– దోర్నాదుల సుబ్బమ్మ
ప్రవాహమై దొర్లుతూ ఉంది
ఒక్కో జ్ఞాపకం ఒక్కోచోట
ఒకే గాయం… ఒకే హృదయం
గాయాలు అనేక మయినా లేపనం ఒకటే అయినట్లు
మనసు మాతం ఒంటరిదే…
పాటలూ లేవూ… పల్లవుల ఆత్మఘోషాలేదు
పువ్వులూ లేవు… పూల సుగంధాలు అంతకంటే లేవు
ముడుచుకున్న అస్థిత్వం ముందు
నిలువెత్తు నల్ల దుప్పటి కప్పుకున్న ఆత్మ
ర్యాంకుల పట్టాల్ని దాటుతున్నప్పుడు
రవిక వెనుక దాగిన గుండెశబ్దం గుర్తెంచేదెవరు?
పేగు బంధానికి పొంగిపోవడమే చేతనైంది
పెంచిన మమకారపు శబ్దచలనం మాట్లాడగల్గిందెప్పుడు
ఏదీ చేతగాని ఏకాంతంలో
నన్ను నేను వెతుక్కోవటం కోసం
నాకు నేను దగ్ధమైపోవటం తప్పించి
ఏదీ చేతకాని అచేతనం
పుష్పించడానికి ఇది పువ్వుకాదుగదా
అప్పుడూ… ఎప్పుడూ… ఇప్పుడూ…
ఇది పాలిచ్చే స్ధన్యమే
దేహ శిఖరం మీదకెక్కి
వెక్కిరిస్తున్న ఆత్మవైపు చూడలేని గుడ్డితనం
కన్నీళ్ళు ఇంకిపోతున్న కళ్ళసరస్సుల్లో
కనికరం లేని కదలికల వేదనే
భావాలు తెలియని బత్రుకుల్ని
భయం గుప్పెట్లో బిగించి పట్టుకున్నాక…
బతకడం చావటంతో సమానమే కదా…
ఇప్పుడు ఏకాంతం అనిర్వచనీయమైన డిపెష్రన్
పేమ్రించడం అంటే పెదవుల భాషకాదు
పదాలు సముదాయమూ కాదు…
ఆత్మని కప్పేసిన నల్లదుప్పటిని తొలగించే ధైర్యం.