తల్లి కాని తల్లి – నిర్మలాదేవి

ఆమె పాదాల క్రింద నలుగుతుంది.
నరక కూపం.
చిమ్మ చీకట్లు తప్ప
ఋతు స్పర్శ లేని బ్రతుకు
గతికిన పూటే కాల ప్రమాణం

గుట్టక్రింద బండ సొరుగు
బట్ట దడి కట్టిన గుహజీవనం
బడిలేని చిన్నారులు
బతికితే చాలునంటూ
కడుపుతీపి నడుపుతుంది

భుజాలను అందిపుచ్చుకొని
వీపున వ్రేళ్ళాడుతూ…..
నేలను జీరాడుతున్న పెద్ద సంచి
చిన్నారులిద్దరూ ఫోరోసెంట్‌ లైట్‌ క్రింద
ఊయలలో మరొక బిడ్డ
ఎక్కడైనా చెత్త సంస్కృతి
కడుపు చిట్లే కంపు, రోత……..
పెంట కుప్పల్లో పొర్లాడుతూ…..
పాముల పుట్టలు పసికడుతూ
దుర్గంధం నాసికలో బంధిస్తూ
కుళ్ళు అంతా కళ్ళలో కరిగిస్తూ
గరళాన్ని కంఠంలో బిగిస్తూ
కాలుష్య కాల సర్పాన్ని
నడుముకు చుట్టుకుంటుంది .
నిరంతర చలనాలు చేతులు
కలలో కూడా మురికి మరకలే
అయినా, ఆమె యోగనిద్రలోకి జారదు
విశిష్ట కళ్ళలో వెతుకులాట
ఈ పూట గడిచే వస్తువు ఏదైనా దొరుకుతుందేమోనని

వ్యవకారిక వ్యవస్థలో
చెత్తకుప్పలు, పనికిరాని తుక్కు ముక్కలూ అమూల్యధనాలే !
అక్కడా తప్పని పోటీలు……

అట్ట డబ్బాలు ప్లాస్టిక్‌ సామాన్లు
మద్యం సీసాలు ….
ఆశుద్ధాలను వెగటు అసహ్యాలను
కెలుకుతూ వెలుతుంది..
డంప్‌ యార్డ్‌……
స్మశానంలో సగం కాలిన
కళేబరాలను తలపిస్తున్న
ఊరు కుక్కల వేదికలు
పందుల పాన్పులు

స్క్రాప్‌ డీలర్ల కమ్ముతూ
సంచి నిండినా ఇంకా కొంత
ప్రోగుచేయాలనే ఆశ……
రిసైక్లింగ్‌ ఆశ…..
ఒళ్ళంతా నేత్రాలుగా వెతుకులాట
ఏదో బట్ట చుట్టిన బరువైన మూట
కదులుతున్న అనుమానం
అటు ఇటు చూసి
రెప్పపాటున సంచిలో వేసుకుంది.
గప్‌ చిప్‌ గా తావుకు చేరుకుంది.
గుండె చప్పుడును అదుపు చేస్తూ
మూట విప్పింది….
ఆశ్చర్యం.. ఆనందం… సంబ్రమం
ఊహించని… ఉప్పొంగిన మమతానుభూతి.
పసికందు, పసిడి పసికూన ఆడ శిశువు….
హత్తుకుంది గాఢంగా ……
చెత్తతో పాటు ‘పాపను’
పండిన పాపాన్ని కడుగుతుంది.
ఇప్పుడు ఆమెకు నలుగురు పిల్లలు
పేగు బంధం లేని అనాధల
అనిర్వచనీయ అనుబంధం….
ఆ తల్లిని ‘సహస్ర నామాలలో
ఏ పేరున పిలవాలి…?
ఆమె దేహం పంకిలం
ఆమె ప్రకృతి ప్రక్షాళనం …….
ఆమె హృదయం అత్యున్నత మాతృత్వం

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.