరకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, గోంగూర ఎక్కడపడితే అక్కడ దొరికేవి. ఆనపకాయ కాసింది, కూరొండుకుంటావా పిల్లలకి అని వేరేవాళ్లు మాకిస్తే, మేము కూడా మాకు ఏమన్నా కాస్తే వాళ్ళకి ఇచ్చేది. వర్షాకాలంలో పుష్కలంగా కూరగాయలు ఇచ్చిపుచ్చుకోవడం ఉండేది. పెంట కుప్పల మీద కూడా మొక్కలు మొలిచేవి. చిన్న చిన్న ఇళ్లైనా ఇంటి చుట్టూ చాలా జాగా ఉండేది. చాలా మంది మొక్కలు నాటే వాళ్ళు. సీసనల్‌ ఫుడ్‌ బాగా తినేవాళ్ళం. పాడి కూడా ఆరోగ్యంగా ఉండేవి. పాలు పెరుగు తక్కువ ఖరీదుకే దొరికేవి. చాలా మంచి తిండి తినేవాళ్ళం.‘‘
‘‘ఇప్పుడిదంతా ఎక్కడలే! రియల్‌ ఎస్టేట్‌ వాళ్ళు రావడం, భూమిలో సారం ఇగిరిపోవడం. నదులు చిన్నవైపోయాయి, తవ్వకాలు పెరుగుతున్నాయి, కెమికల్స్‌ లేకుండా కూరగాయలు పండడం కష్టం. ఆహారధాన్యాల కన్నా కమర్షియల్‌ పంటల మీదే ధ్యాసంతా. అప్పులైనా పర్లేదు. ఆడవారికి సరైన పోషణ లేకపోయినా పర్లేదు. ‘‘
ఏంటోనమ్మ, వర్షానికి కూడా ఫెమినిజంతో సంబంధం కలుపుతారు!!

Share
This entry was posted in బోగన్ విల్లా. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.