ఎ. నాగరాజు, బి. హరిబాబు, యం. మురళి
”ఆకాశమంత సగం నీవు, సగం నేను” ఒక ఆధునిక కవి స్త్రీ పట్ల తనకు గల ఆత్మీయమైన గౌరవాభి మానాలను వ్యక్త ంచేస్తూ అలాకీర్తించాడు.
మానవజాతి మనుగడ స్త్రీ పురుషుల సహకారం వల్ల, భాగస్వామ్యాలవల్ల అన్యోన్యత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అనాది కాలంలో పురుషుడు సంపాదించే వాడుగాను, స్త్రీ ఆ సంపాదనతో గృహ నిర్వహణ చేసేదిగానూ ఒక సంప్రదాయంగా వస్తున్నది. గృహవాతావరణాన్ని అనందమయం చేయడంలో స్త్రీ పాత్ర ప్రాధాన్యం వహిస్తున్నది. ఆధునిక కాలంలో వచ్చిన సామాజిక, రాజకీయ ఆర్థిక పరిణామాల వల్ల స్త్రీ పురుషుల గృహజీవిత సంబంధాలలోఅనూహ్య మార్పు వచ్చింది. మహిళా సాధికారతకు అనేకానేక చర్యలు ప్రభత్వము చేపడుతున్నది. ‘భోజ్యేఘమాతా” అని మహాకవి కాళిదాసు మన సమాజంలో స్త్రీకి వున్న సమున్నత స్థానాన్ని ఏనాడో చెప్పాడు. స్త్రీలు అనేక సమస్యలతో సతమవుతున్న కారణంగా మన రాజ్యాంగనిర్ణయం సామాజికంగా, ఆర్థికంగా పురుషులతో సమాన హక్కులున్నాయని చాటి చెపుతుంది. ఇటివలకాలంలో రాజ్యసభతో స్త్రీలకు చట్టసభల్లో మూడవవంతు స్థానాలను కేటాయించాలని బిల్లునికూడ ఆమోదించారు. లోకసభలో ఈ బిల్లును ఆమోదిస్తే పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించినట్లవుతుంది. తరువాత భారత రాష్ట్రపతి సంతకం అయితే ఇది చట్టం అవుతుంది.
”ప్రతి వంటకత్తె ఒక రాజకీయ వేత్త కావాలి”. అన్నారు లెనిన్. భారత స్త్రీ ఆ స్థాయికి వచ్చినవాడు,నిజంగా సామాజిక, వ్యవస్థ మారిపోతుంది. అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, అసమానత్వం, హెచ్చుతగ్గులు అణగారిపోతాయి. కుల, మతాల అభిమానాలు, ఆస్తి అంతస్థుల తేడాలు సమసిపోతాయి. శాంతి సుస్థిరతలు నెలకొంటాయి. స్త్రీలలో చైతన్యం తెచ్చేెందుకు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మార్చి 8న ప్రతి ఏడు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా సభా సంఘాలు, శాఖలు మహిళా సాధికారతకు కీలకచర్యలు, సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంతో మహిళా సాధికారతకు ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకొంటోందో విశ్లేషించవలసిన అవశ్యతక ఎంతైనా వుంది.
ప్రపంచానికి మనదేశం ఆదర్శం :
రాష్ట్ర వ్యాప్తంగా 1.07 కోట్ల మంది మహిళలతో 9.33 లక్షల స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి. గ్రామీణ పేద మహిళల్లో 90 శాతం మంది వీటి ఫలితాలను అనుభవిస్తున్నారు. ఈ అరుదైన రికార్డు గత ఆరేళ్లలో స్వయం సహాయక బృందాలకు రూ|| 23.975 కోట్ల వరకు బ్యాంకు రుణాలు అందాయి. 2010 మరో 9 వేల కోట్ల రుణాలు ఇప్పించాలని ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని మొత్తం ఎస్‌హెచ్‌జి వారి బ్యాంకు డిపాజిట్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి కావటం గమనార్హం.
మహిళలు తమంతటతాము సాధించుకున్న విజయం, దానికి కారణం స్వయంసహాయకసంఘాల మహిళల వ్యాపార, విద్య ఉపాధిరంగాల్లో తమ ఉనికిని కాపాడుకొంటూ స్వయం ప్రతిభతో ముందుకు పయనించడమే.
స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు పావలావడ్డీకి ప్రభుత్వం రుణాలు అందచేస్తోంది. నడ్డి విరిచే వడ్డీలకు స్వస్తి పలికేందుకే రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డి పథకాన్ని 2004-05 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. 8 నుండ 12 శాతం వరకు వడ్డి వసూలు చేస్తున్నాయి. ఇందులో 3 శాతం అంటే పావలా వడ్డిని మాత్రం మహిళలు భరిస్తే చాలు మిగిలిన వడ్డిని ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తోంది. 2004 జూలై నుంచి ఇప్పటి దాకా 25.80 లక్షల గ్రూపులకు పావలా వడ్డి కింద ప్రభుత్వము రూ. 564.35 కోట్లు విడుదల చేసింది. 2010-11 సంవత్సరానికి పావలా వడ్డి కింద రూ. 200 కోట్లు కేటాయించింది.
సాధికార – అధికారం
పావలా వడ్డితో6 రుణాలు నాలుగేళ్ళలో కోటిమందిని లక్షాధికారులుగా చేయడం వంటి పథకాల లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు బాటలు వేస్తోంది. అదే సమయంలో కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వం (యుపిఎ) మహిళల రాజకీయ సాధికారత కోసం చారిత్రాత్మకమైన మహిళా బిలులకు మోక్షం కలిగించింది. భారత ప్రధాని డా|| మన్మోహన్‌సింగ్, యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవ,పట్టుదలతో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఆడుపడచులకు మహిళాదినోత్సవ కానుక ఇది అని అభివర్ణించవచ్చును.
అభయహస్తం
మనరాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డా|| వై.ఎస్.రాజశేఖరరెడ్డి మహిళల కోసం ”ఆభయహస్తం” అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈ పథకాన్ని ”డా|| వై.ఎస్.ఆర్. అభయహస్తంగా” మార్చారు. ఇది ప్రపంచస్థాయి పథకం. ప్రపంచంలో ఎక్కడాలేని పథకం. ఒక్కో మహిళ రోజుకు తన వాటాగా ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు. 60 ఏళ్ళ వయస్సు దాటిన తరువాత వారికి కనీసం రూ|| 500/-ల నుంచి గరిష్టంగా రూ|| 2,200/-ల వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జీవిత భీమా సంస్థతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో ఇప్పటికీ 40 లక్షల మంది మహిళలు చేరారు. స్వయం సహాయ సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఓ ఆసరా ఉన్నదంతా పిల్లల భవిష్యత్‌కు ఖర్చుచేసి ఆ తరువాత వారి నిర్లక్ష్యానికి గురై చివరకు ఒంటరిగా ఏ ఆధారం లేక మిగిలిపోయిన మహిళలు స్వయం సహాయక సంఘాలలో చేరటం ద్వారా వాళ్ళ కాళ్ళమీద వాళ్లు నిలబడగలుగుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇందిరా క్రాంతి పథం సభ్యులు అర్హులు. 2008 జూన్ 1 నాటికి ఒక ఏడాదిపాటు మహిళా సంఘం సభ్యులుగా వుండటంతో పాటు తెల్లరేషన్ కార్డు కలిగి వుండాలి. ఇంతవరకు అభయహస్తం పథకంలో 40 లక్షల మంది స్వయంసహయకమహిళా సభ్యులు చేరారు.
పై విశ్లేషణ బట్టి గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి విశేషకృషి చేస్తోంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags