డా.రోష్ని
కాల్షియం మన శరీరంలో ఉంటుంది. 99% మన ఎముకల్లో, పళ్ళలో నిక్షిప్తమై ఉంటుంది. మిగతాది కండరాల్లో, రక్తంలో ఉంటుంది. మన శరీరంలో కండరాలు, నాడీమండలం పనిచేయడానికి కాల్షియం అవసరం. హార్మోన్ల ఉత్పత్తికి దీని అవసరం ఉంది.
ఎముకలు కాల్షియం ‘బేంకు’లాంటివి. పుట్టినప్పటినుంచీ 30-35 సంవత్సరాల వరకు మన ఎముకల్లో కాల్షియం నిల్వచేయబడుతుంది. ఆ తర్వాత ఈ నిల్వచేసేపని ఆగిపోతుంది. డెబిట్ గాని క్రెడిట్ పని ఉండదు. ఈ వయసులో (35 సం|| తర్వాత) మనం తినే ఆహారంలో సరిపడా కాల్షియం లేకుంటే అది ఎముకలనుంచే శరీరానికి అందుతుంది. దాంతో ఎముకలు పల్చబడిపోతాయి. స్త్రీలలో అయితే ‘మోనోపాజ్’ సమయంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. ఎదుగుతున్న వయసులోనే ఆహారంలో కాల్షియం సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తపడితే ఈ సమస్యను చాలావరకు నివారించగలం.
ఈ మధ్య మనదేశంలో జరిగిన కొన్ని సర్వేల్లో విచారకరమైన విషయం తెలిసింది. అదేమిటంటే టీనేజీ ఆడపిల్లల్లో 20% మంది కాల్షియం లోపానికి గురవుతున్నారు. దీనికి కారణం సమతుల్యాహారానికి బదులు ఈ పిల్లలంతా పిజ్జాలు, బర్గర్‌లు తినడమేనని తెలిసింది. ఇంకా వీళ్ళంతా మంచినీళ్ల స్థానంలో సాఫ్ట్ డ్రింక్సు (పెప్సీలు, కోలాలు) తాగుతున్నారు. ఇంత చిన్నవయసులోనే కాల్షియం కొరత ఏర్పడితే మరి ‘మోనోపాజ్’ నాటికి వారి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు ‘జీరో’ సైజు క్రేజ్‌లో పడి అసలు తిండే సరిగా తినడం లేదు. దీనికి తగ్గట్టుగా టీవీల దగ్గర కూర్చునే సమయం ఎక్కువయింది. దీనివల్ల శరీరానికి సరైన వ్యాయామం లేక కాల్షియం లోపానికి దోహదమవుతోంది. ఈ పరిస్థితినుంచి బయటపడాలంటే కాల్షియం లోపం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మనలో కాల్షియం కొరత ఉన్నప్పుడు, శరీరంలో మిగతా పనులకు (నాడీమండలం, కండరాలు పనిచేయడానికి, హార్మోన్ల ఉత్పత్తికి) ఎముకల్లో ఉన్న కాల్షియం ఉపయోగించుకోవలసి వస్తుంది. అందువల్ల ‘చిల్లుల ఎముకలు’ (చీళిజీళితిరీ లీళిదీలిరీ) ఏర్పడి ‘ఆస్టియోపరోసిస్’కి దారితీస్తుంది. ఆ తర్వాత తుంటి ఎముకలు, వెన్నెముక, మణికట్టు, కటి ఎముకలు, పక్కటెముకలు ఒక్కటేమిటి ఎక్కడయినా సరే ఈజీగా విరిగిపోయే ప్రమాదం ఉంది. అసలు కాల్షియం ఎముకల దృఢత్వం కోసమే కాకుండా, ఇంకా చాలా వాటిలో ఉపయోగపడుతుంది.
కాల్షియం ఉపయోగాలు :
మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉండటానికి, మనిషి నార్మల్‌గా ఎదగడానికి, కండరాలు, నరాలు సరిగా పనిచేయడానికి, గుండె సరిగా పనిచేయడానికి, రక్తం గడ్డ కట్టడానికి, రక్తపోటును నార్మల్‌గా ఉంచడానికి, మన శరీరంలో ఇనుము సరయిన రీతిలో ఉపయోగపడ్డానికి, శరీరంలోని హార్మోన్లు సరిగా పనిచేయడానికి (ముఖ్యంగా థైరాయిడ్, పారాథైరాయిడ్ హార్మోన్లు), శరీరంలోని కణాల నిర్మాణంలో, విటమిను బి12 వంట బట్టడానికి.
కాల్షియం తగ్గినందువల్ల కలిగే నష్టాలు :
ఆస్టియో మలాషియ (ళిరీశిలిళిళీబిజిబిబీరిబి) : ఎముకల్లో లవణీకరణ (ళీరిదీలిజీబిజిరిచిబిశిరిళిదీ ళితీ ళీబిశిజీరిని) జరుగదు. దీనివల్ల చిన్నపిల్లల్లో రికెట్సు వస్తుంది. దీనివల్ల ఎముకలు మెత్తబడతాయి, వంగిపోతాయి. దీనివల్ల పిల్లల్లో విల్లమ్ముల మాదిరి వంగిన కాళ్ళు (లీళిగీలిఖి జిలివీరీ), అతిపెద్ద నుదిటిభాగం (జిబిజీవీలి తీళిజీలినీలిబిఖి), సొట్టపడిన ఛాతిభాగం (చీలిబీశితిరీ లినిబీబిఖీబిశితిళీ), పిట్ట ఛాతీ (చీలిబీశితిరీ బీబిజీదీరిశితిళీ).
ఆస్టియోపేనియా (ళిరీశిలిళిచీలిదీరిబి) : ఎముకల్లో ఉండాల్సిన కాల్షియం సాంద్రత కంటే తక్కువగా ఉండటం. తగిన చర్య తీసుకోకపోతే ఆస్టియోపరోసిస్‌కి దారితీస్తుంది.
ఆస్టియోపరోసిస్ (ళిరీశిలిళిచీళిజీళిరీరిరీ) : ఇంతకుముందే చెప్పుకున్నాం. ‘చిల్లుల ఎముకలు’ ఏర్పడతాయి. ఎముకలు బలాన్ని కోల్పోయి, సపోర్ట్ చేసే శక్తిని కోల్పోతాయి. చిన్నగా కిందపడ్డా ఎముకలు విరుగుతాయి.
నిద్రపట్టకపోవడం, టెటనీ (శిలిశిబిదీగి) – ఫిట్సులా రావడం, మెన్సస్‌కి ముందు క్రేంప్స్ రావడం (చీజీలిళీలిదీరీశిజీతిబిజి బీజీబిళీచీరీ). కండరాలు పట్టేసి, తీవ్రమైన నొప్పి కలగడం, రక్తపోటు పెరగడం., నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం, పెద్దపేగుల్లో కేన్సరు, బ్రెస్ట్ కేన్సరు రావడానికి అవకాశం. పై నష్టాలన్నీ జరగకుండా ఉండాలంటే మన ఆహారంలో కాల్షియం సరయిన మోతాదులో ఉండాల్సిందే.
రోజువారీ మనం తీసుకోవాల్సిన కాల్షియం
వయసు కాల్షియం మి.గ్రాముల్లో
0-6 నెలలు 210
7-12 నెలలు 270
1-3 సం|| 500
4-8 సం|| 800
9-13 సం|| 1300
14-18 సం|| 1300
19-50 సం|| 1000
51 సం|| పైన 1200
పై మోతాదుల్లో కాల్షియం మన శరీరానికి అందాలంటే ఎటువంటి ఆహారం తినాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వచ్చే సంచికలో తెలుసుకుందాం.