”పనిస్థలాలలో లైంగిక వేధింపుల నిరోధక బిల్లు 2010′ మీద రాష్టస్థాయి వర్క్‌షాప్‌

భూమిక
భూమిక ఆధ్వర్యంలో  జనవరి 29 వ తేదీన ”పనిస్థలాలలో లైంగిక వేధింపుల నిరోధక బిల్లు” పై  రాష్ట్రస్థాయి  వర్క్‌షాప్‌ జరిగింది. ఈ వర్క్‌షాప్‌ రెండు సెషన్లుగా జరిగింది.
మొదటి సెషన్‌లో ముజీబ్‌కుమార్‌ అడ్వకేట్‌, ఉమ(ఐ.యన్‌.టి.యు.సి, ఉమెన్స్‌వింగ్‌ ఛైర్‌పర్సన్‌) మంజరి, ఎ.పి. వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ సెక్రటరీగార్లు పాల్గొన్నారు. సభను ప్రారంభిస్తూ భూమిక ఎడిటర్‌ కొండవీటి సత్యవతి 10 సంవత్సరాల క్రితం సంగీత శర్మ, హైకోర్టు ఎడ్వకేట్‌, లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకొన్న సంఘటనను గుర్తుచేస్తూ, ఆమె  ఒక నిముషంపాటు సభలోని వారందరికీ మౌనాన్ని పాటించవలసిందిగా కోరారు. న్యాయవాదిగా పనిచేస్తున్న సంగీతశర్మ ఆత్మహత్య ఆనాడు స్త్రీల ఉద్యమంలో వున్న వారినందరినీ కలచి వేసిందని సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ అనుగుణంగా హైకోర్టులో ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి వుంటే ఆమె ఆత్మహత్యను నివారించివుండే వాళ్ళమని చెప్పారు. 2000 ఈ లైంగిక వేధింపుల అంశంపై రాష్ట్ర స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాల్లో ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండు చేయాలని జరిగింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఎంతో మంది లైంగిక వేధింపులకు గురవుతున్నా చట్టం రాలేదని చెప్పుతూ ఇప్పటికైనా ఈ అంశంపై సమగ్రమైన బిల్లును తయారు చేసి లోక్‌ సభలో ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ బిల్లులో కొన్ని లోపాలున్నాయని దానిపై చర్చించడానికి ఈ రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు సత్యవతి.
డ్రాఫ్ట్‌ బిల్లు గురించి వివరించడానికి విచ్చేసిన ముజిబ్‌కుమార్‌, హైకోర్టు అడ్వకేటు చాలా సమగ్రంగా, వివరంగా ”లైంగిక వేధింపుల నిరోధక బిల్లు , 2010” గురించి  వివరించారు. బిల్లులో వున్న లోపాల గురించి కూడా  విడమర్చి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ బిల్లులో చేర్చని వర్గాల గురించి చెబుతూ ఈ లైంగిక వేధింపుల సమస్యను విద్యార్థులు పరిశోధన చేసే సమయంలో వారి వారి గైడ్‌ల నుండి ఎదుర్కొంటారని వారిని తప్పనిసరిగా ఈ బిల్లుతో  చేర్చాలని” సూచించారు. అలాగే సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ అనే పదాన్ని నిర్వచించినపుడు కుటుంబ హింస  చట్టం నేపధ్యంలో విశ్లేషించాలని లైంగిక వేధింపులనేవి ఆయా వ్యక్తుల ఆత్మగౌరవానికి సంబంధించినవిగా అర్ధం చేసుకోవాలని చెప్పారు.  అలాగే పనిచేసే స్థలాలు ఏమిటి? అనే విషయం గురించి చాలా విపులంగా చట్టంలో పొందుపరిచిన అంశాలు చెప్పారు. అలాగే ఈ బిల్లులో లేని వ్యవసాయరంగంలో పనిచేసే మహిళలను కూడా ఈ చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించారు.
తరువాత  ఉమ మాట్లాడుతూ రైల్వే విభాగంలో పనిచేసే మహిళలు ఎదుర్కునే లైంగిక వేధింపుల గురించి వివరించినపుడు సమావేశంలో వున్న వారందరి ఒళ్ళు గగుర్పొడిచింది. ఒక సంఘటనను వివరిస్తూ మహిళలు పనిచేసే ప్రదేశాలలో బాత్‌రూమ్స్‌లో అశ్లీల చిత్రాలు చిత్రిస్తూ పేర్లను జోడిస్తూ రాయడమే కాకుండా బాటిల్స్‌లో నీళ్ళను తీసేసి యాసిడ్‌ నింపి పెడతారని దీనివలన చాలామంది స్త్రీల జననాంగాలు కాలడం, తీవ్ర అనారోగ్యానికి గురి కావడం జరిగాయని, మగవాళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తించడం చాలా బాధాకరమని చెప్పారు.
అలాగే గ్యాంగ్‌ఉమెన్‌గా పనిచేస్తున్న మహిళలు, నిర్మానుష్య ప్రదేశాలల్లో పనిచేస్తున్న  మహిళలు ఇలాంటి ఎన్నో రకాల లైంగిక వేధింపులకు గురవుతున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయడంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరి కనబరుస్తోంది చెబుతూ ఈ అంశంపై మహిళల్లో చైతన్యం తీసుకు రావడానికి కూడా చాలా కష్టపడ్డానని చెప్పారు. తాను తయారు చేసిన కొన్ని పోస్టర్లను  చూపుతూ వాటిని అంటించడానికి తాను ఎంతో పోరాటం చెయ్యాల్సివచ్చిందని ఇప్పటికైనా దీనిపై సమగ్రమైన చట్టం రావడంపై తనకు చాలా సంతోషంగా వున్నదని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు.
ఆ తరువాత మంజరి మాట్లాడుతూ మీడియాలో స్త్రీలు ఎదుర్కొనే వివక్ష గురించి చెబుతూ ఇక్కడ పని చేసే మహిళలకు ఒక సమయం అంటూ వుండదని రాత్రి వేళల్లో కూడా పనిచెయ్యాల్సి వుంటుందని ఎవరినైనా ఇంటర్వ్యూలాంటివి చెయ్యాల్సినపుడు వేళగాని వేళలో చెయ్యాల్సివుంటుందని, అయితే ఈ పనులన్నీ చేయడానికి కావలసిన సౌకర్యాలు మీడియా హౌస్‌ కల్పించలని చాలా ఆవేశంగా చెప్పారు. కొన్ని మీడియా హౌస్‌దయితే స్త్రీలను ఉద్యోగాలలో తీసుకోవడానికి నిరాకరిస్తూ  దానికి కారణాలుగా వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సి వస్తుంది కాబట్టి ఉద్యోగాల్లో తీసుకోకపోవడమే ఉత్తమం అనే ఆలోచనలోకి వచ్చారు. అసలు లింగ వివక్ష అనేది లైంగిక వేధింపులుగా అర్ధం చేసుకోవాలని అది కూడా వేధింపుల కిందకే వస్తుందని  చెబుతూ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్ట్‌ల నెట్‌వర్క్‌ ఇటీవల ఒక సర్వే నిర్వహించిందని దాని ప్రకారం ఏ స్థాయిలో పనిచేస్తున్న మహిళ అయినా లైంగిక వేధింపుల అతీతురాలు కాదని, దీనికి మంచి ఉదాహరణ రూపన్‌ డియోల్‌ బజాజ్‌ కేసని చెప్పారు. దీర్ఘకాలంగా మీడియాలో పనిచేస్తున్న వ్యక్తిగా మంజరి ఆ రంగంలో పనిచేస్తున్న  మహిళల సాధక బాధకాల గురించి మీడియా హౌస్‌ల వైఖరి గురించి చాలా వివరంగా మాట్లాడారు. దీనితో ఉదయం సెషన్‌ ముగించారు.
భోజనాంతర సెషన్‌లో పి.వో.డబ్య్లు అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ ”స్త్రీలపై హింస తగ్గించే చట్టాలను ప్రభుత్వం చేస్తుందంటే అది స్త్రీల మీద వున్న ప్రేమ కాదని బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సు ప్రభావమేనని” చెప్పారు. బీజింగ్‌లో జరిగిన నాలుగవ ప్రపంచస్థాయి సదస్సు అనంతరం స్త్రీలపై అన్ని రకాల వివక్షతలకు వ్యతిరేకంగా చేసిన ఒప్పందం మీద భారత ప్రభుత్వం సంతకం చేసిందని హింసను తగ్గించే చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చిందని తదనుగుణంగానే గృహహింసనిరోధక చట్టం, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం  ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలియజేశారు. సంగీత శర్మ ఆత్మహత్యల గురించి ప్రస్తావిస్తూ ఆ కేసు విషయమై తామెంతో పోరాటం చేశామని చివరికి హైకోర్టు ప్రాంగణంలో మౌన ప్రదర్శనను చేసి తమ నిరసనను తెలియజేశామని చెప్పారు. అపుడు రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించిన ‘భూమిక’ ప్రస్తుత బిల్లుపై కూడా రాష్ట్రస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం సంతోషదాయకమని చెబుతూ ఈ బిల్లులో వున్న లోపాలను సవరించే విధంగా రికమెండేషన్స్‌ తయారు చేయాలని సూచించారు.
ఆ తరువాత ఎపిఎంఎస్‌ఎస్‌ స్టేట్‌ డైరెక్టర్‌ ప్రశాంతి మొత్తం సమావేశాన్ని సమీక్షిస్తూ తన అనుభవాలను కూడా పంచుకున్నారు. సభికులందరి తరుఫున సమావేశం రూపొందించిన తీర్మానాలను చదివి వినిపించారు.
ు     అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర, సంఘటిత, అసంఘటిత రంగాలల్లోను మహిళలు పనిచేస్తున్న ప్రతిచోట ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేయాలి.
ు    ఆయా కార్యాలయాల్లో ఏర్పర్చిన ఫిర్యాదు కమిటీ సభ్యుల పేర్లు , సెల్‌ నెంబర్లు, ఇమెయిల్‌ లను ఆఫీసు నోటీస్‌ బోర్డులో ప్రదర్శించాలి.
ు     ఫిర్యాదుల కమిటీలో ఎక్కువ శాతం మహిళలే వుండాలి. ప్రతి కమిటీలో ఒక సైక్రియాటిస్ట్‌,సోషల్‌ వర్కర్‌ వుండాలి.
ు    కేసు విచారణకు ఖచ్చితమైన సమయపాలన పాటించాలి.
ు    ఉమెన్‌ కమీషన్‌ లేదా మానవ హక్కుల కమీషన్‌ తీరులో ఫిర్యాదుల హక్కుల కమిటీకి సంబంధించి ఒక నోడల్‌ ఏజేన్సీని ఏర్పాటు చేయాలి.
ు    స్త్రీల అంశాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలను క్రింది స్థాయి నుంచి చేపట్టాలి.
ు    ఈ బిల్లు చట్టరూపం దాల్చగానే విధాన నిర్ణేతలను బాధ్యులను చేయాలి. అన్ని ప్రభుత్వ టెలిఫోన్‌ డైరెక్టరీల కమిటీల వివరాలు ప్రచురించాలి.
ు    మానసికంగాను, శారీరకంగాను, వికలాంగకత్వం కలిగి వేదనలో వున్న మహిళలకోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలి.
ు    పోలీసులకు న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న వారికి క్రమబద్ధంగా జెండర్‌ శిక్షణలో వర్క్‌షాప్‌లు నిర్వహించాలి.
ు    ఈ బిల్లులో సూచిస్తున్నట్లుగా సెటిల్‌మెంట్‌, రాజీలాంటి వాటికి తావు ఇవ్వకూడదు.
ు    ఇళ్ళల్లో పనిచేసే స్త్రీలను కూడా తప్పనిసరిగా ఈ చట్టం కిందకు తీసుకురావాలి.
ు    ప్రభుత్వం నడుపుతున్న హెల్ప్‌లైన్‌ 1091ను బలోపేతం చేయాలి. నిందితులకు ఎలాంటి శిక్షలు వేస్తారనేది చట్టంలో పేర్కొనాలి.
ు    అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర కళాశాలలో లైంగిక వేధింపుల చట్టంపై పెద్ద ఎత్తున అవగాహనను కల్పించాలి. అన్నింటిని మించి స్త్రీల అంశాలను మానవ హక్కులు మానవ సంబంధాలు లాంటి  ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా పాఠ్యాంశాలుగా చేర్చాలి. నిందితులకు ఎలాంటి శిక్షలు వేస్తారనేది చట్టంలో పేర్కొనాలి.
ు    అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర కళాశాలలో లైంగిక వేధింపుల చట్టంపై పెద్ద ఎత్తున అవగాహనను కల్పించాలి.
ు     అన్నింటిని మించి స్త్రీల అంశాలను మానవ హక్కులు మానవ సంబంధాలాంటి ముఖ్యమైన అంశాలను తప్పనిసరిగా పాఠ్యాంశాలుగా చేర్చాలి.
ఈ సందర్భంగా మరొక సంతోషకరమైన వార్తని భూమిక పాఠకులతో పంచుకుంటున్నాం. లైంగిక వేధింపుల నిరోధక బిల్లుకు సంబంధించి భవిష్యత్‌లో చట్టరూపం దాల్చాక ఏర్పాటు కాబోయే ఫిర్యాదుల కమిటీల విషయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించే విధంగా ‘భూమిక’ రాష్ట్రస్థాయిలో ఏర్పడిన కమిటీకి నాయకత్వం వహించాలని సదస్సు తీర్మానించింది.
ఈ మొత్తం తీర్మానాలను యునైటైడ్‌ నేషన్‌ ఆధ్వర్యంలో నడిచే జెండర్‌ కమ్యూనిటీ నెట్‌వర్క్‌లో చేర్చడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో జరిగిన సమావేశాల తీర్మానాల సారాంశాన్ని లైంగిక వేధింపుల చట్టం మీద పార్లమెంటరీ కమిటీకి జెండర్‌ కమ్యూనిటీ ద్వారా నివేదించడం జరిగింది. చట్టంలో అదనంగా చేర్చాల్సిన అంశాల గురించి ఒక స్పష్టతతో చర్చించిన సదస్సు తీర్మానాలు ఎవరికి చేరాలో వారికి చేరడంద్వారా ఈ రాష్ట్ర స్థాయి సమావేశం విజయవంతంగా ముగిసింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.