లిడియా శాఖో గురించి ఆలోచించండి

– ఓల్గా

లిడియా శాఖో మెక్సికన్ రచయిత్రి, జర్నలిష్టు, ఫెమినిస్టు కార్యకర్త. తను నివసించే క్యాంకున్ పట్టణంలో కుటుంబహింసకు, ఇతర అత్యాచారాలకూ గురైన స్త్రీలకు ఆశ్రయమిచ్చే సంస్థను నడుపుతోంది. ఆమె యిప్పుడు న్యాయ విచారణలో, నాలుగేళ్ళ జైలు శిక్ష పడుతుందనే స్థితిలో వుంది. కారణం ఆమె చిన్న పిల్లలను లైంగిక వ్యాపారానికీ, వ్యభిచారానికి వాడే ఒక ముఠా కార్యక్రమాలను వెల్లడి చేసే పుస్తకం రాసింది. ఆ పుస్తకం పేరు “ది డెవిల్స్ ఆఫ్ ఈడెన్”. ఆ పుస్తకాన్ని లిడియా జీన్ సుక్కర్ కురీ అనే స్థానిక హోటల్ యజమాని లైంగిక కోర్కెలు తీర్చుకోవటానికి బలవంతం చేయబడ్డ పిల్లల ఇంటర్వ్యూల ఆధారంగా రాసింది. ఆ హోటల్ యజమాని ఆ తర్వాత మెక్సికో నుంచి అమెరికాకు పారిపోయాడు. అతని స్నేహితుడు, అక్రమ వ్యాపారాల నిర్వాహకుడు అయిన కమెల్ నసిఫ్ లిడియా మీద పరువునష్టం దావా వేశాడు. మెక్సికోలో అది క్రిమినల్ నేరం.

ముందుగా ఎలాంటి నోటీసు గానీ వారెంట్ గానీ లేకుండా 2005 డిసెంబర్ 16న లిడియాను తుపాకి ఎక్కుపెట్టి బెదిరించి అరెస్టుచేసి ఆమె ఊరినుంచి 20 గంటల ప్రయాణ దూరంలో ఉన్న ప్యూబ్లా రాష్ట్రానికి తీసికెళ్ళారు. అది కమెల్ నసిఫ్ అధికార కేంద్రం. మార్గమధ్యంలో అనేకసార్లు ఆమెను రేప్ చేస్తామని బెదిరించారు. 24 గంటలు జైలులో వుంచాక 9,900 డాలర్ల బెయిలుతో ఆమె బైటికి వచ్చి న్యాయ విచారణను ఎదుర్కొంటోంది. మెక్సికన్ చట్టం ప్రకారం ఆమె చెప్పిందంతా నిజమైనప్పటికీ ఆమె జైలుకు వెళ్ళక తప్పదు.

ఫిబ్రవరి నెల మధ్యలో “ల జొర్నాడా” అనే మెక్సికన్ దిన పత్రికకు కమెల్ నసిఫ్, ఆ రాష్ట్ర గవర్నర్ మారియో మారిన్ యితర రాజకీయ నాయకులకు చేసిన 12 ఫోన్కాల్స్ రికార్డు చేసిన టేపులు అందాయి. ఆ టేపుల సారాంశం లిడియాను అరెస్టు చేసి జైల్లో రేప్ చెయ్యాలనే. ఇదొక పెద్ద స్కాండల్ అయింది. అనేక బెదిరింపులను ఎదుర్కొంటున్న లిడియా ప్రస్తుతం 24 గంటలూ ఫెడరల్ పోలీసు రక్షణలోనే గడుపుతోంది. ఆమె పెట్టుకున్న లాయర్లిద్దరూ వాళ్ళను చంపేస్తామనే బెదిరింపులతో వెనక్కు వెళ్ళారు. ఆమెకు ప్రస్తుతం పని చేస్తున్న న్యాయవాదులు మెక్సికో నుంచి రావాలి. లిడియా కూడా అనేకమంది ప్రభుత్వ అధికారుల మీదా, గవర్నర్ మీదా కేసులు పెట్టింది. ఐనప్పటికీ ఆమె ఏమంటుందంటే-

“నా దేశంలోని ప్రజలలో చాలామంది అవినీతికి, శిక్షలేకుండా తప్పించుకునే పద్ధతులకూ అలవాటు పడ్డారు. నా కేసు గురించి అనేక నెలలు ప్రజలు ఆగ్రహం వెలిబుచ్చారు. నిరసన తెలిపారు. కానీ ఏమీ జరగలేదు. న్యాయం దొరకలేదు. చివరికిపుడు జర్నలిష్టులు కూడా “ ఇలాంటివి మామూలే- మెక్సికోలో యిలాగే జరుగుతుంది. శిక్ష పడని మరో కేసు. ఎన్ని కేసులు చూడలేదు. ఈ రాజకీయ నాయకులు సీరియస్గా పట్టించుకోవాలంటే రాజకీయ ఒత్తిడి అన్నా వుండాలి లేకపోతే అంతర్జాతీయ మీడియాలో నన్నా ఒత్తిడి పెరగాలి. స్త్రీల మానవ హక్కులను హరించే రాజకీయ అవినీతి మీద ఒత్తిడి తీసుకురాకపోతే మనమేం చెయ్యలేం”.

లిడియా శాఖో కేసు వ్యాపారానికి, నేరానికి ప్రభుత్వ అవినీతికి మధ్యనున్న సంబంధాన్ని చూపిస్తుంది. అలాగే మెక్సికన్, అమెరికా ఆర్థిక సంబంధాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన పద్ధతిని చూపు తుంది. ప్రధాన నేరస్తుడు సుక్కర్ కురీ ఒక వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తాడు. ఆ కేంద్రం 5 నుంచి 18 సంవత్సరాల వయసుగల ఆడపిల్లలను, మగపిల్లలను ఎరవేసి పట్టుకుంటుంది. క్యాంకన్ పట్టణ శివార్లలో గల మురికి వాడలలో బీద పిల్లలకు తిండి పెడతామనీ, ఆశ్రయమిచ్చి చదువు చెప్పిస్తామనీ మోసపుచ్చి వారిని చేజిక్కించుకుంటుంది. సుక్కర్కు ఆహారంగా ఉపయోగపడ్డాక వారిని యితర కస్టమర్లకు పంపుతారు. వారిలో అమెరికన్ టూరిస్టులు వుంటారు. ఆ పిల్లలతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటూ వాటిని ఫోటోలు తీసి, వీడియోలు తీసి అమెరికాలో అమ్ముతారు. 2003 లో కురీ బాధితులు అనేక మంది అతను చేసే ఘోరాలు చెప్పినపుడు అతను అమెరికా పారిపోయాడు. అరిజోనాలో అతన్ని అరెస్టు చేశారు. లిడియా పుస్తకం ప్రచురించాక 2006 లో అతన్ని క్యాంకన్ తీసుకొచ్చి విచారణ జరుపుతున్నారు.

ఐతే కమేల్ నసీఫ్ కురీకి స్నేహితుడు, రక్షకుడు. కురీ కోర్టు ఖర్చులన్నీ నసీఫ్ భరిస్తున్నాడు. నసీఫ్ కంపెనీ “ టార్రెంట్ అప్పారెల్ గ్రూపు” (టిఎజి) ముఖ్య కార్యాలయం లాస్ ఏంజిల్స్లో వుంది. అక్కడ కార్మిక చట్టాలన్నీ ఉల్లంఘించబడతాయి. యూనియన్ని లెక్కచెయ్యరు. నసిఫ్కి లాస్ వేగాస్లోని నేరగాళ్ళతో, నార్కోటిక్ వ్యాపారంలో, ఆయుధాల వ్యాపారంలో పాత్ర, సంబంధాలు ఉన్నాయి.

ఎలాంటి నేరం చేసైనా శిక్ష పడకుండా తప్పించుకునే మెక్సికన్ సంస్కృతి మీద లిడియా కేసు మంచి ప్రభావాన్ని చూపింది. ఈమె కేసువల్ల ఒక ఫెడరల్ చట్టం రూపొందింది. జర్నలిష్టుల మీద వచ్చే పరువునష్టం దావాలను క్రిమినల్ చట్టంనుంచి మినహాయించాలనే చట్టం వచ్చింది. ఈ చట్టం లేకపోతే జర్నలిష్టుల నోరుమూయించి నిజాలను బైటికి రాకుండా చేయటం తేలిక. అదే ఇన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఐతే ఇప్పుడు వచ్చిన చట్టం మెక్సికో పట్టణానికి మాత్రమే పరిమితమైంది. ఇంకా 32 రాష్ట్రాల్లోని స్థానిక కాంగ్రెస్లు దీనిని ఆమోదించాలి. లిడియా కేసు ఈ విధంగా మెక్సికన్ మానవహక్కుల చట్టంలో మైలురాయి అవుతుంది.

లిడియా మాటల్లో చెప్పాలంటే,
“మానవహక్కుల ఉల్లంఘన కేసును, మరీ ముఖ్యంగా స్త్రీల మానవహక్కుల కేసును విచారించటానికి సుప్రింకోర్టు అంగీకరించటం యిది మొదటిసారి. మెక్సికో చరిత్రలో మెక్సికన్ కోర్టు సాధారణ పౌరుల మీద రాజ్యహింసను గురించిన కేసులు మూడే ఉన్నాయి. మొదటిది 1968, 71 సంవత్సరాలలో జరిగిన విద్యార్థుల మూకుమ్మడి హత్యల గురించి. ఐతే దాని గురించి ఏ తీర్పూ లేదు. రెండవది పాన్ (మితవాద పార్టీ) పార్టీ సభ్యులను ముగ్గురిని హత్యచేసిన కేసుని పది సంవత్సరాల క్రితం విచారణకు తీసుకుంది. విచారణలో హత్య చెయ్యమని ఆదేశించిన వారెవరూ దొరకలేదు. ఇక నా కేసులో నేరం నిరూపించటానికి టేపులున్నాయి. గవర్నర్ మారిన్, ఇంకా అనేక మంది కోటీశ్వరులు ఈ నేరంలో భాగస్తులుగా ఉన్నారు. మెక్సికోలో గవర్నర్కు వ్యతిరేకంగా, డిస్ట్రిక్ట్ అటార్నీకి, జడ్జీకి వ్యతిరేకంగా వారిమీద అవినీతి, అత్యాచారాల నేరాన్ని ఆరోపిస్తూ కేసు పెట్టిన మొదటి స్త్రీని నేనే”.

లిడియా కేసు ప్రపంచీకరణకు, అవినీతికి, సెక్స్ ట్రాఫికింగ్కూ, సెన్సార్షిప్కు, స్త్రీల మానవ హక్కులకూ ఉన్న లింకులను చూపిస్తుంది. ఈ విషయాన్ని జర్నలిష్టులు, రచయితలు చర్చించి తమ నిరసనను తెలియజెయ్యాలని విమెన్స్ వరల్డ్ కోరుతోంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.