మేకల రమాదేవి, యన్. శ్రీకాంత్, ఎ. రాజ్‌కుమార
దేశ జనాభాలో సగం ఉన్న మహిళకు స్వాతంత్య్రం వచ్చిన 63 ఏళ్ళ తరువాత కూడా చట్ట సభల్లో ప్రస్తుతం ఉన్న (పదిశాతం) దానికన్న మెరుగైన ప్రాతినిధ్యం లభించడం లేదంటే అదెంతో విచారకరమైన సంగతి. వాస్తవానికి 20వ శతాబ్దం చివరి వరకు భారత్‌లో మహిళల రిజర్వేషన్ల ఆలోచనను వ్యతిరేకించారు. లేదా పట్టించుకోలేదు. 1917లో భారతీయులకు స్వయంపాలన ఇచ్చే విషయమై బ్రిటన్ మంత్రి మాంటింగ్ బృందం భారత్‌కు వచ్చినప్పుడు సరోజిని నాయుడు నేతృత్వంలోని మహిళా బృందం వారిని కలిసి మహిళలకు ఓటు హక్కు కల్పించమని కోరింది. బ్రిటన్ పార్లమెంట్ ఈ అంశాన్ని భారతీయ చట్ట సభలకు వదిలేసింది. అప్పుడు రిజర్వేషన్ల ప్రస్తావన రాలేదు.
స్వాతంత్య్రం తరువాత భారత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు కూడా ఏ మహిళా నేత రిజర్వేషన్లు అడగలేదు.
లోక్‌సభలో మొదటి నుండి ఇప్పటి దాకా మహిళా ప్రాతినిధ్యం
లోక్‌సభ సం| మొత్తం సభ్యులు మహిళా సభ్యులు శాతం
మొదటి 1952 499 55 4.4
రెండవ 1957 500 27 5.7
మూడవ 1962 503 34 6.7
నాలుగవ 1967 523 31 5.9
అయిదవ 1971 521 22 4.2
అరవ 1977 544 19 3.4
ఏడవ 1980 544 28 5.1
ఎనిమిదవ 1984 544 44 8.1
తొమ్మిదవ 1989 517 27 5.2
పదవ 1991 544 39 7.18
పదకొండవ 1998 544 44 8.8
పన్నెండవ 1999 544 49 9.0
పదమూడవ 1999 544 49 8.8
పద్నాలుగవ 2009 544 59 10.7
పదిహేనవ 2009 544 59 10.7
ఆధారం : ఎన్నికల సంఘం
తొలి లోక్‌సభలో 22 మంది మహిళలు మాత్రమే అడుగెట్టారు. అక్షరాస్యులైన మహిళలు దేశంలో అతి తక్కువగా ఉన్న 1924లోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవి సరోజిని నాయడికి దక్కడం సరైనదేనని గాంధీ అభిప్రాయపడ్డారు. కానీ ఆ స్పూర్తి స్వతంత్య్ర భారతంలో కనిపించడం లేదని విశ్లేషకులు విచారం వ్యక్తపరుస్తున్నారు. దేశంలో మహిళల పట్ల వివక్ష దోపిడీల గురించి 1975లో మహిళా స్థితిగతుల మీద పత్రం విడుదలైంది. ఇందులో మహిళల స్థితి ఎంత దారుణంగా ఉందో కళ్ళకు కట్టారు. అప్పుడు కూడా మహిళల రిజర్వేషన్ ప్రస్తావన రాలేదు. వివిధ పార్టీలు ఎన్నికలకు టిక్కెట్లు ఇచ్చేందుకు అభ్యర్థుల్ని ఎంపిక చేసే కమిటీిల్లోకి మహిళలు వచ్చినప్పటి నుంచి వారికి రాజకీయాల్లో మహిళల పట్ల ఎంత వివక్ష ఉందో తేటతెల్లమైంది. సమాన లేదా ఎక్కువ అర్హతలు ఉన్న మహిళల్ని పక్కన బెట్టి పురుష అభ్యర్థులకు టిక్కెట్లు కట్టబెట్టడం మొదలైనవన్ని చూసిన తరువాత మహిళా రిజర్వేషన్ల డిమాండ్ తలెత్తింది. అయినా లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం 6-8 శాతం మధ్య ఉండిపోయింది. 2009 మాత్రం ఇది 10 శాతానికి పెరిగి లోక్‌సభలో 59 మంది మహిళలు ప్రవేశించారు.
ప్రస్తుతం మహిళాబిల్లును రాజ్యసభ ఆమోదించడంతో ఇది తిరిగి చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభలో దీని ఆమోదానికి ముందు మళ్ళీ చర్చలు జరగాలనీ, ఊకదంపుడు మాటలు చెబుతున్నారు. నిజానికి బిల్లుపై 14 ఏళ్ళుగా పార్లమెంటరీ కమీటిలు, పరిశీలనల, సమీక్షలు జరిపారు. రకరకాల విమర్శలు, వాదనలు, డిమాండ్లని పరిశీలించాయి. మహిళా కోటా తగ్గించడం, నియోజక వర్గాలు పెంచడం, ద్వంద్వ సభ్యత్వం, పార్టీలే రిజర్వేషన్లనివ్వడం, ఇవన్ని పరిశీలించాకే అయా కమీటిలు నివేదికలిచ్చాయి. యధాతదంగా ఆమోదించవచ్చని సూచించాయి. అయిన దీనిమీద ఇంకా చర్చించాలంటూనే ఉన్నారు. ప్రస్తుతం రోటేషన్ పద్ధతిని కొందరు విమర్శిస్తున్నారు. నియోజక వర్గాల కోసం కృషి చేసే వారికో దెబ్బ అంటున్నారు. వాస్తవానికి ఈ రోటేషన్ పురుషులకన్నా మహిళకే ఎక్కువ దెబ్బ. ఒకసారి కోటాలో నెగ్గాక మళ్ళీ అదే స్థానం నుంచి జనరల్ కేటగిరిలో నెగ్గాలంటే రెండు రెట్లు ఎక్కువగా కృషి చేయ్యాలి. అయిన మళ్ళీ అవకాశం దక్కక పోవచ్చు. దీని వల్ల వారికి కలిగే ప్రయోజనం ఏముంది.
దాదాపు 15 ఏళ్ళ నుంచి (1995) పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు రోటేషన్ పద్దతి మీదే అమలవుతున్నాయి. మళ్ళీ, మళ్ళీ ఎంపికై అభివృద్ధికి పాటుపడటం కోసం మహిళలు రెట్టింపుగా కృషి చేస్తున్నారు. మొదట్లో పురుష అభ్యర్థులు తమ కుటుంబాల్లోని స్త్రీలనే ఈ స్థానాల్లో నిలబెట్టినా తరువాత వారు తమను తాము రుజువు చేసుకుంటున్నారు. అయినా లోక్‌సభ, శాసనసభ మహిళల రిజర్వేషన్లంటే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అసలు రిజర్వేషన్ల అవసరం ఉందంటేనే సమాజంలో అసమానస్థితి ఉందని అర్థం. దీన్ని రూపు మాపడానికి ప్రత్యేక కేటాయింపులు, ప్రాతనిధ్యం కల్పించకపోతే బలవంతులైన వర్గానికే మన సమాజం, వ్యవస్థ అనుకూలంగా ఉన్నాయని తేలిపోతుంది. ఈ నేపథ్యంలోనే మహిళ రిజర్వేషన్ల బిల్లుకు అత్యంత ప్రాదాన్యం ఏర్పడుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే భారతదేశంలో చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం ఏనాడూ 11వ శాతాన్ని దాటలేదు. ప్రపంచ వ్యాప్తంగా చట్టసభల్లో మహిళా ప్రతినిధులు అత్యధికంగా ఉన్న 20 దేశాల్లో 17 చోట్ల ఏదో ఒక రూపంలో రిజర్వేషన్లు ఉన్నాయని యునిసెఫ్ నివేదిక వెల్లడించినది.
రెఫరెన్స్ :
1. చ.ఐ. రెడ్డి. : స్త్రీ పురుష అసమానత సమస్యలు, ప్రజాశక్తి బుక్‌హౌస్, హైదరాబాద్ 2.పి. సత్యనారాయణ : రాజకీయాల్లో స్త్రీలు 3. వివిధ దినపత్రికలు 4. ఎన్నికల సంఘం నివేదిక (రిసెర్చి విద్యార్ధులను ప్రోత్సహించుటకొరకు ప్రచురింపబడినది)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags