ఆదివాసీ, దళితముస్లిం బహుజన స్త్రీల కవిత్వాన్ని తెలుగు సాహిత్యంలోకి సంకలనంగా తీసుకు వచ్చే ప్రయత్నంలో భాగంగా ఆదివాసీ, దళిత, ముస్లిం, బహుజన స్త్రీల కవిత్వాన్ని ఆహ్వానిస్తున్నాం.
నేడు అస్తిత్వ ఉద్యమాల సందర్భంగా వస్తున్న సాహిత్యాన్ని సంకలనంగా తీసుకురావాలని భావిస్తున్నాము. ఆదివాసీ దళిత, ముస్లిం, బహుజన స్త్రీల సాహిత్యం బలంగా వస్తున్నా కూడా అది అక్కడక్కడ విడి విడిగా వుండడం జరుగుతుంది. ఆ సాహిత్యమునంతా ఒక చోట కూర్చే ప్రయత్నమే యీ కవితా సంకలానికి ఆహ్వానం.
ఈ స్త్రీలందరూ తమ తమ కవిత్వాన్ని ముద్రితాలు, అముద్రితాలు ఏమున్నా తేదీ. 1-5-07 లోపు ఈ క్రింది అడ్రసులకు పంపించగలరు.
ఈ సంకలనానికి ఆదివాసీ, దళిత, ముస్లిం, బహుజన కులాల స్త్రీలు సంపాదక వర్గంగా వ్యవహరిస్తారు.
సంపాదకులు: జూపాక సుభద్ర, షాజహాన
షాజహాన
10-1-639
చింతల్ బస్తి
ఖైరతాబాద్
హైద్రాబాద్ -4
ఫోన్. 9440322361
జూపాక సుభద్ర
ఇం. నె. 13-6-462/ఎ/27
భగవాన్దాస్ బాగ్
తాళ్లగడ్డ
హైద్రాబాద్ -267
ఫోన్. 9441091305
వర్ణ ద్రోహం
………..
ఔను, నల్లపిల్లనే
చీకటి లో నుంచోగానే ఉనికిని పోగొట్టుకుంటూ
మీ రంగు రంగుల కనుగుడ్లకు ఆనవాలు దొరకని దాన్ని
అమ్మ ప్రేమలో కూడా అసహనం అందుకున్న దాన్ని
ఎంత ముస్తాబు చేసుకున్నా ఊసరవెల్లి కాలేనిదాన్ని
పదే పదే నువు వద్రీచిరించి వదిలిన ఉపమానాల మధ్య
నా చర్మ గీతం ఎంత చేదెక్కి పోయిందో తెలుసా?
మురికు కంట పడగానే నా రంగులో ఉందన్నావు
జబ్బు పడినప్పుడల్లా నా రంగుకు దిగినట్టు దిగులు పడతావు
అందవికారానికి మారు పేరుగా నా రంగును చూపెడతావు
భయానికి భూతానికీ నా రంగును అలుకుతావు
చావులకీ, విషాదాలకి నా రంగును ఎగరేస్తావు
దుష్ట పాత్రలన్నిటికీ నా రంగు పులిమి ప్రదర్శిస్తావు
జీవరాహిత్యమే నా మీద వొలొకబోశావు
క్షణానికేన్ని సార్లు నా చర్మం
నీ తెల్ల ప్రపంచంలొ ముక్కలవుతోందో
వ్యక్తిగత మౌడ్యం నుంచి, జాత్యహంకారం దాకా
విస్తరించిన ద్వేషంలో
ఎన్ని నల్ల రకతపు శ్వాసలు నీ పుణ్య నదుల్లో మైలపడ్డాయో
నీ క్రూర ప్రపంచం పులిమిన వర్ణాల మధ్య
నా వర్ణం వివర్ణ్మైపోయింది
నాద్వేషమే కడుపులో పిడికిళ్ళూ బిగిస్తోంది
కరుణ రసమ జాలువారే ఎవెరరి కళ్ళళో
ఖురాను,బైబిలి చదివే ఎవరి పెదవుల్లో అయినా
ఒక్కడంటే ఒక్కడైనానావ్ర్ణాన్ని గౌరవించే శబ్దం
దొరుకుతుందేమో నని వెతికి వేసారిపోయాను
మీ సంస్కౄతిలో సాహిత్యం లో ,చరిత్ర లో
ఒక్క అందాల రాసి అయినా నా రంగులో పుడుతుందని
ఎదురుచూశాను
ఆధునిక పరిశోధనల సారం కూడా
అన్ని వర్ణాలు తెలుపులొ వున్నాయనే కదా తేల్చింది
ఇక తోచీతోచని తమాషా కోసమొ ,వైవిధ్యం కొసమో
ఎండలో కూచుని వొళ్ళంతా టట్టూ తేల్చుకుని
నా రంగును ఆత్మ గౌరవాన్ని
పరాచిక ప్రదర్శన చెయ్యనక్కర్లేదు
“తెల్ల తోలు తెచ్చి ఏడాది ఉతికినా పొడల మచ్చలే కాని నలుపు రాదు”
చక్షువులు ముఖ చర్మానికే వున్న నల్ల తల్లిని
చర్మానికి జరిగిన ద్రోహం చూపుదాటి పోదు
———————— కొండేపూడి నిర్మల
చర్మానికి వర్ణ సౌందర్యం లేకపోతే లేకపోయింది… చర్మ వ్యాధి లేదు కదా… సంతోషించకూడదా?
నిర్మల గారికి
మీకునేను రెండు దశాబ్దాలుగా అభిమానిని,
మీ నడిచేగాయాల్ని కొన్ని పదుల సార్లు చదివి ఉంటాను,
మీ కవితల్లో ఆర్ధ్ర త వెల్లువెత్తుతుంది.
తారసపడినప్పుడల్లా మీ కవితను వదిలిపెట్టను.
మీ కవిత ఎప్పుడొ చదివిన నీలిక కవితను స్ఫురింపచేసింది. (నేను పొరపడుతున్నానేమో).
నాకు తెలిసిన ఒక డాక్టరు విదేశాలనుంచి ఎందుకు తిరిగొచ్చేసావంటే my skin defies me అని అన్నాడు . ఆ మాట లోతు ఇప్పుడుఅర్ధం అవుతుంది.
చక్కటి కవిత. ఇంకొంచెం , కన్వింసింగు గా, లోతుగా ఉంటే బాగుండుననిపించింది.
పైన కామెంటు చేసిన వాని మనో గతాన్ని నేను అర్ధంచేసుకోగలిగాను.
ఎప్పటికీ మీ వీరాభిమాని
బొల్లోజు బాబా
వీలైతే నాబ్లాగుపై కామెంటు చెయ్యండి.
http://sahitheeyanam.blogspot.com/
బైబిలు లో ద్రాక్షతోటలకు కాపలా కాసిన స్త్రీ ఒకరు దేవునితో ఇలాగే మాట్లాడుతుంది.కానీ భగవంతుని
ద్రుష్టిలో ఆమే అతి సౌందర్యవతి.చాలా బాగా రాసారు నిర్మల గారూ.