– సుజాతా చౌదరి
ఎవరన్నారు
సీతకి
అద్దం చాలా అవసరమని?
అద్దం లేకుండా
ఆమె బతకలేదని?
పొద్దుగూకులూ
అద్దంముందు కూర్చుని
ఆనందిస్తూ వుంటుందని?
అలా అనుకునే కాబోలు
అద్దం అంతగా విరవ్రీగుతుంది!
కానీ సీత
తనని తాను గుర్తించుకోవటం మొదలుపెట్టాక
అద్దంలో ఆమెకి కనిపించే పత్రిబింబం
అసంపూర్తిగా అనిపిస్తుందనీ
అద్దం పరిధిలో ఇమిడిపోయి
బతకటం ఆమెకి నచ్చదనీ
అద్దానికి తెలీదు!
అద్దానికి వెలుపల
ఆమె తనని తాను కొత్తగా సృష్టించుకొంటుంది.
అప్పుడిక అద్దం నిరర్ధకమౌతుంది
ఆమె జీవితంలో
కానీ ఈ సంగతి అద్దానికి ఎవరు చెపుతారు?
దాని దురహంకారాన్ని ఎవరు పోగొడతారు?
(మూలం : ఒరియా కవిత
అనువాదం: ఆర్. శాంతసుందరి)