ఆనర్‌ కిల్లింగ్సు అమానవీయాలే

జూపాక సుభద్ర
‘పరువు హత్యలు’ (ఆనర్‌కిల్లింగ్సు) అనేవి తరాలనుంచి ప్రధానంగా స్త్రీలందరి మీద, దళిత మగవాల్లమీద వారి కుటుంబాల మీద జరుగుతున్నవి. అయితే యీ మధ్య చర్చ చేస్తున్న ‘ ఆనర్‌ కిల్లింగ్సు’ స్వంత వంశంలోని స్త్రీ, పురుషులు ప్రేమించుకున్నా పెళ్ళి చేసుకున్నా వారిని కుల పంచాయితీల్లోకి యీడ్చి ఏకంగా మరణ దండన విధిస్తున్నారు. యివి మా వంశ గౌరవానికి సంబంధించిన వ్యవహారం. చట్టాలు కోర్టులు తలదూర్చొద్దు అని హెచ్చరికలు. యివి రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నయంటున్నారు.కాని మీడియా దృష్టికి రానివి ఎన్నో దేశమంతా వున్నయి. యీ పరువు హత్యలు దుర్మార్గమైనవి, దురాచారమైనవి. మనిషిని చంపే హక్కు ఎవరికీ లేదు అని చివరికి కోర్టులక్కూడా లేదనే మానవ హక్కుల ఉద్యమాలు ఘోషిస్తున్నయి. యిప్పటికైనా ‘పరువు హత్యల’ మీద చర్చనడవడం మంచిదే.
చట్టంలో స్వంత వంశంలో, గోత్రంలో ప్రేమించుకుంటే ఫలానా శిక్ష అనేమీ లేదు. అందుకే కుల పంచాయితీలే తీర్పులు తమ కులం, కుటుంబం పురుషస్వామ్యం ఆధిపత్యాలు, అణచివేతలే కాక చంపే పరువు హత్యలు ‘కుల పంచాయితీలు’ నిర్ణయించేవే కాకుండా చాలా సిస్టమ్స్‌ యీ హత్యల్ని సమర్ధిస్తున్నయి వేనకేసుకొస్తున్నయి. మంచిదికాదు తీసెయ్‌, కులంగా నోడిని యిష్టపడ్తుంది. వాడితో సహా చంపెయ్‌ యీ హత్యల మీద పోలీసులకు, కుటుంబానికి కులానికి, సమాజానికి అందరికీ ఆమోదమే వుంటది.
ఆధిపత్య కుల పంచాయతీల్లో మరణ దండన దళిత కుల పంచాయితీల్లో వుండది. మందలించి వదిలేస్తారే గాని చంపే తీర్పులు శిక్షలు వేయరు. అయితే చర్చలు ఒక్క కుల పంచాయితీల్లో స్వంత వంశంవాల్లు చేస్కుంటున్న వివాహితులకు మరణ దండన మీదనే చర్చ కాకుండా కులంకానోడిని ప్రేమించిందని పెళ్లి చేస్కుందని అతన్ని అతని కుటుంబాన్ని కూడా చంపుతుండడం మీద కూడా చర్చ జరగాలి. యీ మరణ దండనలు విధించేవాల్లు ఆధిపత్య కులాలు యింకా పితృస్వామ్యం పరువు పేరుతో హత్యలు చేస్తుంది దళితుల్ని, స్త్రీలని. యివి అనేక రూపాల్లో విస్తరించివున్నయి. భార్య ఎవరినో చూసిందని, మాట్లాడిందని, ప్రియురాలు యింకెవరికో సైటు కొడ్తుందని చంపుతున్నరు. అంతెందుకు ఆ మధ్య సమీరని చార్మినార్‌ నుంచి తోసి చంపిన వాడు ‘ఆమెకు వేరే సంబంధా లున్నయి అందుకే ఆవేశంతో తోసిసిన’ అని చెప్పి కేసును సానుభూతిగా మల్చుకున్నడు. సిస్టమంతా స్త్రీవ్యతిరేక, కిందికులాల వ్యతిరేకంతో కూడుకున్నది. కులం, కుటుంబం, రాజకీయ పార్టీలు పంచాయితీలు, పురుషాధిపత్యం, కోర్టులు చట్టాలు అన్ని పరువు హత్యల్లో జరిగేవేే. అన్నింటికన్నా విషాదమేంటంటే కోర్టులు కూడా ‘పరువు హత్య’లకు బాసటగా వుండడం. మధుర, బన్వారీదేవి కేసుల విషయంలో కోర్టులు తమ ఆధిపత్య కుల పితృస్వామ్యాన్నే ప్రదర్శించినయి. యిప్పుడు సుష్మా తివారి కేసులో కూడా పచ్చి కుల తీర్చు నిచ్చింది. యింతకి సుష్మ తివారి చేసిన నేరమేంటంటే ఆమె బ్రాహ్మణ్‌ అయి వుండి ఒక కులంగాని దళితున్ని ప్రేమించి పెళ్ళిచేసుకోవడమే. ఢిల్లీలో చదుకునేప్పుడు పరిచయమైన కేరళ దళితుడిని యిష్టపడింది సుష్మ తివారి. కుటుంబం బెదిరింపులకు తట్టుకోలేక కేరళ వచ్చేసిండ్రు. కాని ఆమె అన్న వెంటాడి ఆ దళిత అబ్బాయిని అతడి కుటుంబాన్ని అందరిని చంపేసిండు. ఆ టైంలో ఆమె లేకపోవడంవల్ల బతికిపోయింది. పెళ్ళి చేస్కుంది అబ్బాయి కదా. అబ్బాయివరకే చంపడం ఆగలేదు. మొత్తం కుటుంబాన్నే హత్య చేయడం, వాల్లని కూడా టార్గెట్‌ చేయడం ఎంత ఉన్మాదం.
అయితే సుష్మ తివారి బొంబాయి కోర్టుకెళ్ళితే ఉరి శిక్ష విధించింది హంతకుడికి. కాని న్యాయానికి అత్యుత్తమ కోర్టు అని చెప్పుకునే కోర్టు సుప్రీంకోర్టు. అట్లాంటి న్యాయస్థానం రాజ్యాంగంలో తలదించుకునే తీర్చిచ్చింది. ” ఇది తప్పే అయితే భారతీయ సామాజిక పరిస్థితుల నేపధ్యంలో చూసినపుడు అందరూ తప్పుగా భావించే పనిని యింట్లో వాల్లు చేస్తే మందలించే బాధ్యతలో భాగంగా ఈ పొరపాటు జరిగింది. అందువల్ల యిది క్షమించాల్సిన చిన్న తప్పు కాదు ఉరితీయాల్సిన పెద్ద తప్పుకాదు ” ఇలాంటి అప్రజాస్వామిక, అన్యాయయైన, అమానవీయమైన తీర్పులిచ్చే కోర్టుల సామాజిక వ్యవస్థలో వున్నాం. ఇది భారత రాజ్యాంగాన్ని గౌరవించని తీర్పు. సామాజిక పరిస్థితుల్ని నేపధ్యంగా చూపడం అంటే కుల వ్యవస్థకు మద్దతు పలకడమే కదా! రాజ్యాంగం చెప్పిన సమన్యాయం, మనుషులంతా ఒకటే, హక్కులు అందరికీ సమానమనే సమ సమాజ భావనని సుప్రీంకోర్టు తీర్పు ప్రశ్నార్ధం చేసింది. అపహాస్యం చేసింది. కుల వ్యవస్థ మానవత్వాన్ని ఆగం జేస్తుంది మసిజేస్తుంది. దీన్ని సిస్టమ్‌లో వుండే అన్ని శక్తులు కూల్చాల్సిందే. మనిషి పట్ల మనిషి కుండే యిష్టాల్ని ప్రాణాల్దీస్తే కుల కారణాల్ని చంపేయాల్సిందేనని సుష్మా తివారి వాదిస్తుంది. తన స్వంత సోదరుడే అయినా మరణశిక్ష విధించాల్సిందేనని ఆమె పోరాడ్తుంది. మీడియా, మహిళాసంఘాలు యావత్‌ సమాజం సుష్మా తివారి పోరాటానికి మద్దతు నివ్వాల్సిన అవసరముంది. ఆనర్‌ కిల్లింగ్సు ఏ రూపంలో జరిగిన మహిళా సంగాలు, దళిత బహుజన సంగాలు, ఎన్‌జివోలు తీవ్రంగా వ్యతిరేకించి వాటి నిర్మూలనకు పోరాడాల్సిందే. సుప్రీంకోర్టు అమానవీయ తీర్పుల్ని ఖండించాల్సిందే.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.