నిన్న రాత్రి నేనో కల కన్నాను

కొండవీటి సత్యవతి
ఆహా ఏమి ఆ కల, ఎంత అద్భుతమైన కల
నువ్వూ నేనూ పక్క పక్కనే నడుస్తున్నాం
చేతిలో చెయ్యేసి భుజం భుజం కలిపి
ఆకుపచ్చటి పచ్చికబయళ్ళ మీద
నేనొక అడుగు ముందుకెయ్యలేదు
నువ్వొక అడుగు వెనక్కెయ్యలేదు
సమానంగా అడుగుల లయలో
ఏకబిగిన నడుస్తున్నాం
ఏవేవో అడ్డంకులు
ఎవరెవరివో ఆర్తనాదాలు
సూట్కేసుల్లోంచి బట్టల్ని కుమ్మరించినట్టు
ఆడపిల్లల శవాల దృశ్యాలు
హాయిగా ఆడుకునే పసిపిల్లల మీద
మగమృగాల దాడులు
చదువుకునే చోట చీడపురుగుల చీదర
ఇంటిబయట ఎంతటి అభద్రతో
ఇంటి నాలుగ్గోడల మధ్య అంతే అభద్రత
నువ్వూ నేనూ చేతిలో చెయ్యేసి నడుస్తున్నాం
మన మధ్య ఇటీవలి కాలంలో ఇంత సయోధ్య ఎలా కుదిరిందో
ఇంత ప్రజాస్వామిక వాతావరణం ఎలా సంభవించిందో
మన మాటల్లోనే దొర్లుతోంది
హింసలేని జీవితమంటే
ఇంటా బయటా ప్రజాస్వామిక సంబంధాలుండాలంటే
అన్నింటా సమానత్వం నెలకొల్పాలంటే
అది నువ్వూ నేనూ కలిసి సాధించాల్సిందే
నన్నొదిలేసి నువ్వెళ్ళిపోయినా
నిన్నొదిలేసి నేనెళ్ళిపోయినా
మనం ఒంటరి దీవులమే అవుతాం
ఎవరికివారౌ స్వార్థపరులమే అవుతాం
మనం పక్క పక్కనే నడుస్తూ
ఎన్ని కలలు కంటున్నాం
ఎన్ని కొత్త ఆలోచనలు చేస్తున్నాం
అన్నింటా సమానత్వం అని నేనంటుంటే
నువ్వు ‘సె’ౖ అనడం
అబ్బో నీ మీద నాకెంత ప్రేమని
నువ్వింత మారాక నాతో సై అన్నాక
‘అంతా జాంతా నై’ అనేచోట
నువ్వింత ప్రజాస్వామికంగా మారి
పురుషస్వామ్యం పడగ మీద కొట్టాకా
నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించాలన్పిస్తోంది.
ఇంటిలో, పొలంలో, ఫ్యాక్టరీలో
ఒక్కటేమిటి స్థిర చర వనరుల్లో
సగభాగమివ్వడమే
అన్ని రకాల హింసలకు చెల్లుచీటి
అని నువ్వంటుంటే
నిన్ను వాటేసుకుని ముద్దుపెట్టుకోవాలన్పిస్తోంది
నీ మాటే నా మాటా
పద పోదాం దండోరా వెయ్యడానికి
నువ్వు నేను కలిసి సంపాదించిన అన్నింటిలోను
అన్ని వనరుల్లో సమాన వాటా
అన్ని రిజిస్ట్రేషన్లలో అన్ని లావాదేవీల్లోనూ
మనిద్దరి పేర్లూ ఉండాల్సిందే
ఇదే మన కొత్త నినాదం
ఇదే మన సరికొత్త ఎజెండా.
అంతర్మథనం – స్వకీయావిష్కరణ
డా|| డి. ఇందిరా కృష్ణమూర్తి


తమస్సనే హిమఖండాన్ని
స్ఫటిక ఖడ్గంతో కోసి
క్రాంతి సూత్రంతో బయటపడతావు
అంతస్తమోకుహరం నుండి
ఏదో ఒకనాడు!! ఏదో ఒకనాడు!!
నిన్ను నీవే ఆవిష్కరించుకుంటావు
అప్పుడు – అప్పుడు
నిన్ను నీవే తెలుసుకుంటావు.
నిన్ను వెతుక్కుంటూ నేనే వస్తాను,
ఏదో ఒకనాడు…
తల్లిగా – చెల్లిగా
భార్యగా – బిడ్డగా
ఒక సంపూర్ణ స్త్రీమూర్తిగా
నిన్ను నీవు ఆవిష్కరించుకున్నావు.
ఒక్క నిన్ను నీవుగా తప్ప.
నీకు ఆకాంక్షలే గాని కాంక్షలు లేవు
రుచులు లేవు అభిరుచులు లేవు.
వృత్తిలేదు ప్రవృత్తి లేదు.
నీకు గతం, వ్యక్తిగతం
స్వగతం మరియు భవితం
అన్నీ ఉన్నా తెలుసుకోవాలని లేదు!!
విధిపైన విశ్వాసహఠంవేసి
బాధ్యతల బట్టీలో సతివయి
నిష్కామ నిర్విరామ సాధనలో
శాంతిలేదు విశ్రాంతి లేదు
ఆయాసమున్నా అలుపులేదు.
ఆడపిల్లని తెలిసి ప్రేగుబంధం త్రెంచుకున్నావు
కడపుకోత|?… గుండెకోత!
ఎపుడు లేస్తావో?! ఏం తింటావో?!
గుడ్లనీరు గ్రుక్కుకొని త్రాగుతావు.
కడుపు చెఱువు కాళ్లవాపు.
రక్తహీనత అయినా మళ్లీ సిద్ధం
అయిష్టంగా ఆచరిస్తావు. ఎన్నో?!
గృహహింసను మౌనంగా భరిస్తావు
ఆనాడు…
కాలేజీ ఫస్టు – ఆటల్లో బెస్టు
కళల కాణాచివి, చదువులతల్లివి.
అద్దంలో చూసుకో ఆలోచించుకో.
ఇంటి మాలక్ష్మివి – దీపానివి.
నీలో దీపం వెలిగించుకో.
నిన్ను నీవుగ ఆవిష్కరించుకో.
నిన్ను నీవు తెలుసుకో.
జీవన సుడిగుండాలు
ఆర్‌. నాగమణి

”జీవితం చూస్తుండగానే అలా గడచిపోతుంది,
ఎన్ని బంధాలో, ఇంకెన్ని అనుబంధాలో,
ఎన్ని అవమానాలు, ఎందరి పరిహాసపు మాటలు,
ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలు,
అందరూ మిత్రులే కానీ కొందరే ఆప్తులు,
ఎన్నో నవ్వులు అందులో సంతోషంగా నవ్వేవి ఎన్ని పెదవులో,
అందరికీ మనసుంటుంది కానీ కపటం లేని
మనసు మాత్రం కొందరికే సొంతం,
ఎన్నో యేళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి,
ఎందరో మనుషుల జీవితాలు మంచులా కరిగిపోయాయి,
వారిలో మానవత్వమున్న మహనీయులు మాత్రమే
సజీవులై యున్నారు జనుల హృదయాలలో,
అవసరానికి ప్రేమ చూపించేవారే గానీ, ఆప్యాయతతో
చేరదీసే వారే నేడు కరువయ్యారు. నేస్తమా!
అందరిలోనూ తప్పుల్నే చూస్తున్నారు తప్ప, తనలోనే
చెడు అనే మహావృక్షం పెకళించలేనంతగా
నాటుకుపోయిందని తెలుసుకోలేకపోతున్నాడు.
ధనం చూసి బంధుత్వాలు,
అందచందాలను చూసి అనవసర స్నేహాలు, చేస్తూ
నిజమైన స్నేహపు గుర్తులను నాశనం చేస్తున్నాడు.
ఎడారికన్నా, ఘోరారణ్యముకన్నా మానవారణ్యమే భయమనిపిస్తుంది.
ఎండమావిలోనైనా నీరు త్రాగవచ్చుననిపిస్తుంది,
మంచు పర్వతాలపైనా నిప్పు రగిలించగలమనిపిస్తుంది ప్రయత్నిస్తే,
కానీ మనుషుల మనసులలో మానవత్వపు జ్యోతిని
వెలిగించలేమనిపిస్తోంది.
ఏది ఏమైనా
అవసరం కోసం కాకుండా ఆప్యాయత కోసం కలిసే మనుషుల్ని,
బాధలన్నిటిని మరిపించే చక్కని చిరునవ్వుని చూడాలని నా ఆశ,
నా చిన్ని మనసు యొక్క అభిలాష.
స్వార్థంతో జీవన సుడిగుండాలలో కొట్టుకుపోకుండా,
జీవితమనే సంద్రంలో, ఆనందమనే నావపై,
అందరూ కలిసి ప్రయాణం చేయాలి.”

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో