– సత్యభాస్కర్
మనలో ఒకరిని
వెలివేసి వెలయాలంటే ఎలా!?
పుట్టుకతో
అందరం శరీరాలమే!
సంఘం సృష్టించిన
చకబ్రంధంలో చిక్కి
శల్యమవుతోన్న శవాలమే!
దారి లేక తెన్ను లేక
నా అనేవారు లేక
ఆకలికి ఆహుతవుతోన్న
శరీరాన్ని కాపాడుకోలేక
ఓడిపోయిన ఆమెను
ఆదరించక,
ఆదుకోకపోగా
రాబందుల్లా వాలిన
మగ పుంగవులు
ఆమెను వెలయాలంటే ఎలా!?
కౄర మృగాలు సైతం
తల దించుకునేలా
కండ కండనూ కామించే
సమాజాన్ని
నాగరిక సమాజమంటే ఎలా!?