జె.సుభద్ర
ఎందుకో ఈ సారి టిఆర్‌ఎస్ పార్టీకి, తెలంగాణ ఆధిపత్య కులాల పెద్దలకు హఠాత్తుగా అంబేద్కర్ బాగా యాదొచ్చి నట్టుంది. తెలంగాణకు నాయకత్వాన్ని నెరుపుతున్న ఆధిపత్య కులాల పెద్ద మనుషులు ఓ వైపు, కింది కులాల నాయకత్వాన్ని నెరుపుతున్న ఆధిపత్య కులాల పెద్ద మనుషులు ఓ వైపు, కింది కులాల నాయకత్వాన్ని అణచివేస్తూ యింకోవైపు అంబేద్కర్ చెప్పిన చిన్న రాష్ట్రాల మీటింగ్‌లు బెట్టుకున్నారు. టిఆర్‌ఎస్ నేత ఏకంగా అంబేద్కర్ జన్మదినంనాడు అంబేద్కర్ సిద్దాంతానికి విరుద్ధంగా చండీయాగమే మొదలు బెట్టిండు.
ఉద్యమం యింత ఉదృతంగా జరుగుతున్న యీ సందర్భంలో అంబేద్కర్ జయంతినాడు చండీయాగం తలపెట్టడం తెలంగాణ దళిత బహుజన ఆదివాసీ, మైనారిటీలంతా వ్యతిరేకిస్తున్నరు. కాని ఆ యాగాన్ని నిలువరించలేకపోయారు. మాటల మంటలు కురిపించారు. తెలంగాణ దళిత నాయకులు, సెక్యులరిస్టులు కాని మనువాద శక్తులికి అడ్డుకట్టవేయలేకపోయారు.
తెలంగాణది యజ్ఞయాగాదుల సంస్కృతి కాదు. శ్రమ సంస్కృతి. ప్రకృతికి దగ్గరగా వుండే సంస్కృతి. ఇక్కడ దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీలే మెజారిటీగా వున్నారు. యిక్కడి సంస్కృతి యీ కులాల సంస్కృతినే పునాదిగా వున్నది. ఏవో ఒకటిరెండు జిల్లాల్లో తప్పితే తెలంగాణ గ్రామాల్లో గుడి వ్యవస్థ కనిపించదు. (యిది కెసిఆర్‌కి తెలవనట్టుంది) గ్రామాల్లో ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ లాంటి గ్రామదేవతలున్నా వారికి వేపచెట్లుగా, మర్రిచెట్టుగా, చెరువుకట్టగా, పొలిమేర గద్దెలుగానే వుంటాయి తప్ప గుడులు గోపురాలుండవు. ఎప్పుడో యేడాదికోసారి కోడి పిల్ల, కొబ్బరికాయ, బోనందప్ప, నిత్య ధూపదీప నైవేద్యాలుండవు. యిది హిందూ మత వ్యవస్థకు అంటగట్టలేం.
కాని సీమాంధ గ్రామాల్లో కులానికో గుడి వుంటది. అందులో వూరి పెద్ద కులాల గుడులు చాలా పెద్దగా ఆస్థిపాస్తులు కలిగివుంటయి (పెద్ద కులాలలకు లాగనే) బ్రాహ్మణ పూజార్లు నిత్య పూజాది ధూపదీప నైౖవేద్యాలుంటాయి. వాడల్ల గుడులు చాలా చిన్నగా వుంటయి. అవీ నూకాలమ్మ, పోలేరమ్మ గుడులుంటాయి. యీ గుడులకు అయిదేండ్లకో, యాడాదికో మారు కొలువులు జరుగుతయి గానీ పూజలుండవు పునస్కారాలుండవు, మొత్తానికి పూజ, గుడి సంస్కృతి కూచుండి తినే వాల్లదేగానీ శ్రమజీవులైన దళిత బహుజన ఆదివాసీ కులాలది కాదు.
తెలంగాణ వెలమదొర కేసిఆర్ తెలంగాణ మెజారిటీ ప్రజల సంస్కృతికి భిన్నంగా, వారి విశ్వాసాలకు వ్యతిరేకంగా చండీయాగం చేయడం హిందూ మతాన్ని దాంతో పాటు మనువాదాన్ని, తద్వారా కులవాదాన్ని తెలంగాణలో యింకా పగడ్బందిగా కొనసాగించడానికి చండీయాగం చేశాడు. అతడు చెప్పుకుంటున్నట్లు చండీయాగం చేస్తే తెలంగాణ వస్తుందంటే యిన్నేళ్ళు యింతమంది తెలంగాణ బిడ్డలు బలికాకపొయేవాల్లు కదా! పార్టీలు పెట్టడం, ఎన్నికలు , రాజకీయాలు, ఉద్యమాలు యీ తతంగాలన్ని ఎందుకు? కెసిఆర్ అతని కుటుంబ సభ్యులు యాగాలు నూరుకుంటు కూచుంటే సరిపోయేది గదా!
తెలంగాణ దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ, ప్రజలు సామాజిక న్యాయాల్తో సెక్యులర్‌గా వుండే తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నరు. అంబేెద్కర్ సూచించిన చిన్న రాష్ట్రాల సిద్దాంతాన్ని కోరుకుంటున్నరు. యీ సామాజిక వర్గాల విద్యార్థులే తమ చదువుల్ని, భవితవ్యాల్ని చివరికి ప్రాణాల్ని కూడా ఫణంగా పెట్టి ఉద్యమిస్తున్నరు. వారి త్యాగాలకు ఏ యాగాలు జవాబుదారీ కాదు.
తెలంగాణ కోసం ఉద్యమించేది, మంత్రాలకు చింతకాయలు రాల్తాయనే గుడ్డి భ్రమల్లో లేనిది మెజారిటీ సామాజిక వర్గాలే. యీ వర్గాల్ని గాయపర్చి. అణచివేసి యాగాలు చేయడం అదీ అంబేద్కర్ జయంతినాడు చేయడం కెసిఆర్ ఎవరి ప్రతినిధో అర్ధం చేసుకోవాలి.
పాలకులు హిందువులైతే అదీ ఆధిపత్యకులాలైతే సాంఘిక న్యాయాలు, సాంఘిక ప్రజాస్వామ్యాలు చచ్చిపోతయి. సాంఘిక నిరంకుశత్వం బలపడ్తది. భూములు ప్రకృతివనరులు పరిశ్రమలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు, మీడియా, సినిమా, రాజకీయ , మత వ్యవస్థలపై గుత్తబట్టిన అల్పసంఖ్యాకులైన ఆధిపత్యకులాలు తమ దోపిడీకులాధిపత్యాల విలువలకే పట్టం గట్టే ప్రయత్నాలు చేసిండ్రు. చేస్తారు. చరిత్రంతా యిదే కొనసాగుతుంది. నిన్న రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వుండి 30 వేల జీర్ణ హిందూ దేవాలయాల్ని పునరుద్ధరించి ఆ గుళ్ళకు ముప్పయివేల బ్రాహ్మణపూజారుల్ని పెట్టి వారికి నివాసం, గౌరవ భృతి కైంకర్యం సౌకర్యాలు కల్పించాడు. అంతేకాదు పూజాకార్యక్రమాలకు ప్రత్యేకంగా సొమ్ము కేటాయించిండు.
అట్లనే యివ్వాల తెలంగాణకోసం ఉద్యమిస్తున్నానని చెపుతున్న హిందూ దొరల కులస్థుడైన కె. చంద్రశేఖర్‌రావు కూడా వందలాది మంది బ్రాహ్మణపూజార్లని పిలుచుకుని ‘తరతరాలుగా మేము పూజలు హోమాలు నిర్వహిస్తున్నామనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దేవాదాయ చట్టంలో యింకా ఏవో కొత్త మార్పులు తెస్తానని చెప్పాడు. ఆలయాల్లో యిప్పుడు వేరే కులాల పూజారులున్నట్లు తెలంగాణ వస్తే పూజ ఆలయాల నిర్వహణ బాధ్యతను బ్రాహ్మణులకే అప్పగిస్తానని వాగ్ధానాలు చేయడం, వేద పాఠశాలలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏర్పాటు చేస్తాననడం ఏ చీకట్లని పాదుకొల్పడానికో, యిక మీదట అంటే తెలంగాణ వస్తే గ్రామానికో గుడి ఏర్పాటు చేస్తాడట. ఇది పాలక కులాల హిందూ నాయకుడిగా తనకున్న మతపరమైన మూఢ నమ్మకాల్ని, విశ్వాసాల్ని,, మూఢాచారాల్ని తెలంగాణ ప్రజా జీవితం లోకి చొప్పించడం తన అజ్ఞానానికి, నిరకుశత్వానికీ దోపిడీ స్వభావానికి అద్దంపడుతుంది.
మతపరమైన అంశాలు వ్యక్తిగత అంశాలు అని తెలిసీ వ్యక్తిగత పరిమితుల్లో వుంచకుండా యిది అందరిదని అందరికోసమని బుకాయించడం దుర్మార్గం. జయేంద్ర సరస్వతిలాంటివాడికే తెలంగాణ రాష్ట్రం వస్తే హిందూ ఆధ్యాత్మికత దెబ్బతింటుందని, హిందూ మనుగడకోల్పోతుందని, హిందూ మతం పటిష్టంగా వుండాలంటే సమైక్యాంధ్రనే వుండాలని ఆందోళించిండు. అంటే తెలంగాణ సమాజం ఎలాంటి ఆలోచనల్తో వుందో అర్ధం కావాలి.
రేపటి తెలంగాణ హిందూ, కుల ఆధిపత్యాలుండకూడదని, సామాజికమైన న్యాయాల తెలంగాణకోసం ఉద్యమిస్తున్న తెలంగాణ దళిత బహుజన ఆదివాసీ, మైనారిటీలకు చండీయాగాలు, దానిలోని మర్మాలు గొడ్డలి పెట్టే.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
మీరేం వ్రాశారో మాకు అర్థం కాలేదు, కనీసం మీకైనా అర్థమయిందా ?
అర్థం కాకపోవడానికి ఏముంది? కేవలం వ్యక్తిగత నమ్మకాల పునాదుల మీద తెలంగాణాని నిలబెట్టాలనుకుంటే తెలంగాణా నిజంగా రాదనుకుని సమైక్యవాదులు రెస్ట తీసుకుంటారు.
కె చంద్రశే ఖర రావు పేరులోనే వుంది ఖరం.
ఖరం అంటే గాడిద.
ఈ మహానుభావుడు చేసింది చండీయాగం. కూసింది మాత్రం గార్దభ గానం.
పెట్టిందేమో అగ్రకులాల్లోనే అగ్ర కులం అయిన బాపనోళ్ళ మధ్య ఫిటింగు. మీరేమో దాన్ని అస్సలు పట్టించుకోకుండా మీకు తోచింది రాసేసి మర్మాలూ మరమరాలూ పంచిపెట్టారు.
దీన్ని తెలంగాణా దళిత బహుజన ఆదివాసీ చైతన్యమని నమ్మమంటారు.
ఇలాంటి గందరగోళాన్నిచూసే ఎవడిగోల వాడిది సిన్మాకా పేరు పెట్టుంటారు.
– పుల్లా రావు
సుభద్ర గారు చాలా వితండవాదం చేశారు, కేవలం గుడి లో విగ్రహాన్ని పూజిస్తే నే అది హిందు మతానికి సంబంధించినది అని చెట్లకు పుట్లకు పూజ చేస్తే అది వేరే ఏదొ అవుతుందనకోవటమ పొరబాటు, ప్రకౄతిని ఆరాధిచడమ హిందు మతము లో ఎప్పటినుండొ ఉన్న్నది