పి.సత్యవతి
భారతీయుల ప్రవాసం ప్రారంభమై చాలాకాలమైంది. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యాధిపత్యం కిందకి రాగానే వారు ఆక్రమించిన అనేకానేక దేశాల్లోకి భారతదేశం నించీ అనేకమందిని రిదీఖిలిదీశితిజీలిఖి జిబిలీళితిజీ కింద తరలించారు. ముఖ్యంగా ఫిజి, మలేషిియా, శ్రీలంక, కరీబియన్ దేశాలకు వీళ్లు ఒక పరిమితకాల ఒప్పందంపై వెళ్లినా చాలామంది తిరిగి రాలేక అక్కడే స్థిరపడిపోయారు. తరువాత బ్రిటిష్ హయాం లోనే బారిష్టర్, లా వంటి చదువులకు భారతదేశం నించీ ఇంగ్లండ్ వెళ్ళారు. స్వాతంత్య్రానంతరం కూడా ఉన్నత విద్య కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళారు. 1950, 60లలో ఇంజినీర్లుగా డాక్టర్లుగా అమెరికా, ఇంగ్లండ్ వెళ్లారు. దుబాయ్, ఇరాన్ కూడా వెళ్ళారు. 1990ల తరువాత వచ్చిన సాప్ట్¦్ట వేర్ బూమ్‌తో వలసలు వరదే అయ్యాయి. విద్యార్థులు అప్పుడూ ఇప్పుడూ వెడుతూనే వున్నారు. ఇక మన దేశం నించీ కార్పెంటర్లు, ప్లంబర్లు, తాపీ పని వారు మధ్యప్రాచ్యానికి వెడుతున్నారు. వీరేకాక నైపుణ్యాలతో పని లేని చిల్లర ఉద్యోగాలకి కూడా వెడుతున్నారు.. పుట్టిన దేశం నించీ మరో దేశానికి వెళ్ళి ఆ మెట్టిన దేశంలో వీళ్ళంతా ఎలా జీవించారు? జీవిస్తున్నారు? వాళ్ల ఆవేదనలు, ఆనందాలు సంవేదనలు, మాతృదేశంపై మమకారాలు చిత్రించిన సాహిత్యం చాలా వచ్చింది. కరీబియన్‌లో స్థిరపడ్డ వారి జీవితాలను గురించి వి.ఎస్. నైపాల్.,, అమెరికా జీవితానుభవాల గురించి భారతీ ముఖర్జీ వంటివారు. ఇప్పుడు చిత్రా బెనర్జీ, ఝంపా లహరి ఇంకా చాలామంది వ్రాస్తున్నారు. అట్లాగే చైనా, జపాన్, శ్రీలంక, ఐర్లండ్, నైజీరియా, ఇరాన్, పాకిస్తాన్ వంటి దేశాలనుంచీ అమెరికా వచ్చి స్థిరపడ్డ వారు వ్రాసిన సాహిత్యం కూడా ఇంగ్లీష్ అనువాదాల్లో చాలా వచ్చింది.. తెలుగు సాహిత్యం ఇటీవల వస్తూంది. తెలుగు వలసలు కూడా అధికమయ్యాయి. ఉద్యోగాలకి, చదువులకే కాక ఉద్యోగాలు చేసే అమ్మాయిలకి ”పురుళ్ళు” పొయ్యడానికి, పిల్లల్ని పెంచిపెట్టడానికి వెళ్ళే తల్లులు, వాళ్ళతోపాటు తండ్రులు, ఇండియా వేసవి తాపం తప్పించుకోడానికి వెళ్ళే తల్లిదండ్రులు ఇట్లా అమెరికా వెళ్ళే విమానాలు ఆంధ్రులతో కిక్కిరిసి పోతున్నాయి.
అమెరికాలో వుండటం అంటే వగిళితి ళీతిరీశి లీలి ళిదీలి ళిజీ శినీలి ళిశినీలిజీవ అని కాక వ| గీబిదీశి శిళి లీలి లీళిశినీవ అని హాన్ సూయన్‌లా చెప్పగలిగి, పుట్టింటి అనుబంధాన్ని పదిలంగా కాపాడుకుంటూనే అమెరికా జీవితంలో ఒదిగిపోయిన తెలుగు వారి జీవితాలను ఆవిష్కరించిన ఒక మంచి కథాసంకలనం ఇటీవల వచ్చింది. ”తుపాకి” అనే కథ ద్వారా పాఠకుల మనసులో నిలిచిన నారాయణ స్వామి వ్రాసిన 21 కథలు ఇందులో వున్నాయి. ఇండియాలో వుండే వాళ్ళకి అమెరికా జీవితం పట్ల అనేక ”మిత్స్” వుంటాయి. అక్కడే వుంటూ ఆదేశానికి అలవాటు పడుతూనే తమ సంస్కృతులను కాపాడుకుంటున్న ఇండియన్ అమెరికన్స్ వ్రాసిన సాహిత్యం అటు అమెరికన్ జీవితాన్నీ ఇటు ప్రవాస హృదయాన్నీ ప్రతిబింబింబించి నిజాన్ని కళ్ళముందుంచుతుంది. ”రంగుటద్దాల కిటికీ” ఆ పని జయప్రదంగా నెరవేర్చింది.
పిల్లల్ని శారీరకంగా పెంచడం ఎంత ముఖ్యమో వాళ్ల చైతన్యాన్ని, ఆలోచనా శక్తినీ పెరగనివ్వడానికి కృషి చెయ్యడం అంతకన్న ముఖ్యం అని అర్థం చేయించే రెండు కథలు ఈ సంపుటిలో ముందు వరసనుంటాయి. అవి, ”తుపాకి” ”చక్కని చుక్క”… ఆలోచనలు చిగురువేస్తున్న అతి పిన్న వయసులో, తల్లితండ్రులు, స్నేహితులు, పాఠశాలలో ఉపాధ్యయులు, చదివే పుస్తకాలు. టీవీ అన్నీ మనసులో చెరగని ముద్రలు వేస్తాయి. తెల్లకాగితం వంటి చిన్నారి మనసులలో అవి అహేతుక ద్వేషాలను ప్రవేశపెట్టడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. బయటి ప్రభావాలను ఆపగల శక్తి ఒక తల్లితండ్రులకే వుంటుంది. పిల్లలకి విలువల గురించి అర్థం అయ్యేలా చెప్పడం, అమెరికాలో వుంటున్న గన్‌కల్చర్ నించీ పిల్లల్ని కాపాడుకుని వాళ్లల్లో సహృదయతనీ స్నేహస్వభావాన్నీ పెంపొందించాలంటే తల్లితండ్రులే శ్రద్ధ పెట్టాలి. ఇండియాలో దళిత విద్యార్థులపై జరిగే వికృతమైన రాగింగు కూడా అలాంటిదే. తమ అవకాశాలను వాళ్లు ఎగదన్నుకు పోతున్నారని ఉక్రోష పడ్డం లాగే ఈ కథలో ఒక పిల్లవాడు తమ అవకాశాలన్నీ నల్లవాళ్లు ఎగరేసుకుపోతున్నారని తండ్రిద్వారా విని స్కూల్లో సహ విద్యార్థి మీద కాల్పులు జరుపుతాడు. అట్లా కాక మరొక తండ్రి నల్లవాళ్ళు మన సాటి మనుషులేనని చెప్పి స్నేహాన్ని ప్రోదిచేస్తాడు. చక్కని చుక్క అనే కథలో అమ్మాయి తన వయసుని మించిన తెలివికలది. ఆ విషయం ఆ పిల్ల తల్లి తండ్రులకే కాక ఆపిల్లకు కూడా బాగా తెలిసి తనొక సెలెబ్రిటీ ననుకుంటుంది. తన తోటిపిల్లలో తన వయసుకు తగ్గట్లుగా కాక తనని మెచ్చుకునే వాళ్ళతో తనని తీజిబిశిశిలిజీ చేసే వాళ్ళతో ఎక్కువ చనువుగా వుంటుంది. తమ పిల్ల ఆటాపాటా అందం చందం తెలివీ మార్కులూ గ్రేడ్లూ, అందరి మెప్పూ మాత్రమే పట్టించుకుని ఆమెను గారంగా చూసుకునే తల్లితండ్రులు, ఆ పిల్ల సెలెబ్రిటీ కాంప్లెక్స్‌తో ఏ దారిన నడుస్తోందో పట్టించుకోరు. చిన్నతనంలోనే పిల్లలు అద్భుతమైన కళాభినివేశాన్నో మరొక నైపుణ్యాన్నో ప్రదర్శించి మన్ననలందుకున్నప్పుడు సంతోషమే కానీ అదే జీవితం కాదనీ ఏ వయసుకు తగ్గ ఆలోచనలు ఎదుగుదలా ఆ వయసుకుండాలని తెలుసుకోరు. ఆ పిల్ల చురుకుతనాన్నీ చొరవనీ అమాయకత్వాన్నీ ఎక్స్‌ప్లాయిట్ చేసిన ఒక వివాహిత యువకుడు చివరికి ఆ పదహారేళ్ల పిల్లనూ బ్లాక్ మెయిల్ చేసి పెళ్ళిచేసుకోవాలని చూసినప్పుడు ఒట్టి మూర్ఖుల్లా ప్రవర్తించబోతారు. అమెరికాలో స్థిరపడినా మళ్ళీ పాతకాలపు భారతీయ తల్లితండ్రుల్లాగే అతనికే ఇచ్చి పెళ్లి చెయ్యాలని చేస్తారు… మొదటి నించీ ఆ పిల్ల ప్రవర్తనను పరిశీలిస్తూ వచ్చిన సుచరిత ఆమెకు అండగా నిలిచి పదహారేళ్లయినా నిండని ఆ చక్కని చుక్క ఇంకా చదువుకోవాలని మంచి భవిష్యత్తుని వెతుక్కోవాలని తెలియ చెప్తుంది.. ఇవాళ మనం చూస్తున్న రియాలీటీ షోల్లో పిల్లల తల్లితండ్రులు ఈ కథ చదివితే ఎంత బాగుండునో అనిపించింది.
అట్లాగే ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంత వారలైనా మనువు బిడ్డలే అనే కథ ”ఇండియన్ వేల్యూస్”. అమెరికాలో వున్నా ఎక్కడవున్నా, అమ్మాయి చదువూ తెలివీ కాదు, అందంచందం కూడా కాదు ఆమె కన్యాత్వమే ముఖ్యం అనుకునే యువకులని ఈ కాలపు అమ్మాయిలు ”నువ్వు కూడా వర్జిన్ వేనా?” అని తప్పకుండా అడిగి మరీ సారీ చెప్తారు కదా? అయితే ఇట్లాంటి మూస తల్లితండ్రులు కాక విలక్షణమైన ఒక తల్లి ”నీవేనా నన్ను పిలచినది” అనే కథలోనూ ఒక తండ్రి ”వీరి గాడి వలస” అనే కథలోనూ కనిపిస్తారు. .. ఇంకా ఇలాంటి మంచి కథలు, చక్కని ప్రేమకథలు, ఈ పుస్తకంలో వున్నాయి. ”రంగుటద్దాల కిటికీ” అనే ఈ కథా గుచ్ఛం అని పుస్తకాల దుకాణాల్లో దొరుకుతుంది. మంచికథలు వ్రాసే ఈ నారాయణ స్వామి కబుర్లు కూడా వినాలంటే కొత్తపాళీ అనే బ్లాగు చూడొచ్చు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
మీ చదివి వ్రాసిన సమ్మరి చాలా బాగుంది. బాగా వివరచించారు! దురద్రుష్తవసాత్తూ ఈ పస్థకాలు నాకు అందుబాతులొ లెవు.
దక్షిణాఫ్రికా ను మరచిపోయిట్టున్నారు?.
పరిమిత కాల ఒప్పందం ముగిసిన తర్వాత తిరిగి రాలేక!
అక్కడే ఉండిపోయారు.. అనడం సరికాదు.
ఒప్పందం ముగిసిన తర్వాత అక్కడే శాశ్వత నివాసం ఏర్పర్చుకునే అవకాశం ఉండేది..!!