సిగ్గు పడలేదు నేను… – అనామక

మా ఇంట్లో సహాయం చేసే ఆమె
‘‘ఇన్ని రోజులలో అస్సలు డుమ్మా కొట్టలేదు కదా..
ఇప్పుడు ఓ రోజు రాలేదని జీతం కట్‌ చేసారు.

నాకు సెలవు లేదా అమ్మా!’’
అన్నప్పుడు..
సిగ్గు పడలేదు నేను…
‘‘కొంచెం ఒంట్లో నలతగా ఉందని..
నాకు డాక్టర్‌ ఖర్చులేవీ ఇవ్వరా అమ్మా!’’
అన్నప్పుడు..
సిగ్గు పడలేదు నేను…
‘‘ఈ నెల పండగ ఉంది..
అడ్వాన్స్‌ ఇచ్చి నెల నెలా కట్‌ చేసుకోరా అమ్మా!’’
అన్నప్పుడు..
సిగ్గు పడలేదు నేను…
‘‘మా పిల్లోడికి, అమ్మాయికి స్కూల్‌ ఫీజులకు కొంత సహాయం చేయరా అమ్మా!’’
అన్నప్పుడు..
సిగ్గు పడలేదు నేను…
‘‘వానలెక్కువై గుడిసె లాంటి మా చిన్న ఇంట్లోకి వరద వచ్చి అంతా తెర్లయితే కొంచెం సహాయం చేయరా అమ్మా!’’
అన్నప్పుడు..
సిగ్గు పడలేదు నేను…

‘‘మీకు జీతాలు పెరిగినయ్‌ కదా.. కొంత నాకూ పెంచవచ్చు కదా అమ్మా!’’
అన్నప్పుడు..
సిగ్గు పడలేదు నేను…
‘‘ఇక నేను పని మానేస్తాను. ఇన్నేళ్లు మీ ఇంట్లో పని చేసినందుకు ఎంతో కొంత పెద్ద మొత్తం డబ్బులు ఇవ్వరా అమ్మా!’’
అన్నప్పుడు..
సిగ్గు పడలేదు నేను…
‘‘మీ ఆఫీసులో మీ బాసులు మిమ్మల్నేమీ అననివ్వకుండా సంఘాలుంటాయ్‌ కదా.. మరి నన్ను మీరో, మీ వారో, మీ పిల్లలో ఏమీ అనకుండా మాకూ సంఘముంటుందా అమ్మా!’’
అన్నప్పుడు.. కూడా
సిగ్గు పడలేదు నేను…
ఒక్కసారి మాత్రం
‘‘మీరు నాకు యజమాని అయినా.. మీరు పని చేసే ఆఫీసులో మీకూ ఒక యజమాని ఉంటారు కదా! అంటే.. ఒక రకంగా మీరు కూడా నా లాంటి వారే! నేను కూడా మీ లాంటి దాన్నే!’’
అన్నప్పుడు ఆలోచనలో పడ్డాను.
చివరగా..
సిగ్గు పడుతున్నా ఇప్పుడు!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.