ప్రియమైన అమ్మా… నాన్నా…

పుస్తకావిష్కరణ సందర్భంగా అరుణా మోహన్ గారి ప్రసంగ వ్యాసం

ముఖ్యంగా ఈరోజు మనమంతా సమావేశమవడానికి కారణం ఈ విద్యా సదస్సు ఏర్పాటు చెయ్యడం. ఇక్కడ అందరం నేర్చుకుంటున్నాం. అందరం నేర్చుకొంటున్నాం అంటే అందరం మనల్ని సరిదిద్దుకొవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సరిదిద్దడం అంటే ఒకరిపట్ల ఒకరికున్న శ్రద్ధ.ముఖ్యంగా ఇక్కడ ఈ పుస్తకంలో నాకేం కన్పించిందంటే పిల్లలు, పిల్లలకున్న కోరిక. మాకు చాలా కోరికలున్నాయని రాసారే వాటిలో ఒక కోరిక ఏమిటంటే తల్లిదండ్రులు బాగా వుండాలని. అందుకనే బాగా లేనిదెక్కడో చెబుతూ బాగా వుండడానికి క్రొత్తరకంగా ఒక నిర్వచనం చెప్పారేమో అన్పించింది. పిల్లలందరికి మనకున్నట్లుగానే ఏది ఎలా వుంటే బాగుంటుందో అనే అభిప్రాయాలు కూడా వాళ్ళ పరిశీలనలోనుండి వాళ్ళకు కలుగుతాయి, ఏర్పడతాయి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ అరవింద స్కూల్లో మొత్తం జీవితానికి ఎన్ని కోణాలున్నాయో ఆ కోణాలన్నింటికి విద్యార్థులను పరిచయం చేయడం ఒక వాతావరణం ఉన్నది కాబట్టి ఇది వేదిక అయ్యిందేమో అని అన్పిస్తుంది. ఇది ఒక క్రొత్త పోకడ నాదృష్టిలో. అంటే పిల్లలకు, పిల్లల అభిప్రాయాలు, పిల్లల ప్రేమ, పిల్లల కోరికలు విప్పి చెప్పుకోటానికి నిజంగా ఈ ఉత్తరాలనేవి. ఈ ఉత్తరాలు ఎస్పెషల్లీ అంటే ఒక పర్పస్ ఓరియంటెడ్గా కాకుండా తల్లిదండ్రులకు ఉత్తరాలు వ్రాయమనడంలో ముఖ్యంగా వాళ్ళకు ఏది అక్కడ అడ్డుగా నిలుస్తుందో తల్లిదండ్రుల గురించి అందరం బాగా వుండాలనుకుంటాం. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎదుటివాళ్ళు ఎలా బాగుండాలో అన్నట్లుగా వాళ్ళకు సూచనలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంటారు. పెద్దవాళ్ళం మనం ముఖ్యంగా చేస్తుంటాం. అలాంటి సూచనలే పిల్లలు ఇక్కడ పెద్దలకిచ్చినట్లుగా నాకు తోస్తుంది. అంటే ఈ కరక్షన్ అన్నది ఒక పక్కనుండి కాకుండా రెండువైపుల నుండి పరస్పరం ఒకరికొకరు ఏది బాగాలేదో తెలియజెప్పుకోవటం నుండి ఒక ప్రేమపూరిత వాతావరణం ఇంటిలో వుంటుంది. ముఖ్యంగా ఆ వయస్సు పిల్లలకు చాలా విమర్శనాత్మక దృష్టి వుంటుంది. చాలా సన్నిహితంగా ఉన్న మనుషులమధ్య ఏమి జరుగుతుందో గమనించడం తేలిక కాబట్టి ఆ దృష్టి అటువైపు సాగుతుంది. అందుకని ఏమి బాగా చేయడం లేదో, ఎక్కడ వాళ్ళు నలిగిపోతున్నారో తల్లిదండ్రుల ప్రవర్తన ఎక్కడ వాళ్ళను బాధిస్తుందో అవన్నీ పేరు రాయకుండా, పేరు వ్రాసినా కూడా, ఇదొక అవకాశంగా భావించి వాళ్ళు మనసువిప్పి ఈ పుస్తకం మీద పరిచారు. అంటే వాళ్ళ ఉత్తరాల్లో మనసు విప్పారు. ఆ మనసు విప్పి మాట్లాడుకోవడంకాని, రాయడం కాని చాలా అవసరం ఎవరికైనా. ఈ రోజుల్లో వినటం తగ్గిపోతుంది.

అంటే మన మనసుల్ని గురించి, మనం సరిగ్గా చూడటమే మానేస్తున్నాం. పిల్లలు సన్నిహితంగా మెలుగుతూ మనమేం చేస్తున్నామో, మన ప్రవర్తన ఎట్లా వుంటుందో గమనించి వాటిలో ఉన్న లోటుపాట్లను మనముందు వుంచుతున్నారు అంటే ఎక్కడ మనం చాలా బాగా వాళ్ళను ప్రోత్సహిస్తున్నామో వాళ్ళు గ్రహించి దాన్ని మళ్ళీ ఇంకా కొనసాగించాలని వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు అంటే ఇవన్ని మనకు అవకాశాలు. గొప్ప అపార్చునిటీస్. ఏవి మనం కొనసాగించాలో ఏవి వాళ్ళకు బాధాకరంగా వున్నాయో వాళ్ళకు వాళ్ళుగా గుర్తించి మన దృష్టికి తీసుకురావడం అంటే నిజంగా అవి గొప్ప అవకాశాలన్నమాట. చంద్రలతగారు ఇందాక అంటూ ఉన్నారు. ఈ ఉత్తరాలన్ని చదివే సరికి నాలో చాలా మార్పువచ్చింది, మా ఇద్దరిలో చాలా మార్పు వచ్చింది అని. ఇది చిన్న విషయం కాదు. అంటే ఒకదానికి స్పందించడం అనేది జరిగినప్పుడు మార్పు అనూహ్యంగా వస్తుంది. అలాంటి అనుభూతులు అంటే ఈ అనుభూతికి అవకాశం తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో వుండే ఈ ప్రేమానుబంధంలోనే చాలా సుసాధ్యం అవుతుందన్నమాట. దానికి ఒకవిధంగా ఈ ఉత్తరాలు ఒక మంచి భూమికయ్యాయి అని అన్పిస్తుంది. అందుకనే మనం ముఖ్యంగా మన దృష్టిలోకి తీసుకురావలసినది ఏమిటంటే పిల్లలు కూడా మనల్ని గమనిస్తుంటారు. చాలా దగ్గరగా గమనిస్తారు. మనం గమనిస్తున్నామా. మనం ఒకమాట అన్నపుడు వాళ్ళు ఎలా భావిస్తున్నారు. వాళ్ళ ముఖకవళికలు ఎలా మారిపోతున్నాయి. వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందా? ఇంకా కుంచించుకు పోతున్నారా? ఇంకా ప్రతిఘటన ఎక్కువ ఎదుర్కొంటున్నామా మనం ఇవన్నీ కూడా గమనించాలి. ఈ గమనికలో నుండి పిల్లలకు మనం చక్కగా రెస్పాండ్ అవ్వగలం. ఎక్కడైనా సరే, ఎదుటివాళ్ళను గమనిస్తుంటే మన ప్రవర్తన వాళ్ళకు ఎలా వుంది. ఎలాంటి అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. లేకపోతే అది ఇబ్బంది కలుగజేస్తుందా? సానుకూలంగా వున్నదా? అని గ్రహిస్తాం. దానితో మనం ఎలా వుండాలో అలా వుంటాం. ప్రయత్న పూర్వకంగా కాదు. ఆ గమనికలోనుండి అది సాధ్యమౌతుంది. ఆ గమనికను మనం తప్పనిసరిగా పెంచుకోవాలి. పిల్లల్ని పిల్లలు చదువుకుంటారులే, మనం ఇవి ఏర్పాటు చేశాంలే అని అనుకోవడం కాదు. పిల్లల్ని ఎప్పుడు మనం గమనికలో వుంచుకోవాలి. చాలా ముఖ్యమైన విషయమిది. వాళ్ళను గమనిస్తున్నపుడు వాళ్ళు ఎక్కడ, ఎవరితో, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఒక చిన్న ప్రశ్న కూడా మనం వెయ్యవచ్చు. దాంతో వాళ్ళు మనసువిప్పి చెప్పుకోవటానికి అవకాశం మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ ఉత్తరాలు, ఒక అవకాశం ఎలా అనుకుంటున్నామో మన గమనికలోనుండి అన్ని అవకాశాలు మనం పిల్లలకు ఇవ్వగలం. అందుకనే పిల్లల్ని గమనించండి. దయచేసి గమనించండి, గ్రహించండి. అందరు ఇక్కడున్న వక్తలంతా చెప్పిందేమిటంటే పిల్లలకు కొంత సమయం ఇవ్వండి అని. సమయం ఇవ్వటం అంటే నువ్వు కూర్చో, నువ్వు చదువు, నువ్వు చదువుతున్నంతసేపు నేను నీప్రక్కనే కూర్చుంటాను అని కూర్చుని, వాళ్ళచేత అదేపనిగా చదివిందే చదివించడం, రాసిందే రాయించడం అసలే కాదు. వాళ్ళకు సమయం ఇవ్వటం అంటే, వాళ్ళను గమనించటం, వాళ్ళను ప్రశ్నించడం, వాళ్ళు ప్రశ్నించే వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకుని సమాధానం చెప్పడం. మనం అడ్డు వస్తున్నాం అనుకొన్నపుడు ప్రక్కకు తప్పుకోవడం, హాయిగా వాళ్ళని వాళ్ళ స్నేహితులతోనో, ఎవరితోనో మాట్లాడనివ్వడం. అంటే ఆ కోరికలన్ని పిల్లల్లో ఈ ప్రపంచానికి వాళ్ళు సానుకూలంగా ఎదిగే ప్రక్రియలో ఎంతమందో మిత్రులు వాళ్ళతో ఆటపాటలు కొనసాగించాలని వాళ్ళు అనుకోవటం వీటన్నింటిలో వీళ్ళు కోల్పోతున్నదేమిటి? ఎలా తల్లిదండ్రులుగా మనం అడ్డుకుంటున్నామనేవి అక్కడక్కడ రెండుమూడు చదివి వినిపిస్తాను.

నన్ను మీరు ఆరవయేట పాఠశాలలో చేర్పించారు. నాతోపాటు చదివే పిల్లలంతా ఆనందంగా ఆటలాడుకుంటూండేవారు. కానీ నేనుమాత్రం వారితో పాటు ఆడేదాన్ని కాదు. ఎందుకంటే బట్టలు మురికిగా వుండటం మీకు ఇష్టం లేదు కనుక. ఇలా ఎంతమంది తల్లిదండ్రులు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, బట్టలు పాడవుతాయి, పడిపోతావ్. వాళ్ళు పడతారు, లేస్తారు, కాని ఎంతో నేర్చుకుంటారు. ఆటలనుండి బేబీ మూవ్మెంట్స్లో కండరాల అభివృద్ధిలో ఆ బేబీ ఎంత డెవలప్ అవుతుందో మనం గ్రహించాలి. అది చాలా ప్రధానమైంది. అలాగే అందరి పిల్లలు ఉసిరిగాయలు, మామిడికాయలు, రేగికాయలు కొనుక్కుని తింటూవుంటే, నేను కొనడానికి సాహసించలేదు, ఎందుకంటే మీరు అందరితో మా పిల్ల ఇచ్చిన డబ్బులన్ని వెనక్కి తెచ్చివేస్తుంది అని గర్వంగా చెప్పుకుంటారు. ఒక బ్రాండ్ వేసేసాము. మా అమ్మాయికి ఇచ్చిన డబ్బు జాగ్రత్తగా వెనక్కి తెచ్చి ఇస్తుంది అనేది, అంటే ఆ అమ్మాయిని గురించి, ఆ అమ్మాయిని ఇది నువ్వు అని ఒక నిర్ధారణ చేసి, ఆ నిర్ధారణతోనే ఆ అమ్మాయి జీవితం కొనసాగించాలన్నట్లుగా ఒక రకమైన ఎమోషనల్ ప్రిసూర్ని మనం ఆ పాపలో నిజంగా చొప్పించకపోతే హాయిగా మిగతా పిల్లలు తింటూ వుంటే అవి కొనుక్కోవాలనిపించినపుడు హాయిగా కొనుక్కోవచ్చు కదా! ఇవన్నీ వాళ్ళ కోరికలే. కోరికలు తీర్చడమంటే డబ్బులిచ్చేసి, డబ్బులు వెనక్కి తెచ్చినపుడు మా అమ్మాయి యిలా తెస్తుందని ఒక బ్రాండ్ వేయడం అస్సలు కానేకాదు. బయట అమ్మేవన్నీ మంచివి కాదు. కొనుక్కోకు అనేమాట నాకు అప్పుడు జ్ఞప్తికి వచ్చేది. చూడండి మనం మాట్లాడే మాటలు అసలు ఏది చేయబోయినా ఎట్లా అడ్డంకులుగా వుంటాయో, హాయిగా అక్కడ ఏది అవసరమో దాన్ని సరిగ్గా గమనించి, వాళ్ళు తీసుకునే విధంగా చేయకుండా మనం మన మాటల బాణాలు ఎలా వాళ్ళలో అలా గుచ్చుకుని, అలాగే నిలిచిపోయి జీవితాంతం అవి ఎప్పుడేది చేయాలన్నా విపరీతంగా వెనక్కి తగ్గేవిధంగా ఎలా చేస్తున్నామో చూడండి. ఇప్పటికి నేను ఖర్చుచేసే ప్రతి రూపాయిని మీకు చెప్పే ఖర్చుపెట్టాలి, ఇప్పటికి నాకు స్వేచ్ఛలేదు. ఎవరితోనైనా మాట్లాడాలంటే, నేను మిమ్మల్ని అడగాలి. అంటే ఆ కుటుంబంలో పోకడ అలావుంది. ఎవరితో మాట్లాడాలన్నా కూడా తండ్రితో చెప్పాలి తప్పనిసరిగా. అది ఆ పాప బాధ. అంతేకాదు ఆ ఇంట్లో నేను వాడే ఏ వస్తువు నా యిష్ట ప్రకారం వుండదు. అన్నీ మీ యిష్టం, మనమేమో మనకు నచ్చే చీరలు కొనుక్కోవచ్చు, నచ్చే బట్టలు వేసుకోవచ్చు. కాని పిల్లలు మాత్రం మనకు నచ్చిన బట్టలు వేసుకోవాలా? అది వాళ్ళ ప్రశ్న? ఇంటి దగ్గర అమ్మ కూడా ప్రొద్దుటి నుండి సాయంత్రం వరకు యంత్రంలా వెట్టి చాకిరీ చేస్తూ వుంది. అంటే పిల్లల గమనిక ఎలా వుందో చూడండి. ఎంత గొప్పగా గమనించిందో చూడండి. తన మనస్సులో ఏదో చెప్పాలనే ఆరాటం ఉన్నా నువ్వు తన మాటను ఒప్పుకోవనే ముద్ర పడిపోవడం వలన తను ఏమాత్రం నోరు కదపలేకపోతోంది. ఎంత గొప్ప పరిశీలనో చూడండి. ఎలాగు ఒప్పుకోరు నాన్న అని చెప్పేసి వాళ్ళ అమ్మ నోరు మెదపలేదు అనేది అంత గమనిక మనకుంటుందా మన పిల్లల పట్ల. ఇది మనం ప్రశ్నించుకోవాలండి. అంటే పిల్లల్ని గురించి కూడా తన పరిశీలనను ఎలా తెలియజేస్తున్నారో, పిల్లవాడికి ఆమాత్రం స్వేచ్ఛ వుంది. కొందరు మరీ కరెంటు మిషన్ల లాగా అయిపోయారు. వారికి కూడా తల్లితండ్రులు కొంచెం స్వేచ్ఛ ఇస్తే వారి ఆనందం అంతా ఇంతా కాదు, బాధను దిగమింగి తల్లిదండ్రి అన్న మాటలకు కట్టుబడి ఉన్నారు ఎంతోమంది. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్, ఇట్లాంటి పరిశీలనలు ఎన్ని వున్నాయో ఈ పుస్తకంలో. కానీ మీరు మాకు అన్నీ చూస్తున్నారు. కాని, ఎందుకునాన్నా ఈ భయాలు, ప్రతిదానికీ భయం. వాళ్ళు వెళ్ళబుచ్చిన భయాలన్నీ, వీళ్ళలో భయాలయి, ఎప్పుడు ఏది చేయాలన్నా భయం. ప్రతిదానికి భయం. పరీక్ష అంటే భయం, పరీక్షంటే భయపడాలా, చదువుకునే పిల్లవాడికి ఎందుకు పరీక్ష భయం, అదొక అవకాశం పిల్లవాడికి. కానీ ఎందుకు భయపెడుతున్నారు, భయం అలవాటై పోయింది. ఇలా ఎన్ని మానసిక అలవాట్లగురించి, వాటి ఇబ్బంది గురించి వాళ్ళు ఎంత సునాయాసంగా మనముందుకు (దృష్టికి) తీసుకొని వచ్చారో, మాకు ధైర్యం చెప్పవలసిన మీరే అలా భయపడితే ఎలా? చదువుకోవాలన్న ధైర్యం, పట్టుదల మాకున్నాయిగా, అమ్మలాగా మాతోపాటు మీరు నిలబడగలరని ఆశిస్తున్నా. ఇందాక శివరాంగారు ఒకదాన్ని చెప్తూ, అంటే దాన్లో ఒక ద్వంద్వం ఉందన్నమాట. అది నెరవేరినా నెరవేరకపోయినా అనేది, ఒకవేళ సరిగ్గా రాయకపోవచ్చు, రాయొచ్చు. పరీక్షలో మంచి మార్కులు రావచ్చు, రాకపోనూవచ్చు, ఇవన్నీ వుంటాయి, ఇవి జీవితంలో సహజం. దాన్ని గమనించి చాలా చక్కగా అమ్మలాగా మాకు ధైర్యం చెప్పవలసిన మీరే అలా భయపడితే ఎలా? చదువుకోవాలనే ధైర్యం, పట్టుదల మాకున్నాయిగా,చదువుకోవాలనే వాళ్ళు వస్తున్నారుగా, భయం మాకు లేదు. మీరెందుకు అనవసరంగా చొప్పిస్తారు అనీ, చాలాసార్లు మనం ఇలా చొప్పిస్తున్నాం. పిల్లల్ని భయపెడుతున్నాం. అది ఒక పెద్ద ఒత్తిడి అయిపోతుంది వాళ్ళకి.”మీరిలా త్రాగి తిట్టడం వల్ల పగలంతా పనిచేస్తూ, నిద్రకు నోచుకోని అమ్మ ఎంత బాధ పడుతుందో మీకు తెలియడం లేదు. ఇన్ని విషయాలలో సంతోషంగా వున్న నేను మీకు ఉన్న ఈ అలవాటువల్ల చాలా బాధ పడుతున్నాను. దయచేసి ఆ అలవాటు మానండి”. సూటిగా చెప్పలేని ఒక గొప్ప సూచన తండ్రికి. తండ్రి బాగుపడటానికి, తండ్రి బాగుపడటంతో కుటుంబం బాగుపడటానికి, వాళ్ళ అమ్మ సంతోషంగా వుండటానికి, ఆపైన తాను సంతోషంగా వుండటానికి ఎంత చిన్న కోరికో చూడండి. కానీ ఎంత పెద్ద విషయమో చూడండి ఆ తండ్రికది. ఇలా, ఇలాంటి అలవాట్లతో, ఇక్కడ చాలా ఉత్తరాల్లో ఈ ‘త్రాగుడు’ అలవాటు అవమానకరంగా వుందో, అంటే ఎంత బాధాకరంగా వుందో, పిల్లలక్కడక్కడ కనిపిస్తూ వుంది. ఇవన్ని పిల్లలకు చాలా బరువులు. మరి ఇవన్నీ మనకు అవకాశాలు కాదా? మరొక ఉత్తరంలో మీరు రోజు త్రాగరు. ఎప్పుడో ఒకసారి, అది త్రాగడమెందుకు, మానేయొచ్చుకదా! “మీరు త్రాగి రాత్రి ఏ పది, పన్నెండు గంటలకు రావడం నాకు నచ్చదు”. ఎంత స్పష్టతో చూడండి. ఏది బాగాలేదో వాళ్ళ నాన్నలో ఆ అమ్మాయికి స్పష్టంగా అర్థమయ్యి అదినాకు నచ్చదు అని చెప్తుంది. మనమైతే చెప్తున్నాం. మరి వాళ్ళకు నచ్చనివి అలాగే మన ఇష్టమేనా! అమ్మ నిన్ను వెతుక్కురావడం, నువ్వు త్రాగి ఏ ఇంట్లోనో నిద్రపోవడం నాకు ఇష్టంలేదు. పిల్లలకు ఎలా వుంటుందంటే, అమ్మ నాన్న గురించి చాలా బాగా చెప్పుకోవాలి. చాలా బాగా వుండాలి. వాళ్ళ కుటుంబం, సంఘం దృష్టిలో చాలా బాగా ఉన్నతంగా వుండాలి,మంచిగా వుండాలి. సింపుల్గా చెప్పుకోవాలంటే మంచి కుటుంబం అన్పించుకోవాలి అని వుంటుంది, పిల్లలకు మరీ వుంటుంది. ముఖ్యంగా 14, 15 సంవత్సరాల వయస్సు పిల్లలకు బాగా వుంటుంది. మరి ఆ వయస్సులో తల్లిదండ్రిలో ఉన్న ఏ దురలవాటు అయినా, దురలవాట్లు కాకపోవచ్చు, కొంతమంది తల్లులు విపరీతంగా అరుస్తూ వుంటారు, పోట్లాడినట్లుగా వుంటుంటారు. మాటిమాటికి విరుచుకు పడటం, ఆ పాప సహించలేక పోయింది. ఇవన్నీ వాళ్ళకు నచ్చుతాయా మరి. మనకు నచ్చుతున్నాయా మన పిల్లలు చేసే పనులు. ఇలా పిల్లలకు నచ్చనివి మనలో ఎన్ని వున్నాయో, పిల్లల ముఖాలు చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. అపైన మనం ఎందుకు నచ్చలేదో, ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే అంతకు ముందు సన్నివేశంలో మనం ఏమి చేసామో, మనకు కూడా తడుతుంది. ఇలా ఎందుకు చేసానా అని అన్పిస్తుంది. కొన్ని శివరాంగారు చెప్పినవి అంటే పనిచేస్తూ పిల్లలు చదువుకుంటూ వుంటారు. నాకు బాధగా వుంటుంది. ఒకసారి హైదరాబాద్ సంతకు పంపిస్తే వారం లేదా రెండు వారాలు వుండవలసి వుంటుంది. బడికి రాలేక పోతున్నాను. పరీక్షలు వ్రాస్తే తక్కువ మార్కులు వస్తున్నాయి, రాత్రి టీవిలో చూసిన వాళ్ళు గమనించి వుంటారు. ప్రత్తి సీజను కదా! పాఠశాలల్లో హాజరు తక్కువైపోయింది అని టీవి 9 న్యూస్లో వస్తుంది.

ప్రత్తి సీజనులో పిల్లలు వెళ్ళి పొలాల్లో తమ చిన్ని చేతులతో కష్టపడి సంపాదించకపోతే ఆ సంవత్సరమంతా ఆ కుటుంబానికి ఆదాయం తగ్గిపోతుంది. వాళ్ళు పని కూడా చేయాల్సివస్తుంది. బాలకార్మికులని మనం పూర్తిగా స్కూల్లోనే వుంచాలి. అసలు వాళ్ళు పని చేయకూడదు అనుకోవడం మరి ఎంత వరకు సమంజసమో మనం ప్రశ్నించుకోవాలి. నిజానిజాలు మనం తప్పనిసరిగా మన దృష్టిలోకి తెచ్చుకోవాలి. మనం జీవిస్తున్నది జీవితం. ఇక్కడ ఎలా జీవించడం అన్నది ప్రధానం గాని, అంటే కొన్ని నిర్ణయాలు చేసి అలాగే వుండాలి జీవితమంటే, పిల్లలంటే స్కూళ్ళల్లో వుండాలి. అంతేనా? ఇదికూడా మనకు ఒక విధంగా ఆలోచించుకోవాల్సిన విషయం. నువ్వు నన్ను ఎప్పుడు కట్టుదిట్టం చేయలేదు. అన్ని విషయాలు నాతో పంచుకోమని, నీవు తీసుకునే నిర్ణయాలు మంచిగా వుండాలని, మంచి విషయాలు నాకు చెప్తూ వుండేదానివి. ఈ వయస్సులో వాళ్ళకు నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా వస్తుంది.

అందుకనే వాళ్ళమ్మ తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ ప్రత్యేకంగా ఎంచి, ఏదైతే వాళ్ళలో ఒక శక్తి ఎదుగుతుందో, ఒకదాన్ని చేయగలుగుతారో, అది ఎదుటివాళ్ళు చేసేదానిలో గమనిస్తారు. అందుకని ఈ ఎదుగుదలని కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకు నిర్ణయాలు చేసుకొనే అవకాశం మనం ఇవ్వాలి. పొరపాటు చెయ్యొచ్చు, కాని సరిదిద్దుకునే అవకాశం మనం కల్పించవచ్చు, కాని నిర్ణయించుకునే శక్తిని వాళ్ళలో పెరగనివ్వాలి మనం. నేను ఆడుకుందాం అంటే వద్దు పడితే దెబ్బలు తగులుతాయని ఆడుకోనిచ్చేవారు కాదు. నేను మా స్నేహితులతో విహారయాత్రకు వెళ్తాను అంటే ఎందుకు వాళ్ళతో. మనం తరవాత వెళదాం అంటారు. పెద్దవాళ్ళతో వెళ్తే వచ్చే ఆనందం వేరు, ఆనందం వుండదని కాదు, వాళ్ళ వయస్సు వాళ్ళతో వెళ్తే వచ్చే ఆనందం వేరు. ఇది కూడా మనం కేర్ చేయాలి. మనతోటివాళ్ళతో మనం మాట్లాడినపుడు ఒకరకంగా ఆనందిస్తాం, పిల్లలతో వున్నప్పుడు ఇంకోరకంగా ఆనందిస్తాం. ఇలాగే ఆనందించాలి అని మనం అనుకుంటే ఎలాగా? మనం ఒకటి చేస్తూ మన వాళ్ళనుండి మరోరకంగా ఆశిస్తే ఎలాగా? నేను పాటలు వినాలనుకుంటాను. క్యాసెట్ పెడితే విన్నపాటలే ఎన్నిసార్లు వింటావ్? ఇవీ మనకు అసహనం. వెంటనే చదువుకోవాలి టైం అంతా వృద్ధా చేస్తుంది. మనం గమనించాలిగాని, ఇలా కాదు అనగానే వెంటనే వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇక్కడ అవగాహన లోపించేది. ఆపాట వినాలని వుంది. ఎలా దృష్టి మరల్చాలి అని చూడాలిగాని విన్నదే ఎన్నిసార్లు వింటావ్ అని ఎందుకు వాళ్ళను చురుక్మనిపించడం. ఇక్కడే వాళ్ళకు (పిల్లలకు) అవగాహన డెవలప్ అయ్యేది. ఇదే వాళ్ళ స్వభావం అయికూర్చుంటుంది. ప్రతిదానికి రియాక్షన్స్ వస్తున్నాయి. మనుషుల్లో ఎందుకు ఈ రియాక్షన్స్ వస్తున్నాయ్? యాక్షన్స్ ఎందుకు రావడం లేదు. ఎందుకు వాళ్ళు ఒరిజినల్గా ఏపని చేయడం లేదు అని అంటే అలా మనల్ని మనం డెవలప్ చేసుకుంటున్నాం. పిల్లలకు అదే నేర్పిస్తున్నాం. మనం చేసే కామెంట్స్తో పిల్లలు అలా డెవలప్ అవుతున్నారు. అందుకనే ఎక్కడ చూసినా స్కూల్లో కూడా రియాక్ట్ అవుతారు. మానసికంగా అలవాటు అయ్యింది. చాలా నరేట్ చేసి ఇప్పటినుండి మీ అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళడం లేదు. ఏమి చేయడం లేదు. ఏమి చెయ్యకుండా వుండటం కోసమా మనం పిల్లలకు చదువులు చెప్పిస్తుంది. మనం జీవిస్తుంది అందుకా? ఏదో ఒకటి చేయడం అనేది సృష్టిలో ఎక్కడ చూసినా సహజంగా చాలా సునాయాసంగా జరిగిపోతుంది. సృష్టి మొత్తం నిరంతరం అలసట లేకుండా.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.