డా.రోష్ని
ముందుగా కాల్షియం దొరికే ఆహారం గురించి తెలుసుకుందాం. రాగులు, సజ్జలు, జొన్నలు, కొబ్బరి, నువ్వులు, కరివేపాకు, ఆకుకూరలు, బాదం పప్పులు, తాలింపు గింజలు, పప్పులు-గింజలు వీటన్నింటిలో కాల్షియం దొరుకుతుంది. ముఖ్యంగా మునగాకులో పాలకంటే నాలుగు రెట్లు కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల్లో 440 ళీవీ కాల్షియం ఉంటుంది. పాలు, పెరుగు, జున్ను (బీనీలిలిరీలి), చేపలు – ముఖ్యంగా చిన్న చేపలలో కాల్షియం సమృద్ధిగా దొరుకుతుంది. మనం తినే ఆహారంలో కాల్షియం ఒక్కటే ఉంటే సరిపోదు. దానితో పాటు డి-విటమిను ఉండాల్సిందే. ఇది కొవ్వులో కరిగే విటమిను, ఈ విటమిను ఒక్క కాల్షియం వంటబట్టడానికే కాక ఇంకా చాలా ఉపయోగాలున్నాయి.
డి-విటమిను సరయిన మోతాదులో శరీరానికి అందుతూ ఉంటే-
ు మన వ్యాధినిరోధక శక్తి బలంగా ఉంటుంది.
ు నరాలు-కండరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి పనిచేసుకోడంలో ఇబ్బంది ఉండదు. మాటిమాటికి పడిపోకుండా కాపాడుతుంది.
ు మంచి మూడ్‌లో ఉంచుతుంది.
ు విషపు రసాయనాల నుంచి మెదడును కాపాడుతుంది.
ు నొప్పి నివారణలో తోడ్పడుతుంది.
ు ఫాస్ఫరస్ వంటబట్టడానికి సాయపడుతుంది.
ు డి-విటమిను తగ్గితే జరిగే నష్టాలు ఎక్కువే
ు ఎముకలు బలహీనంగా తయారవుతాయి. పెద్దల్లో ఆస్టియో పరోసిస్, పిల్లల్లో రికెట్సు వ్యాధులు వస్తాయి.
ు పెద్దల్లో గుండె వ్యాధులు, డిప్రెషన్ రావచ్చు.
ు చిన్న పిల్లల్లో అస్తమా ఉధృతంగా వచ్చి తరచూ ఆసుపత్రి పాలవుతారు.
ు రొమ్ము, ప్రోస్టేట్, పేగు కేన్సరు వచ్చే అవకాశం ఎక్కువ.
ు ఊబకాయం వచ్చే అవకాశం.
ు ప్సొరియసిడ్, ఫైబ్రొమయాల్జియా, మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం వుంది.
ు ఎప్పుడూ ఏదో నిస్సత్తువగా (బీనీజీళిదీరిబీ తీబిశిరివీతిలి రీగిదీఖిజీళిళీలి) ఉంటుంది.
ు రక్తపోటు అధికమయ్యే అవకాశం ఉంది.
ు జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. అల్జిమీర్స్ వ్యాధి కూడ రావచ్చు.
ు పిల్లల్లో టైపు-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ ఎక్కువ.
మరి ఏ మోతాదులో డి-విటమిను తీసుకోవాలి?
పిల్లలు 0-12 నెలలు – 400 |ఏ
పెద్దలు 50 సం|| లోపు – 600 |ఏ / 51-70 సం|| – 600 / 71 సం|| ఆపైన – 800 |ఏ
గర్భవతులు, పాలిచ్చే తల్లులు – 600 |ఏ
డి-విటమిను లభించే ఆహారం :
చేపలు (కొవ్వుతో ఉండే వంజరం, పండుగొప్ప, మాగచిప్పలు, బాంగడా చేపలు), పుట్టగొడుగులు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్డులోని పసుపు సొన, బీఫ్ లివర్, మార్గరీవ్, పెరుగు, చీజ్. ఈ ఆహార పదార్థాలు తినడమే కాదు, వారానికి కొన్ని రోజులు చర్మానికి ఎండ తగిలేలా చేయాలి. 15-30 ని|| ఎండ తగిలితే 10,000-15,000|ఏ డి-విటమిను మన చర్మం కింద తయారవుతుంది. నలుపు చర్మం ఉన్నవారికి డి-విటమిను తయారవడం కొంచెం కష్టం. అసలు ఎండే లేని చలిప్రదేశాల్లో కూడా ఇదే సమస్య. కొన్ని మందులు శరీరంలోని డి-విటమిన్‌ని తగ్గిస్తాయి. స్టిరాయిడ్ మందులు, కొలెస్ట్రాల్ తగ్గడానికి వేసే మందులు, ఫిట్స్‌కి, టిబికి వాడే మందులు డి-విటమిన్ తగ్గిస్తాయి. డి-విటమిను 10,000 |ఏ కి మించి తీసుకుంటే మూత్రపిండాలు చెడిపోయే అవకాశముంది. ఈ విటమిను ఈ2, ఈ3 రకాలుగా దొరుకుతుంది. ఈ3 ఎక్కువ ఉపయోగకరి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags