వృద్ధాప్యం బరువై .. ఆదరణ కరువై.. – వి.శాంతి ప్రబోధ

‘ఈ అన్యాలం పాడుగానూ.. బతికు న్నన్ని ఒద్దులు ఆ తల్లి గోసబోసుకున్నరు. గిప్పుడు సూడున్రి. చావు ఎంత ధూమ్‌ దాం చేసిన్రో .. ‘‘అంటూ యాదమ్మ చేట చీపురు తో బయటకు నడిచింది. ఆమె ఎవర్ని ఉద్దే శించి అంటున్నదో మాకు అర్థమైంది. తల్లి దండ్రులు లక్షలు పోసి చదివించి విదేశాలు పంపిస్తుంటే, అక్కడ చదివి ఉద్యోగం సంపాదించుకున్న పిల్లలు డబ్బు పంపి తల్లిదండ్రుల్ని వృద్ధా శ్రమాల్లో చేర్చి రుణం తీర్చుకుంటున్నామని సమాధాన పడుతు న్నారు.

పాపం ఆ పాపాయమ్మ గారికి అదీ లేదు. ఆస్తి అంతా కూతురుకు దోచిపెట్టావ్‌ అంటూ సాధించి చట్టిలో పెట్టారు. జవసత్వా లుడిగిన పెద్దల్ని చూసు కోవడం పిల్లల బాధ్యత కాదా? బాధగా అన్నది మా అత్తగారు.
‘‘అసొంటోళ్లు మస్తు పైస పెట్టి పెద్దదేదో వచ్చినోళ్లందరికి ఇచ్చిన్రట గదమ్మా .. హూ.. బతికున్నప్పుడు ముద్ద పెట్ట చెయ్యిరాదు గానీ.. ‘‘ నిరసనగా అంటూ లోనికి పోయింది యాదమ్మ. యాదమ్మ ఆవేశంలో, అత్తగారి ఆవేదనలో అర్థముంది.
ఆ పెద్దావిడ చనిపోయిన తర్వాత ఆవిడ కొడుకు కోడలు చేసే హంగామా తక్కువేం లేదు. శ్రద్ధాంజలి పేరుతో చాలా డబ్బు ఖర్చు చేసి వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. ఖర్మకాండల పేరుతో చికెన్‌, మటన్‌, చేపలు, రొయ్యలతో భోజనాలు పెట్టారు. జ్ఞాపిక పేరుతో వచ్చిన వారందరికీ ఖరీదైన చిన్న కుక్కర్‌ పంచారు. తమకు తల్లిపై ఎంతో ప్రేమ, గౌరవం, బాధ్యత ఉన్నట్లు, తమ స్థితి గతులు చూపించుకుంటూ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి పెద్ద షో చేశారు.
మలిసంధ్యలో చాలా మంది కుటుం బంతో వున్నప్పటికీ అనాథల్లాగే ఫీలవు తున్నారు. తమను పలకరించే వాళ్ళు లేక, మౌనంగా ఉండడం వారికి నరకంగా ఉం టుందని, ఇంటి కంటే వృద్ధాశ్రమమే బెటర్‌ అనుకుంటున్నారు కొందరు. అక్కడయితే కనీసం మాట్లాడే వాళ్ళయినా ఉంటారని వృద్దాశ్రమాల వంక చూస్తున్నారు కొందరు వృద్ధులు. కొందరికి వృద్ధాశ్రమాలు నిర్వ హించడం ఒక ఆదాయ వనరుగా మారింది. మధ్యతరగతి, ఉన్నత స్థాయి వాళ్ళు డబ్బు పెట్టి ఉండగలరు. మరి పేదల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ ఎంత మందికి అందుతున్నది?
వృద్ధాప్యం మరో బాల్యం అంటారు. అలాంటప్పుడు మరో బాల్యాన్ని ఎందుకు ఆదరించారో.. ఆనందించరో.. మనిషి ఎందుకింత స్వార్థంగా ప్రవర్తిస్తున్నాడు? మనిషిలోని ప్రేమానురాగాలు, ఆప్యాయ తలు, అనుబంధాలు ఎవరెత్తుకుపోయారు? వృద్ధుల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం. వీళ్లిప్పుడు పోతారా అని ఎదురుచూసే తరం తయార యిందేంటి? మనిషి సుఖంగా జీవించాలా? అర్ధవంతంగా జీవించాలా? వృద్ధాప్యం అను భవమా? అవరోధమా? నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ‘‘ఒకప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ధైర్యం అనుకునేవాళ్లం. ఇప్పుడు పనికిరాని వాళ్ళయిపోయారు. ఎప్పుడు పోతారా అని కళ్ళల్లో ఒత్తులేసుకు చూస్తున్నారు. మనుషుల్లో సర్దుబాటు తత్వం మరీ తగ్గిపోతున్నది అత్తగారి గొణుగుడు వినపడుతున్నది.
కాలప్రవాహంలో తరతరానికి మధ్య ఘర్షణ ఎప్పుడూ ఉంది. స్వార్ధపూరిత సమాజంలో కుల, మత, వర్గ జెండర్‌ భేదం లేకుండా ఉన్న సమస్య వృద్ధాప్య సమస్య. ఇవాళ రేపు ఆరోగ్యం లేకపోతే వృద్ధులు అన్నీ పోగొట్టుకున్నట్లే. కడుపున పుట్టిన పిల్లలే తల్లిదండ్రులను చూసుకోనప్పుడు, సేవ చేయలేనప్పుడు ఇతరులకేం బాధ్యత ఉం టుంది. తగాదాలు పడి కన్నవాళ్ళకి నరకం చూపించడం సర్వసాధారణం అయిపో యింది. కొందరు వదిలించుకోవడానికి రక రకాల మార్గాలు వెతుక్కుంటు ఉంటేె మరికొందరు ఇంటి నుంచి గెంటిస్తున్నారు. ఇదంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ కనిపిస్తుంది. కుటుంబ పరువు పేరుతోనో కన్న బిడ్డలపై మమకారం చావకో నోరు మూసుకొని అవమానాలు భరిస్తూ వృద్దులు మానసికంగా నలిగి పోతున్నారు. ఆస్తిపాస్తులు దండిగా ఉన్న ప్పటికీ పిల్లల, ప్రేమ, ఆప్యాయత, అభిమా నం, అనురాగం అందక అలమటిస్తున్నారు మరికొందరు.
ఎక్కడో కొద్దిమంది మాత్రం అవ మానాలు భరించలేక పోతున్నారు. అటు వంటి వారికోసం 2007లోనే తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ చట్టం వచ్చింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 125 కింద పిల్లలు తాను పోషించడంలేదని కేసు పెట్టొచ్చు. చట్టపరమైన రక్షణ పొందవచ్చు. జీవితంలో మిగతా దశలన్నిటినీ ఎట్లా సంతోషంగా ఆహ్వానించామో అదే విధంగా వృద్ధాప్యాన్ని చూడడం, ఆ దశలో వచ్చే మార్పులను అంగీకరించడం అవసరం. సానుకూల వైఖరి తీసుకోవాలి. అందరితో కలుపుగో లుగా ఉండాలి. బంధు మిత్రుల్ని పలకరిస్తూ ఉండాలి. వృద్ధాప్యంలో ఎవరిపై ఆధార పడకుండా ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రతకు సరైన ప్రణాళిక ముందే చేసుకోవాలి. శారీరకంగా చురుకుగా ఉండటం కోసం ఏదో ఒక పనిచేస్తూ ఉండాలి. వ్యాయామం చేయాలి. నడక చాలా మంచిది. ఆరోగ్య విషయంలో ముందు నుంచి జాగ్రత్త పడాలి. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ఆస్తిపాస్తులు, డబ్బు నగలు ఉన్నవాళ్లు అవి ముందే పిల్లలకు ఇచ్చేయకూడదు. ఎంతో కొంత ఆదాయం వచ్చే మార్గం ఏర్పరచుకోవాలి.
మరోవైపు కొడుకు కోడలు, లేదా కూతురు ఏదైనా కారణం వల్ల మరణిస్తేనో, పిల్లలను విడిచిపోతేనో ఆ పిల్లల బాధ్యత, భారం మోసే పండుటాకుల వ్యధ మరోరకం. జీవితం ఇచ్చిన వ్యక్తుల జీవించే హక్కు కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కన్నబిడ్డలదేనా? సమాజానిది, ప్రభుత్వానిది కూడానా?

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.