పరుగుల రాణి – నిర్మలాలేవి

ఆరింటిలోపు అలుకు చల్లమని ఎన్ని సార్లు అరవాలి?
అరగంటకు తిరిగి వస్తానని ముప్పావుగంటకు కాని రావు..!
‘అంట్ల’ కు ఇంత ఆలస్యమైతే ఎలాగే?

ఈయమ్మ, ఆయమ్మ, ఇద్దరు పెళ్ళాల సారింట్లో
చిట్టి ముక్కమ్మ, మల్లె చెట్టమ్మ రెండు కుక్కల సారింట్లో అంటావు..
ఇందరిళ్ళు తిరిగాక నాకేం చేస్తావే ..!
నడు… నడు…. ఇల్లు ఊడ్చి తేటగా తుడువు…..
టి.వి వైపు దొంగ చూపులేంటే… నీ బొంద…..!!
బెడ్రూంలోకి అడుగు పెట్టకేం?!! ఏదైన పోతే ఎవర్నడుగనూ ?
సింక్‌… స్టౌ గబగబ జిడ్డు పోయేలా కడుగు… కానీయ్‌… కానీయ్‌….
గంపెడు బోల్లు బండెడు బట్టలు అంటూ
నీ అందానికి ఆ బుంగమూతి కూడానా ?
చాకిరి పుట్టుక ఆ మాత్రం లెక్కటే !
బాత్రూం గట్టిగా రాచికడుగు…
చేతులు పూన బెట్టందే ఒళ్ళు గట్టి పడుతుందా ?
రెక్కాడితే గాని డొక్కాడని దానివి…
సబ్బులు ఆసిడ్‌లు ఎన్నని కొనను !
పనంతా అయ్యాక ఇంటి చుట్టు బండలు కడుగు
వెళ్ళు… వెళ్ళు… వెళ్ళి కడగవే
సోఫాలు, ఫ్రిజ్‌, టిని తలుపులు కిటికీలు వగైరా.
రేపు తుడుద్దువు గాని…
చెవిన పారుతుందా?
ఏమే! ఆకలా? దరిద్రానికే! నిన్నటి వేమీ
మిగల్లేదు .. పనికానీయ్‌! వెళ్ళు.
ఆ ఏమిటా నసుగుడు.
జీతం పెంచాలా?!
ఏమంటున్నావ్‌! అందరూ పెంచారా?
అందరితో నాకేం పనే
ఎప్పుడు చేసే పనేగా జీతం పెంచడం దేనికి?
‘‘…………………..’’
ధరలు పెరిగాయా? నీ ఒక్క దానికేనా? మాకు పెరగలేదూ!
బుగ్గలు లోతుగా నొక్కుకుంటూ
ధరలకేం ఈ రోజు పెరుగుతాయి… రేపు తగ్గుతాయి….
నిన్నటి కూరలకు, పాతచీరెలకు అదనంగా ఏమైనా చేస్తున్నావా?
దూరపు చుట్టం వచ్చాడని, దగ్గరివాడు చచ్చాడని…
జ్వరమనీ, మన్ననీ, మాషానమని ‘‘డుమ్మాలు’’ కొడుతుంటావు
కదా! నీ కష్టం నాకెందుకే! మళ్ళీ నోరెత్తకు…
అమ్మయ్య అరచీ అరచీ నా నోరే పడిపోయేలా వుంది…
తలకు అమృతాంజనం పట్టించు
అలసిపోయానే పిల్లా
వెళ్లేముందు కొన్ని బియ్యం కడిగి
కూరగాయలు తరిగి పెట్టు. రేపటి టిఫిన్‌కు రవ్వ
శుభ్రం చేసుకో… (ఫక్కున నవ్వు)
ముఖం మాడ్చుకోకే అన్నాను గాని
ఫక్కుమని నవ్వమన్నానా!?
రంగురంగుల జారుడ చీరెలు
తలలో మెరుపుల క్లిప్‌, సైడుకు చేమంతి పువ్వు
వాలుజడ, వయ్యారి నడక, చేతిలో సెల్‌ ఫోన్‌
షోకు లెక్కువయ్యాయి..
పేపర్‌ కావాలట, సినిమా బొమ్మలు చూస్తుందట, అవ్వ!
అయ్యగారి కళ్ళలో పడకుండా తలదించుకుని వెళ్ళు
ఊఁ …… (గర్జిస్తూ)
మరుసటిరోజు పరుగుల రాణి పనిలోకి రాలేదు.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.