నిశ్శబ్ద నిశీధిలో సిమ్మెటల రొద
ఒక్క సారిగా ఒళ్ళు జలధరించే కేక నిస్సహాయంగా
చుట్టూ ప్రకృతి ప్రతిధ్వని ని తనలో కలుపు
కొంటూ మూగసాక్షిగా అత్యాచారాల పరంపర
సాగుతూనే ఉంది.
మీన మేషాల న్యాయం గోడమీద యోచనలో
కూరుకొని ఉంది పాఠశాల వికాసంతో నం
నేర్పెచోటు కీచకులు ఏ రూపంతో ఉంటారో
అందని ఆలోచన స్కూల్ బస్సులో భద్రంగా
తీసుకుపోయి బడినుంచి ఇంటికి భద్రంగా
తీసుకొస్తారో లేదో తెలియని ఎదిరి చూపు
చుట్టాలు పక్కాలు ఇరుగు పొరుగు ఏ ముసుగులో
ఉన్నారో ఆడపిల్లయితే చాలు వయస్సు వరుస
ఏదీ అవసరంలేదు చిద్రుపలై పోతున్న ఆడతనం
ప్రతి ఘటిస్తే ప్రాణమూ పోతుంది చదువులో
భాగంగా ఊపిరిని పోసి సంరక్షించే వైద్యురాలు
ఏ మర్మ మెరుగని పాలుమర్వని చంటి గుడ్డు
విద్యార్ధిని ముసలివగ్గు అభ్యసనంలో భాగమై
ఆట నేర్చుకునే శిష్యురాలు కాదేదీ క్రౌర్యానికి
అనర్హం పశు ప్రవృత్తి నిండా కల్గిన మృగాళ్లు
ఇంటిదగ్గర దుకాన్లకు పోయినా బజారులో
తప్పని నిత్యావసరాలకు వెళ్ళినా,ఆఖరుకు
కాలకృత్యాల కై పోయినా రక్తపురుచి జాడ
పట్టుకుని వచ్చే తోడేళ్ళయి పీక్కు తింటున్న
ప్రమాదకర మృగాలు చూపు చూస్తుండగానే
కంటి పాపను మాయంచేసే ఒడుపు ఎల్లె
డలా విస్తరిస్తున్న విషసంస్కృతికి అడ్డు
కట్ట కఠినచట్టాలు సత్వర న్యాయం ఉపశాంతి
ఇంకా వెలుగు చూడని ఘోరాలెన్నో…
(రోజుకింత మరింతగా రెచ్చిపోతున్న హత్యో
దంతాలకు కన్నీటి నిరసన గా)