– తమ్మెర రాధిక
సంకురుమయ్య దేనిమీదొచ్చాడు?
ఎంతో క్యాజువల్ పశ్న్ర
జవాబూ అంతే.. అలవోక..
ఇప్పుడో?
ఏం కార్లూ, కాళ్ళు గటా లేవా?
దేనిమీదొచ్చాడు అంటారంటారు.
నేడు
గాడిదా-కుక్కా, పిల్లీ సరి జంతు సంపర్కం
పిండి ముగ్గులూ- గొబ్బి ముద్దలూ
చలిపులికి దొరక్కుండా
గరికా-బంతి-పిండి పూలు గుచ్చి
పసుపూ కుంకాలు చల్లిన వాకిట్లో
నాయనమ్మ చదివే
శీర్రామ జననం మేలుకొలుపులు
సావిట్లో పడుకున్న పొరుగూరోళ్ళను
మర్యాద చేసేవి…
ఈ రంగుల కలల్ని కళ్ళకూ మనసుకూ
దూరం చేస్తోంది అవుట్ సోర్సింగ్
కలలు కనే వేళ కాల్ సెంటర్లో
కళ్ళని సైబర్ సునామీలో పోగొట్టుకున్నాం
భోగి మంటలని
రాక్ గార్డెన్‌లో పద్రర్శనలకు పెట్టాం
గంగిరెద్దు దాసు బజార్లో పశ్న్రిస్తున్నాడు
‘అమ్మా రాముడంటే నీకు ఇష్టమేనా?’
సీత అడ్డంగా తల వూపింది
‘నాకు ఎంసెట్టే ముఖ్యం’ రివ్వున
కార్పొరేట్ సెల్యులర్ జైల్లోకి పరిగెత్తింది సిగ్గుపడ్తూ
కొద్దో గొప్పో
గ్లోబలైజేషన్ కాలంలో లోకలైజేషన్
శిల్పారామం పండగ సంబరాలు