రపు ఎప్పుడూ కొత్తగా వుంటుంది.

స్త్రీగా వందేళ్ళ ప్రయాణంలో మనమెక్కడున్నాం? ఆధునిక స్త్రీల ఆలోచనలు, అంతరంగాలు, మనోభావాలు, పోరాటాలు – అనుక్షణం మన వ్యక్తిత్వాలని నిలబెట్టుకుంటూ ఆర్థికస్వేచ్ఛతో ఎలాంటి సాధికారత సాధించగలిగాము! ఇలా ఎన్నో ప్రశ్నలు, అన్నింటికి కాకపోయినా మన దగ్గర చాలావాటికి సమాధానాలున్నాయి. అవి విభిన్నమైన కోణాలనుంచి కావచ్చు, కాని మనం సాధించిన విజయాలు మనల్ని మనకోసం నిలబెడతాయి. ఆర్థికస్వేచ్ఛ కాదు ఆర్థిక ఆలంబన, ఆత్మవిశ్వాసం అంటారు డా|| కె.హెచ్‌. సునీత.
జీవితం మీద ఉన్న నమ్మకంతో ఒంటరిగా సింగిల్‌ పేరెంట్‌గా తాను ఒంటరినని ఎవరికీ తెలియనంతగా జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నానంటారు. తన చదువుమీద ఆయన మీద తనకున్న నమ్మకమే, తన ఒంటరి ప్రయాణానికి నాంది అంటూన్న కె.హెచ్‌. సునీత గారి మాటల్లో మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. నా బాల్యం హాయిగా గడిచింది. నాకు అక్క, అన్న వున్నారు. అమ్మనాన్నగార్లది గుంటూరు. నాన్నగారికి సెక్రటేరియట్‌లో ఉద్యోగం రావడంవల్ల ముందు కర్నూలు, ఆ తరువాత సనత్‌నగర్‌, తరువాత మలక్‌పేట కాలనీలో బి-బ్లాక్స్‌లో ఉండేవాళ్ళం. స్కూలు చదువంతా స్టాండ్లీ గర్ల్స్‌ హైస్కూల్‌, ఇంటర్‌మీడియట్‌ నుండి వనితా మహావిద్యాలయంలో డిగ్రీ దాక, ఆ తరువాత ఎమ్‌ఏ, బిఎల్‌  చేసి తరువాత ఎం.పి.హెచ్‌.ఎల్‌ తరువాత పిహెచ్‌డి చేసారు. 1979లో కస్తూరిబా కాలేజ్‌ ఫర్‌ వుమెన్స్‌లో లైబ్రేరియన్‌గా చేస్తూ,  పార్ట్‌టైమ్‌గా ఆకాశవాణిలో, యువవాణిలో ఎనౌన్సర్‌గా పనిచేసాను.
సింగిల్‌ పేరెంట్‌గా వున్నప్పటికీ నా చదువు, నా ఉద్యోగం ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది. ఎప్పుడు నేను ఒంటరిని అనుకోలేదు. బాబు కోసం ధైర్యంగా ముందడుగు వేసాను. వాడ్ని ఒక మంచి పౌరుడిగా, మంచి విలువలున్న వ్యక్తిగా తీర్చిదిద్దాలనేదే నా ధ్యేయం. ఆ ఆశయ సాధనలో నేను ఎప్పుడూ ఒంటరిదాన్ని అనుకోలేదు. ”అమ్మ నాకో మంచి స్నేహితురాలు, అమ్మే నా సర్వస్వం. ఊహ తెలిసిందగ్గరనుంచి అమ్మే నాకు అన్నీ సంతోషం, దుఃఖం అన్నీ అమ్మతోటే… అమ్మ ధైర్యం, అమ్మ వ్యక్తిత్వం జీవితంలో మంచి విలువలనీ మనిషిగా బ్రతకడానికి దారి చూపిస్తుంది. అంటున్న బాబుని చూసి గర్వపడతాను. అందుకే నేనెప్పుడూ ఒంటరిని అనుకోలేదు.
ముందుగా నేను స్త్రీగా పుట్టినందుకు ఎప్పుడూ గర్వపడతాను. స్త్రీగా పుట్టబట్టే కదా ఈరోజు ఏడాది నిండిన బాబుని ఎత్తుకుని, ధైర్యంగా అతనితో విడిపోయి ఒంటరి జీవితంలో అడుగుపెట్టినప్పుడు ఎప్పుడూ బాధపడలేదు. స్త్రీలో అనంతమైన శక్తి వుందని నమ్ముతాను. ఆ శక్తే ఎప్పటికప్పుడు జీవితంలో ముందుకి నడవడానికి దోహదపడుతుంది.  నాతో స్టూడెంట్సు  చాలా హాయిగా ఫ్రీగా మాట్లాడుతారు. తల్లితండ్రులతో షేర్‌ చేసుకోలేని ఎన్నో విషయాలు నాతో చెప్పుకుంటారు. నాకుతోచిన సలహాలు చెబుతుంటాను. అవి వాళ్ళలో కొద్దిపాటి ఆనందాన్ని, శక్తిని ఇచ్చిన చాలు. నాకు చాలా ఆనందం.
ఎక్కువ ఆటోబయోగ్రఫీలు చదివాను. అవంటే నాకు చాలా ఇష్టం. సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి, వాటిని ఎలా అధిగమించాలో నేర్పుతాయి. చాలా ఇష్టంగా చదివిన ఆటోబయోగ్రఫీలు ఇందిరాగాంధీది, అబ్దుల్‌కలాం గారిది. ఉద్యోగం చెయ్యడం కన్నా హౌస్‌వైఫ్‌గా వుండడం బాగుంటుంది అని ఎప్పుడూ అనుకోలేదు, ఉద్యోగమే కదా నాకు తోడు, ధైర్యం, ఆనందాన్ని ఇచ్చింది. ఒంటరిదాన్ని కాదు అనే భావం ఉద్యోగం వల్లనే కలిగింది. హాయిగా ఆనందంగా ఉద్యోగం చేసుకునేదాన్ని. సింగిల్‌ పేరెంట్‌గా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. ఎంతమంది చుట్టూ వున్నా మనిషి ఎప్పుడూ ఒంటరివాడే. ఈ సూత్రాలతోటే నా ఒంటరితనాన్ని నానుంచి దూరం చేసుకున్నాను. ఒంటరిగా ఉన్నా స్త్రీలకి నేను చెప్పేది ఒక్కటే. ఒంటరితనం శాపం కాదు, మనం దాన్ని మలచుకునే విధానంలో ఉంటుంది. ఎన్ని మంచి పనులు మనకోసం ఎదురుచూస్తున్నాయేమో! మనం వాటికోసం కాలాన్ని వినియోగించుకోవాలంటాను.
రేపు ఎప్పుడూ కొత్తగా వుంటుంది. రేపు అనబడే మరుసటి రోజు మనకేదో అనుభవాన్ని, ఆశయాన్ని తెస్తుందన్న నమ్మకం పెంచుకోవాలి. నిన్నటిరోజు ఎప్పటికి రాదు కాబట్టి రేపు అనేదే ఒక శక్తి. దీన్ని నేను చాలా నమ్ముతాను. నా జీవితంలో మరుసటిరోజుకి ఎంతో విలువనిస్తాను. జీవితం అంటే ఓడిపోవడానికి కాదు గెలుపు తలుపులు తెరచి చూడడానికే, స్త్రీ అంటే కన్నీళ్ళు కారుస్తూ బేలగా వాకిట్లో నిలబడే అమ్మాయి కాదు. ఎన్ని ఏళ్ళు ప్రయాణం చేస్తున్నా ప్రతి ఏడాది మనం సాధించుకునే విజయాలు, మన పట్టుదలలు, మనల్ని నిలబెడుతూనే వున్నాయి. సింగిల్‌ పేరెంట్‌ అయినా కుటుంబంలో నలుగురి మధ్యలో వున్నా అన్నింటినీ సాధించుకుంటేనే మనకు తృప్తి. డా|| కె.హెచ్‌. సునీత మాటలైనా ఇవి మన అందరి మాటలు.
ఇంటర్వ్యూ :రేణుక అయోల

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.