సీత
పభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను బిఏ, బియిడ్ చేశాను. నాకు ఒక పాప, బాబు వున్నారు. పాప డాక్టర్ చదువుతుంది. బాబు 10 వ తరగతి చదువుతున్నాడు. ఇద్దరం ప్రభుత్వ ఉద్యోగమే చేస్తున్నాం. నా బాల్యం చిన్న చిన్న గిల్లి కజ్జాలతో సాదాసీదాగా గడిచింది. ముగ్గురు అక్కాచెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ముల మధ్య మధ్యతరగతి కుటుంబాల్లా గడిచింది. మా నాన్న మాకుతనకున్నంతలో అందరికీ ఆడ, మగ తేడా లేకుండా పెంచి చదివించాడు. మేము చదివిన చదువులకు కష్టపడి అందరం మంచి ఉద్యోగాలలో స్ధిరపడిపోయాం. మా అత్తయ్య, మామయ్య మాతో కలిసివుంటారు.నేను ప్రొద్దున లేచిన దగ్గరనుంచి వంట చేసి పిల్లల్ని స్కూల్‌కు పంపి నేను టిఫిన్‌లు సర్దుకుని బయలుదేరడంతో ప్రొద్దున ఘట్టం సమాప్తం. తిరిగి సాయంత్రం మళ్ళీ వంటపని, ఇంటి పనితోనే సరిపోతుంది. ఒక్కొక్కసారి అన్పిస్తుంది ఇదేనా జీవితం. పిల్లలకు చదువుచెప్పడం కూడా నా బాధ్యత. ఎందుకంటే టీచర్‌గా పనిచేస్తున్నావు ఆ మాత్రం చెప్పలేవా? అంటుంటారు. తాను మాత్రం టివిలో వార్తలు చూడడం, క్రికెట్ వస్తే క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఎపుడైనా నేను పిల్లలకు చదువుచెపుతాను. నీవు కాసేపు రెస్ట్ తీసుకో అంటే బాగుండు అనిపిస్తుంది.అలా భ్రమలోనే కాలం గడిచిపోతుంది.
పిల్లలు క్లాస్‌లో మంచి మార్కులు తెచ్చుకోకపోయినా ఆడవాళ్ళ తప్పేనా? నోరు జారి ఏమైనా అంటే చదువుకున్న భార్యను చేసుకుని ఏం లాభం అని పెద్ద కామెంట్. నా దృష్టిలో పిల్లలకు ఎంత ఐ.క్యూ వుంటే అంత చదువుతారని నేను అంటే దానికి వ్యతిరేకం నా భర్త. ఇన్ని పనులను చేసుకుంటూ ఇంటిని, ఇంటిలోని సభ్యులను చూసుకుంటూ స్కూలులో విద్యార్ధులకు పాఠాలను చెప్పాలి. అక్కడ పై అధికారుల పెత్తనం. రిజల్ట్ టార్గెట్ వుంటుంది. స్కూల్లో అసహనాన్ని ఇంట్లో చూపించకూడదు. ఇంట్లో మళ్ళీ నవ్వుతూ అందరితో బాగా మాట్లాడాలి. ఇన్ని ఒత్తిళ్ళ మధ్య ఒక్కోక్క సారి ఉద్యోగం మానేసి ఇంట్లో వుంటే బాగుండును అన్పిస్తుంది. ఉద్యోగం చెయ్యడం వలన ఆర్ధిక స్వేచ్ఛ లభిస్తుంది. కాని ఒత్తిళ్ళల మధ్య చెయ్యడం కూడా చాలా కష్టమనిపిస్తుంది. ఇంట్లో బాధ్యతలను తలా కొంత పంచుకొని ప్రేమానురాగాలు చూపిస్తే చాలు ప్రశాంతమైన మనస్సుతో ఇంట్లోగాని, బయటగాని నెగ్గుకొని రాగల్గుతోంది. మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నారు గాని దానితో సమానంగా హింస కూడా పెరిగిపోతోంది. దీనికి కారణం కొంత మీడియా కూడా దోహదం చేస్తుంది అనిపిస్తుంది. అత్తకోడళ్ళు కోట్లాటలు, హింసించడంలో రకాలు ఇలా చెప్పుకుంటూ పోతే హింస లో రకాలు చాలానే వున్నాయి. వీటిని నిర్మూలిండానికి మహిళలు తిరగబడాలి. మళ్ళీ స్త్రీల ఉద్యమాలు రావాలి. అప్పుడయినా హింస తగ్గుతుందేమో అనేది నా ఆశ. ఇంటర్వ్యూ : ప్రవీణ
-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Meta
Tags
నాకు కూడా సేమ్మీలాంటి ప్రాబ్లెంసు ఉన్నాయి. ఇన్కా అనుమానము అడిషనలుగా. ఈ మధ్యనే భూమిక చదివాకా ఇంట్లో తిరగబడ్డాను. చూడాలి రిజల్టు ఎలా వుంటుందో