జ్యోతి వలబోజు
ఈ మధ్య బ్లాగు అనేమాట తరచూ వినబడుతోంది. అందునా తెలుగు బ్లాగులు, (ఇంటర్‌నెట్) అంతర్జాలంలో తెలుగు గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది. అసలు బ్లాగు అంటే ఏమిటి? అది మనకు ఎలా ఉపయోగపడుతుంది? తెలుసుకుందాం… మనసులోని భావాలని, ఆలోచనలను పంచుకొని, వాటిపై చర్చించడానికి అనువైన ఓ చక్కని వేదిక బ్లాగు. ప్రతి ఇంటికి ఒక ఇంజనీరు తయారవుతున్న ఈ రోజుల్లో, కంప్యూటర్ వాడకం ఒక నిత్యావసరం ఐంది. కంప్యూటర్లో అచ్చ తెలుగులో చాల సులభంగా రాసుకోవచ్చు అని చాలా మందికి అవగతమైంది. ఆ క్రమంలో మొదలైన తెలుగు బ్లాగులు ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి కూడా. మహిళలు కూడా బ్లాగులలో తమకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. కథలు, కవితలు, పుస్తక సమీక్షలు, సినిమాలు, పాటలు, వంటలు, రాజకీయాలు, స్వగతాలు, విశ్లేషణలు, అప్పుడప్పుడు ముఖాముఖీలు, చలోక్తులు… ఇలా ఒక్కటేమిటి ఆవకాయ నుండి అన్నమయ్య పదాల వరకు, ముంబై దాడుల నుండి సమాజ సేవ వరకు మహిళలు రాయని అంశం లేదు. బ్లాగు రాయడానికి భాషాప్రావీణ్యం అవసరం లేదు. మన ఆలోచనలను మనకు వచ్చిన (నచ్చిన)ట్టుగా రాయొచ్చు.
ఎవరైనా బ్లాగు రాసేది తమ ఆలోచనలు, జ్ఞాపకాలు, అభిరుచులు, సంఘటనలపై స్పందనలు రాసి ఇతరులతో పంచుకోవడానికి. నిత్య జీవితంలో జరిగే విశేషాలు, ఎదురయ్యే సంఘటనలు, సందర్భాలకు కొంత పాలు హాస్యం, అప్పుడప్పుడు వ్యంగ్యం జతచేసి సరదాగా అందరికీ నచ్చేలా చెప్తుంటారు. అది ఒక గంభీరమైన చర్చలా కాకుండా మన ఆలోచనలను పంచుకోవడమే ముఖ్య ఉద్దేశ్యం అన్నట్టుగా ఉంటాయి… మహిళా బ్లాగర్లలో ఒక వయసు వారు అని కాకుండా స్కూలు పిల్లల నుండి బామ్మల వరకు అందరూ అలవోకగా బ్లాగులు రాస్తున్నారు. ఇందులో విద్యార్థినులు, సాంకేతిక నిపుణులు, ఉద్యోగినులు, గృహిణులు, రచయిత్రులు, స్త్రీవాదులు, తల పండినవారు ఎందరో ఉన్నారు. తమ వృత్తితో పాటు బ్లాగింగును ఒక ప్రవృత్తిగా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. రెండు వేలకుపైగా ఉన్న తెలుగు బ్లాగుల్లో సుమారు వంద మాత్రమే ఉన్న మహిళా బ్లాగులు రాసిలో వాసిలో మిన్నగా ఉన్నాయి. అందరిని అలరిస్తూ ఉన్నాయి. ఎన్నో ఎన్నెన్నో మహిళా బ్లాగులు బ్లాగ్లోకంలో తమదైన ప్రత్యేకతని చాటుతున్నాయి. సాహిత్యపు పరిమళాలు వెదజల్లుతున్నాయి.
ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న కొందరు మహిళలు ఊరికే బ్లాగులు రాయడం వరకే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాంగణం ఏర్పాటు చేసుకున్నారు. అదే ప్రమదావనం అనే గూగుల్ గుంపు. ఎక్కడెక్కడి మహిళా బ్లాగర్లు అప్పుడప్పుడు సరదాగా కలిసి కబుర్లు చెప్పుకోవటానికి, సాంకేతికమైన సలహాలకి, సందేహాల నివృత్తికి, ఇంకా సభ్యులకి ఏవైనా సలహాలు కాని సంప్రదింపులు కాని అవసరమైతే సహాయ పడటానికి ఏర్పడ్డ ఓ వేదిక. ఈ గుంపుకి అనుబంధంగా ఒక ప్రత్యేకమైన చాట్ రూం కూడా తయారు చేసుకున్నారు. అప్పుడప్పుడు వివిధ ప్రదేశాలలో ఉన్న మహిళా బ్లాగర్లందరూ తమ ఇంటినుండే ఒకే సమయంలో కలుసుకుని కబుర్లు, ముఖ్య విషయాలపై చర్చలు జరుపుతుంటారు.
ఈ ప్రమదావనం సభ్యులు బ్లాగులు రాసుకోవడం, కబుర్లాడుకోవడం వరకే కాక సమాజానికి తమవంతు చిన్ని సాయమైన చేయాలనే కోరికతో సహాయ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సహాయ కార్యక్రమాలు ఒకటి రెండు సార్లు కాకుండా క్రమం తప్పకుండా నిర్వహించాలనే దృఢసంకల్పంతో ఉన్న ప్రమదావనం సభ్యులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల కోసం అందరూ స్వచ్ఛందంగా ధనసేకరణ చేస్తున్నారు. ఒకరికొకరు ముఖపరిచయం లేకున్నా కూడా ఎవరికి వీలైతే వారు ఈ బాధ్యతని నెత్తికెత్తుకుని విజయవంతంగా పూర్తిచేస్తున్నారు. మరికొందరికి స్ఫూర్తినిస్తున్నారు.
ప్రమదావనం సహాయ కార్యక్రమాల వివరాలు…
మొదటి కార్యక్రమం..అంకురం
రెండవ కార్యక్రమం.. యామిని
మూడవ కార్యక్రమం…ఆత్మీయ స్పర్శ
నాలుగవ కార్యక్రమం…నన్ను బ్రతికించండి…
ఐదవ కార్యక్రమం…వరద బాధితులకు ఐదువేలు విరాళాలు సేకరించి పంపడమైంది…
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
మంచి పని.
–రాము