మట్టి మనుషుల స్వాతంత్య పతాక – డాక్టర్‌ కత్తి పద్మారావు

కొండ చరియలు విరిగి పడుతున్నాయి
కడలి అల్లకల్లోలమౌవుతుంది
ప్రకృతి సంక్షోభంలో జీవులు

అసువులు బాస్తున్నారు
సౌందర్యవంతమైన
ప్రకృతిని దృశ్యీకరించి
పదుల రోజుల్లోనే
మానవునికి, ప్రకృతికి
జరుగుతున్న ఘర్షణ
సూర్యుచంద్రుల, నదుల, పర్వతాల
అనుసంధానం శృతి తప్పుతుంది
ఎవడో అణువులను
సముద్ర గర్భంలో కుమ్మరిస్తున్నాడు
సముద్రాల గుండెల్లో అగ్నిపర్వతాలు
భూమి బద్దలవ్వటానికి
ఎంతో కాలం లేదు అని శాస్త్ర వాణి
ఇటు మనుషుల
అనుబంధాల్లో వైరుధ్యాలు
అతడు మొదటి కోడల్ని పొగిడాడు
మళ్లీ రెండో కోడల్ని అభినందిస్తున్నాడు!
అతని తండ్రి ఇతనికీ అదే చేశాడు!!
ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే వారికి
అంత సంపద! అన్ని ఆస్తులు!!
పాపం పెద్ద పెద్ద కులాలు!
బహు భార్యత్వాలు,
బహు భర్తృత్వాలు
ఒక్కసారే నిర్వహిస్తున్నాయి
వారి ముఖాల్లో నెత్తురు చుక్క లేదు
పుట్టేదొక చోట, పెరిగేదొక చోట
అందరూ తల్లుల దగ్గరే!
తండ్రులే పరిచయం కావట్లేదు
వీరి జీవితాలు
క్లబ్బుల్లా ఉన్నాయి
ఫైవ్‌స్టార్‌ హోటళ్ళలా
తళుక్కుమంటున్నాయి
తమను తాము అమ్ముకుంటున్నారు
ఇతరులనూ కొనుక్కుంటున్నారు
ఏ భాషలోనూ
వీరికి రాయడం రాదు
మాట్లాడటమూ రాదు
తల్లిదండ్రులు గుర్తుపట్టలేని
వీరి రూపాలు
వీరు గ్లోబల్‌ సమ్మిట్‌లు నిర్వహిస్తున్నారు
వారి రక్తపు నమూనాలు
వెతుక్కుంటున్నారు
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా
అన్ని జాతులతో కలిశారు
ఇంకా కులం మూలాల కోసం అన్వేషణ!?
ఉనికి కోసమా?!, ఊరట కోసమా?!
నిజమే! తమని తాము చూసి నవ్వుకుంటున్నారు
ఔను! మేము చెరువుల చెంత,
కాలువల ప్రక్క, నదుల ఒడ్డుల్లో,
సముద్ర తీరాల్లో పుట్టిన వారమే!
మా తల్లిదండ్రులను మేము గుర్తుపట్టగలం సుమా !
వారి ఒడుల్లోనే మేం పెరిగాం
వారి జోల పాటలు విన్నాం
మా అమ్మ జోల పాటలోని శృతిలయలే మా సంగీత పాఠాలు
ఇది నిజమే! ఆకాశ పక్షులే మాకు
గుంపు సంస్కృతిని నేర్పాయి
కొన్ని నీటి చుక్కలతో జీవించే పొదుపు మాకు నేర్పాయి
వాటి గమన సందేశమే
మాకు జీవన సూత్రం
మీరు ఈ నేలన పుట్టిన మాకే
బెత్తెడు నేల ఇవ్వడం లేదు
మేము మట్టి వాసనే వేస్తాం
చేపలు, జల్లలు, కొరమీనులే తింటాం
అందుకే మాకు పిల్లలు
వడివడిగా పుడుతున్నారు
వేప చెట్టుకు పట్టిన తేనె తాగుతాం.
తాటి ముంజలు బొటన వేలుతో తీసుకుని జుర్రుతాం
అందుకే మా బుగ్గలు నిగనిగలాడుతాయి
మేము గంజన్నంలో
పచ్చిమిరపకాయ, పెద్ద ఉల్లిపాయ
నంజుకునే తింటాం
మేము పున్నీటి బువ్వలో
ఎండు చేపను మెదిపి తింటాం
నిజానికి మేము వేప పుల్లతో తోముకున్నా
మా పళ్ళు నక్షత్రాల్లా మెరుస్తాయి
మేం జ్వరమొస్తే ధనియాల రసమే తాగుతాం
పిల్లి మిసర కాయలు, వేరుశెనక్కాయలు,
చిన్న దోస కాయలు
మాకు ఉపాహారాలు
మీ పిల్లల్ని బర్గర్లు, చాక్లెట్లు
పిజ్జాలు పెట్టి పెంచినట్టు
మేము మా పిల్లల్ని పెంచలేం
మేము సూర్యుడి కంటే
ముందే లేస్తాం
మీరు రాత్రులంతా చిందులేసి
అలసిపోయి అపరాత్రుల్లో పడుకుని
మధ్యాహ్నం లేస్తారు
మీ శరీరాలకు బట్టలు నిలవవు
మాకు కప్పుకోవడం ఇష్టం
మా ఇంట్లో మగ్గం ఉంది
మా అమ్మ చీర నేస్తుంది
మా తాత తాళ్లు పేనుతాడు
మా నాన్న ఇల్లు కుడతాడు
మా పెద్దమ్మ మినుములు ఇసురుతుంది
మా పిన్నమ్మ మజ్జిగ చిలుకుతుంది
మావి ప్రాకృతిక చర్యలు
మా జీవితంలో సహజత్వం ఉంది
మాది నిత్య జీవన సౌందర్యం.
మీ అమ్మ మీ పెదాలకు
రంగులు పులుముతుంది
మీ భుజాల మీద ఉన్న
టాటూల కోసం
మీరు స్లీవ్‌ లెస్‌లు ధరిస్తున్నారు
మీ అర్ధ నగ్న శరీరాన్ని
చూడడం కోసం
కుర్రాళ్ళు వెంట పడుతున్నారు
నిజమే! మేము
ఇసుక తిన్నెల మీద
వెన్నెల్లో ఆడుకుంటూ పెరిగాం
మీలాగా చైనా బొమ్మల్ని
పక్కలో పడుకోబెట్టుకోవడం
మాకు రాదు
మా కుక్కలు ఇంటి ముందుంటాయి
మీ కుక్కలు మీ బెడ్‌ల మీదుంటాయి
మా కుక్కలకు మా మీద విశ్వాసముంటుంది
మీ కుక్కలకు మీ మీద ప్రేమ ఉంటుంది
ఎంత తేడా ఉంది!
నిజానికి మాకు అక్షరాలు
పలకల మీద వచ్చాయి
మీరు అక్షరాలు స్క్రీన్‌ మీద నేర్చుకుంటున్నారు
మాకు ఒకసారి వింటేనే వస్తుంది
మీకు ట్యూషన్లు, కోచింగులు
అంకెలు చెప్పే వారొకరు
అక్షరాలు చెప్పే వారొకరు
చివరకు క్వశ్చన్‌ పేపర్లు కొని
మీ తల్లిదండ్రులు మీకు
చాక్లెట్‌లా అందిస్తున్నారు
మేము పరగడుపున
పరీక్షలు రాస్తున్నాం
అందుకే మా అక్షరాల్లో జీవం ఉంది
మీరు రూపాయల కోసం చదువుతారు
మేము జ్ఞానం కోసం చదువుతాము
మీ కోడళ్ళకు మీ నుండి భద్రత కావాలి
మా కోడళ్ళు మాకు కూతుర్లే
మీ జీవితం మీకు వ్యాపారం
మా జీవితం మాకు అనుభూతం
నిజమే! మీకు
ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే
అంత ఘనత! అంత పలుకుబడి!
మాకు పెళ్లంటే ఒక జీవితం
ఒక అనుబంధం
ఒక సముత్తేజం
ఒక రాగ బంధం
ఒక నక్షత్రాల పందిరి
ఒక అనురాగలయాత్మక గమనం
ఒక ఉమ్మడి జీవిత సందేశం
అందుకే ఆ ఉదయిస్తున్న సూర్యుడు
మానవ జీవన సోపానమే
సంఘ ధర్మం అన్నాడు
నైతిక జీవన వర్తనే
దేశీయ భావన అన్నాడు
నేల బిడ్డలదే ఈ దేశం అన్నాడు
మూలవాసులదే
భవిష్యత్‌ అన్నాడు
నదీ నాగరికతే దేశీయత అన్నాడు
మట్టి మనుషులే ఉత్పత్తి శక్తులన్నాడు
అతడు నవయాన బౌద్ధ గమనుడు
స్వాతంత్య్ర భావనా జన్యుడు
మానవతా ప్రజ్వలన సందేశకుడు
అందుకే ఈ యుగం
ఆయనది – మనది – మనందరిదీ.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.