చెట్టు
పచ్చని చెట్లు
ప్రగతికి మెట్లు
చెట్లు లేకపోతే మన భూమంతా నిర్మానుష్యం
వాటిని నరికి మనమంతా చేస్తున్నాం కాలుష్యం
ఎన్నో పక్షులకు నివాసం
అదే మనందరికీ ఆవాసం
ఎన్నో రకాల పుష్పాలు
అవి ఇస్తాయి ఎంతో మంచి సువాసనలు
వానలు పడడానికి దోహదపడతాయి
మనకు అండగా నిలుస్తాయి మండుటెండల నుంచి రక్షిస్తాయి
మనకి ఆశ్రయాన్ని కల్పిస్తాయి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి
మనల్ని బ్రతికిస్తాయి
ఎన్నో జీవులకు నిలయం
మనందరికీ అడవి ఆలయం
ఎన్నో లక్షల ఆకులు
ఎన్నో లక్షల పక్షులు
భూగర్భ జలాలుపెంపొందింపజేస్తాయి
భూసారాన్ని మెరుగుపరుస్తాయి
ప్రాణాలను రక్షించే ఔషధాల్ని తయారుచేస్తాయి
మన భూప్రజలను బ్రతికిస్తున్నాయి చెట్లు లేకపోతే మన భూమి వినాశనం
అందుకే చెట్లను రక్షించడం అవసరం
– వి. ఆశ్రిత, శ్రీ వర్ష, 9 వ తరగతి
