– డి. కామేశ్వరి
పూలనించి రంగులడిగి, మనసనే కలం ముంచి రాస్తున్నాననను
నీ జ్ఞాపకాలలో నిద్రించాను, నీ కలలతో మేల్కొన్నానని పేమ్రలేఖలు రాయను
నిన్ను నా పేమ్ర సామాజ్య్రానికి రాణిని చేస్తానని, నీ కోసం తాజ్ మహల్ కట్టిస్తాననను
నీవంటే నాకిష్టం అది నీవు నమ్మితే నా దానివికా అంటాను
ఇల్లాలిగా యింట్లో స్థానం, సహచరిగా గుండెల్లో స్థానం యిస్తాను
మాటల్లోనైనా అందలం ఎక్కించలేని వీడేం పేమ్రికుడనుకోకు
చేసేవి చెప్పరాదు, చేసి చూపాలన్న తత్వం నచ్చితే నాదానివికా!
ఉత్తరంలో కవిత్వానికి, కవిత్వంలో భావానికి అమ్మాయి బోర్లాపడింది.
సుళువుగా గాలానికి తగలని చేపకి మరింత మసాలా దట్టించి వదిలాడని
ఎర అని ఎరగని చేప వలలో చిక్కదా
దీపం వెలుగుకి దరి చేరని భమ్రరం వుంటుందా!
అదే మరి దీప భమ్రర న్యాయం!