హేమ
మనసా వాచా నిన్నే వలచా, నడిచా నీ నీడగా’.. ఇది నేటి యువత పాట. ‘ధర్మేచ, అర్థేచ, కామేచా నాతి చరామి’ తరాలుగా మనతో చేయిస్తున్న పెళ్ళి బాసలు. అయితే యిపుడు ఈ గొడవంతా ఎందుకంటే బాబు?
ఈ మనసు, బాసల మధ్య మనమంతా ఎంత ఎదిగామనేది ఒక ప్రశ్నగానే మిగిలింది కాబట్టి. మనలో చాలామందికి నయనతార పేరు తెలిసే వుంటుంది. తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మంచినటి అనడంలో సందేహం లేదు. ఆమె అసలు పేరు నయన మరియం కురియన్. క్రైస్తవ మతస్థురాలు. అయితే ప్రభుదేవా అనే సహనటుడితో ప్రేమ, పెళ్ళి నేపథ్యంతో ఇటీవల హిందుమతంలోకి మారిపోయింది. పత్రికలో ఈ విషయం చాలా ప్రముఖంగా వచ్చింది. అయితే ఆమె మతం మార్చుకోవడం తన ఇష్టం. రాజ్యాంగం కల్పించిన హక్కుకూడా అనొచ్చు కాని సాధారణంగా మనిషి తన తన ఉన్నతి కోసం మార్పును ఇష్టపడడటం జరుగుతుంది. మరి ఏ ప్రగతిని ఆశించి నయనతార హిందూ మతంలోకి మారిందో! ఈ దేశంలో తరతరాలుగా హిందూ మతంద్వారా అణిచి వేతలో నలిగిపోయిన పేద దళిత బహుజన వర్గాలు తమ విముక్తికోసం క్రైస్తవ మతంలోకి, ఇస్లాం మతంలోకి మారారన్నది చారిత్రక వాస్తవం. అయితే ఆ లక్ష్యం ఏ మేరకు నేరవేరిందన్నది వేరే చర్చ.
వేదాలు, గాయత్రి మంత్రం స్త్రీలు చదవకూడదని అలా చేస్తే వారి నాలుక కోసేయమని, వింటే వారి చెవుల్లో సీసం పోయమని ఆదేశించిన మతంలోకి నయనతార ఎలా వెళ్ళందో! దళితులను, శూద్రుల్ని టార్గెట్ చేసి ఊడిగం చేయించుకొని ఎదురు తిరిగితే రక్తపుటేర్లను ప్రవహింపచేసిన బ్రాహ్మణ మతం ఎందుకు నయనతారకు శరణ్యం అయ్యిందో!. ఇదంతా తనకు తెలిసే జరిగిందా? ఎవరైనా బలవంతంగా రుద్దారా అనే విషయాలు మనకైతే యిదమిద్దంగా తెలియవు. వారి వ్యక్తిగత విషయాలు మనకెందుకని వదిలేసినా నయనతార ‘ఒక సెలబ్రెటి’ ఆమె చర్యలు సామాన్య స్త్రీలపై తప్పక ప్రభావం చూపిస్త్తాయి.నయనతారను సీతమ్మవారుగా బాపు ‘రామరాజ్యం’ లో ప్రాణం పోసాడు. మనకు ఇప్పుడు నయనతార అంటే అపర సీతమ్మవారు. మళ్ళీ మనవాళ్ళలో కొందరైనా సీతమ్మవారి కష్టాలు చూసి కన్నీళ్ళు పెడతారు. స్త్రీల చైతన్యం కొంతమేరకు పెరుగుతున్నప్పుడల్లా మధ్య మధ్యలో తిరిగి సీతమ్మతల్లిని ఆదర్శంగా తెరమీదకు తీసుకొస్తుంటారు. నయనతారలాంటివాళ్ళు హిందూ మత ప్రస్థానం కూడా ఆ విషయాన్నే నొక్కి చెప్పుతుంది.
నయనతార మత మార్పిడి విషయంలో రెండు విషయాల గురించి మనం ప్రధానంగా ఆలోచించాలి. స్త్రీలపై ఇప్పటికీ పనిచేస్తున్న పితృస్వామిక భావజాలం మరియు మొత్తంగా ‘హైందవీకరణం’ చేయబడుతున్న భారతసమాజం గురించి. మనదేశంలో ప్రతి మనిషికి తనకు ఇష్టమైన మతాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(ఏ) కల్పించిందికూడా. కాని ఈ విషయాన్ని అగ్రవర్ణ, వర్గ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకొన్న పురుష సమాజం ఏనాడు ఒప్పుకుంది కనుక! గుజరాత్‌లోని ముస్లిం స్త్రీలపై దాడులు, ఒరిస్సాలోని కాందమాళ్‌లో ఆదీవాసీలపైన జరిగిన దహనకాండ, మంగళూరు క్రైస్తవ స్త్రీలపై భౌతిక, సాంస్కృతిక దాడులు, ఉత్తరప్రదేశ్‌లోని నన్‌పై (కైస్తవ సన్యాసినులు)అత్యాచార అత్యాచారం దీనికి అద్దం పడతాయి.
ప్రపంచీకరణ నేపథ్యంలో పెట్టుబడిదారి వర్గాన్ని, మార్కెట్టు విస్తరణే ముఖ్యం. మెజార్టీ మతం ఏదైతే వుందో దానిలో కలిసిపోవాల్సిన అవసరం ఈ అంతర్జాతీయ పెట్టుబడిదారి వర్గాలకు వుంటుంది. ఈ వ్యవస్థలోని సామాజిక నిర్మాణాలతో రాజీ చేసుకుంటుంది. ఈ క్రమంలో సెక్యులరిజం(లౌకికం)పోయి లౌక్యం వస్తుంది. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గం తమ మనుగడకోసం, హిందువులు, ముస్లింలు లేదా క్రైస్తవులు మైనార్టీలుగా, గుంపులుగా విడదీయడం, విఢజించు, పాలించు సూత్రాన్ని రాజ్యంతో అమలు చేయిస్తుంది. వాళ్ళు దేశంలోని ప్రధాన వర్గాన్ని తయారు చేసుకొని ఆఖరికి పెట్టుబడులను కూడా హైందవీకరణచేస్తున్నారు. (ఆర్.ఎస్.రావు-కొత్తచూపు) అడ్డొచ్చిన వారిపై అటాక్ లేదా వారిని కో అప్ట్ (సంలీనం) చేసుకోవడం హిందూ మత లక్షణం. ఈ పెట్టుబడిదారులు హిందుత్వంద్వారా తమకు అనువైన మార్కెటును ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి యిక్కడున్న అధికార (భారతదేశం సెక్యులర్ స్టేట్ అంటారేమో. క్షమించండి!) మతానికి రాజ్యానికి దానికనుబంధమైన అంగమైన ప్రెస్‌కు అవినావభావ సంబంధం వుంది. యిన్ని హంగులన్న అంతర్జాతీయ పెట్టుబడిదారీ వర్గం దేశంలో తాము తయారు చేసుకున్న ఒక దళారీవర్గంలో మొత్తం సమాజాన్ని హైందవీకరణ చేయడానికి ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయి. ఈ హిందు మతోన్మాదాన్ని మెజార్టీ-మైనార్టీ అనికాకుండా ఏకశిలా సంస్కృతిని ముందుకు తీసుకువస్తున్నారు.
అందుకే రాజ్యం ఈ రోజున మీడియా సహకారంతో నయనతార మత మార్పిడిని గ్లోరిఫై చేస్తే కథనాలు ప్రచారం చేస్తుంది. ఆమె వ్యక్తిగత విషయాన్ని సమాజంపై ప్రభావం పడేలా చేయడం వెనుక కుట్ర దాగివుంది. మరో విధంగా స్త్రీ ఏవర్గానికి, కులానికి, మతానికి చెందినదైనా పురుషుడికోసమే ‘ఆమె’ జీవితం అనే ఒక పితృస్వామ్య భావజాలాన్ని మరింతగా మరింత బలపడేలా చేయడానికి ఈ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. మొత్తం భారత సమాజాన్ని హైందవీకరణ చేసి తమ పెట్టుబడులకు, లాభాలకు ఢోకా లేకుండా చేసుకొనే ప్రయత్నమే మైనార్టీలపైన దాడులు, లేదా మెజార్టీ హైందవీకరణ చేసి తమ పెట్టుబడులకు లాభాలకు ఢోకా లేకుండా చేసుకునే ప్రయత్నానికి మైనార్టీలపైన దాడులు లేదా మెజార్టీ మతం తీసుకున్న వారిపై అత్యంత ప్రేమాభిమానాల పబ్లిసిటీ. ఈ దేశంలో వుండాలంటే జైశ్రీరామ్ అనాలన్న నినాదంతో బాబ్రీ మసీదు కూల్చివేత, మైనార్టీలపై హింసా, అల్లర్లు, స్త్రీలు అని కూడా చూడకుండా వారిపై టెర్రరిస్టుల ముద్ర వేస్తున్న ధోరణులు, ప్రయత్నాలు మనందరి జీవనభద్రతకే ముప్పు. ‘మనసెరిగిన మన కథలో(వ్యధలో) ఎన్ని సామాజిక కోణాలు వున్నాయి. సామ్రాజ్య వాద కుట్రలు దాగి వున్నాయి. కాబట్టి పరమత స్త్రీలను ఉన్నామదంతో ఊచకోత కోసి, ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అని ఘోషించే హైందవ మతంలోనికి వెళ్ళే కాని నయతారలే కాకుండా స్వేచ్ఛకోసం మతన్మోదానికి వ్యతిరేకంగా పోరాడే తస్లీమా నస్రీన్‌లు మనకు ఆదర్శం కావాలి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
పితృస్వామ్య భావజాలం లేని మతము ఏది?
స్త్రీలపై పురుషుల పెత్తనమును సమర్ధించని మతము ఏది?
స్త్రీలకు పూర్తి స్వాతంత్రమును, పురుషులతో సమానమైన హక్కులను అన్ని రంగాలలో ఇచ్చిన మతము ఏది?
పితృస్వామ్యము మతాలకు అతీతమైనది. అది అన్ని మతాలలో ఉంది. లేకపోయినా, తరువాత అన్ని మతాలలోనికి చొప్పించబడింది. ఏమతమూలోనూ స్త్రీలు స్వతంత్రులుగా లేరు. అలాంటప్పుడు, నయనతార క్రైస్తవ మతములో మాత్రం ఎందుకుంది? అసలు స్త్రీలు మతాలలో ఎందుకున్నారు? తాము ఫలానా మతము అని స్త్రీలు ఎందుకు చెప్పుకుంటున్నారు? క్రైస్తవములో, ఇస్లాములో స్త్రీలపి జరిగే దురాగతాలను రచయిత్రికి తెలీవా? లేక వినలేదా? మరి అన్నీ ఆ తానులో ముక్కలే అయినప్పుడు ఈ గోలెందుకు? ఒక మతములోకి మారినందుకు ఆ మతముపై విష ప్రచారమెందుకు? స్త్రీవాదం, దళితవాదం, కమ్యూనిజం ఇన్ని కలిపి రాసిన ఒక ఆర్టికలులో ఒక సమస్యపై చిత్తశుద్దితో రాసిన అభిప్రాయం లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు.
హిందువులు గడ్డిని ఏదో తక్కువగా తిన్నారనుకోకు. మన హిందువులు అంతటి బురద పందులు ప్రపంచంలో ఇంకో చోట ఉంటారనుకోను. భర్త చనిపోయిన స్త్రీకి గుండు గియ్యించి తెల్ల చీర కట్టే అనాగరిక ఆచారం వేరే ఏ మతంలోనూ లేదు. హిందూ మతంలో లింగ వివక్ష లేదు అని వట్టి కబుర్లు చెప్పేవాడైనా భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకోవడానికి ముందుకి వస్తాడా అంటే సందేహమే. కబుర్లు ఎన్నైనా చెపుతారు కానీ ఆచరణలో ఏదీ చెయ్యరు.
Praveen Sarma,
హిందువులలో దురాచారాలు లేవు అని నేను ఎన్నడూ చెప్పలేదు. అది కాకపోతే అన్నింట్లోనూ దురాచారాలున్నప్పుడు హిందువుల మీదే ప్రత్యేక శ్రద్ద అదీ నెగటివ్ డైరెక్షనులో ఎందుకు అని అడుగుతున్నా. అంతే, పైన రచయిత్రి చేసింది హిందూ మతములో దురాచారాలున్నాయి వాటిని రూపుమాపండి అని కాదు చెప్పింది. దురాచారాలు ఉన్నాయి అలాంటప్పుడు హిందూ మతము ఎందుకు అని ప్రశ్నించింది. కాబట్టే, ఆ వ్యాఖ్య రాయాల్సి వచ్చింది. ఇకపోతే నీ అలివిమాలిన ఆదర్శాలు నా మీద రుద్దకు (ప్రయోగించకు), వాటిని కనీసం వినే ఓపిక కూడా నాకు లేదు. వితంతువులను పెళ్ళి చేసుకోవాలన్న కోరిక నాకు లేదు, ఒక వేల నేను ప్రేమించిన అమ్మాయి వితంతువు అయితే నిర్ణయం తీసుకునేప్పుడు దాని గురించి అస్సలు ఆలోచించను. నీపాటికి నువ్వు మరో రాజా రామ్మోహన్ రాయిలా, మిగిలిన మగాల్లందరూ తీవ్రమైన పురుషాహంకారముతోను, అతి దారుణమైన మూఢాచారాలతో కుళ్ళిపోయిన వారుగానూ ఫీలవ్వకు. రెండూ నిజం కాదు.
ప్రేమించిన అమ్మాయి తన కులం కాదని తెలిసి వదిలేసిన ఒక మగమహారాజు ఉన్నాడు http://vadrangipitta.blogspot.com/2011/09/blog-post.html ప్రేమ గురించి కబుర్లు చెప్పడం చాలా సులభమే. నువ్వు ప్రేమించిన అమ్మాయి వయసులో నీ కంటే పెద్దదని తెలిసినా నువ్వు ఒప్పుకుంటావా? వయసులో పెద్ద అమ్మాయి అవసరం లేదని చెప్పి ముఖం చాటేస్తావా? మగమహారాజులా ఫీలైపోయేవాడైతే ముఖం చాటేస్తాడు.
ఒక మనిషి చేసిన తప్పును అందరి మగవాల్లకూ అంటగట్టే జెనరల్ నాలెడ్జి నుండి బయటకు రా మొదట. తన కన్నా పెద్దదైన అమ్మాయిని పెళ్ళీచేసుకున్న సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు నేను ఉదహరించ దలుచుకుంటే, కానీ నా కది ఇష్టం లేదు. ఒక వ్యక్తి ఆవిధంగా వయసును పట్టించుకున్నాడూ అంటే అది అతని ఇస్టం. నీకింకో విషయం చెప్పాలనుంది. ఒక వేల అమ్మాయే అతను తన కన్నా చిన్న వాడు అని తెలుసుకుని పెళ్ళిచేసుకోవడం మానుకుంది అనుకుందాం, మరి అలాంటప్పుడు ఏమి చేయాలి. నీతి సూక్తులు మగవారికే ఎందుకు? తన చేసుకునే మగవాడు తనకన్నా చిన్నవాడూ అయితే అమ్మాయిలు పెల్లి చేసుకుంటారో లేదో ముందు ఆడవారిని అడిగి తెలుసుకో, ఎంతమంది ఒప్పుకుంటారో, ఎంత మంది ఒప్పుకోరో?
అమ్మాయి ఒప్పుకోకపోతే అది వేరే విషయం. అబ్బాయికి తెలిసిన తరువాత తప్పించుకోవడానికి ప్రయత్నించకుండా ఉండే నిజాయితీ ఉంటుందా?
హేమ గారూ,
మీరు బాగా రాశారు. పాయింటు స్పష్టంగా వచ్చింది. ఏ దేశంలో ఏ మతమైతే అధికార (మెజారిటీ) మతంగా వుంటుందో, ఆ మతం పేరుతో ఎక్కువ అత్యాచారాలు ఈ పెట్టుబడి దారీ వ్యవస్థ చేయిస్తుందని మీరు స్పష్టంగా చెప్పిన విషయం కొంత మందికి అర్థం అయినట్టు లేదు. ఉదాహరణకి, భారత దేశంలో అధికార (మెజారిటీ) మతం “బౌద్ధ మతం” అనుకోండీ. అప్పుడు, ఈ అత్యాచారాలన్నీ పెట్టుబడి దారీ వ్యవస్థ ఆ మతం తోనే చేయిస్తుంది. ఈ మతం అనేది ఈ పెట్టుబడి దారీ వ్యవస్థకి ఒక ఆయుధం మాత్రమే. స్త్రీ వివక్ష అనేది ప్రతీ మతం లోకీ ప్రవేశించింది. ఒక సందర్భంలో ఒక మతాన్ని విమర్శించినప్పుడు, దానర్థం మిగతా మతాలని నెత్తిన పెట్టుకున్నట్టు అనుకుంటే, వారికి ఈ వ్యాసం అర్థం కాలేదనే అనుకోవాలి. “ఆ మతం గొప్పదా, ఈ మతం గొప్పదా?” అనే పిచ్చి వాదనలు ఎవరికీ మేలు చెయ్యవు. ఎటొచ్చీ, ప్రతీ మతం లోనూ, స్త్రీ వివక్ష సరి సమానంగా లేదు, ప్రతీ విషయంలోనూ. ఒక మతంలో స్త్రీలు, పురుషులతో కలిసి ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యకూడదు. ఇంకో మతంలో ఇంకో విషయం. ఎక్కడ ఏ అత్యాచారం కనబడితే, దాన్ని వ్యతిరేకించాలి గానీ, ఆ మతంలో అది లేదా, ఈ మతంలో ఇది లేదా అంటూ చిన్న పిల్లల్లా వాదించుకుంటే, మనం ఏం అర్థం చేసుకుంటున్నట్టు? ఈ ఆర్థిక వ్యవస్థ చేసే పని గుర్తించక పోతే, అసలు కారణం అర్థం కానట్టే. అమెరికాలో, బౌద్ధ మతానికి చెందిన ఒక చైనీస్ అమ్మాయిని ఒక కాథలిక్ అబ్బాయి ప్రేమించాడు. ఆ అమ్మాయి కాథలిక్ గా చర్చిలో మారే వరకూ, పెళ్ళి జరగడానికి, ఆ అబ్బాయి గానీ, ఆ అబ్బాయి తల్లిదండ్రులు గానీ ఒప్పుకోలేదు. అలా ఆ అమ్మాయి మతం మారేకే, ఆ పెళ్ళి జరిగింది. ఎక్కువ కేసులు తీసుకుంటే, స్త్రీలే పెళ్ళి కోసం (వారి ఆర్థిక పరిస్థితి ఎలా వున్నా) మతం మార్చుకోవడం చూస్తూ వుంటాము. ఈ స్త్రీ వివక్ష ఈ ఆర్థిక వ్యవస్థ లోంచి వచ్చిందే అనుమానం లేకుండా.
వ్యాసంలో విషయాలు చక్కగా వున్నాయి. ఇంకొంచెం శ్రద్ధ పెడితే, రాసిన పద్ధతి ఇంకా మెరుగ్గా వచ్చేది. ఇప్పుడు రాసింది కూడా బాగుందనుకోండీ. ఇంకా ఎక్కువ బాగుండేదని నా అభిప్రాయం.
ప్రసాద్
ప్రవీన్,
అది వేరే విషయం ఎలా అవుతుంది? నీతులు మగవారికేనా ఆడవారికి వర్తించవనా మీ ఉద్దేశ్యం?
@ప్రసాద్,
భారత దేశానికి అధికార మతములేదు. మేజారిటీయులు ఉన్న మతం మాత్రమే ఉంది. ఆ రెండింటికీ తేడా తెలీని వారిని చూసి నిట్టూర్చి ఊరుకోవడం మినహా ఎవరు మాత్రం ఏమి చేయగలరు. నయనతార మత మార్పిడి అనే విషయములో పెట్టుబడి విధానాన్ని, అధికారమతముతో అది చేయించే అత్యాచారాలనూ చూడగలగడం అనేది ఫన్నీగానే కాదు అతిషయోక్తిగానూ ఉంది.
నేను పైన ప్రవీన్‌కు ఇచ్చిన సమాధానములో చెప్పడం జరిగింది. హిందూ మతములో దురాచారాలు ఉన్నాయి రూపుమాపండి అని చెప్పడాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు. ఎందుకంటే తప్పులు అన్ని మతాలలో ఉన్నాయి కాబట్టి. కానీ, మీరు ఆర్టికలును సరిగా చదివితే సిమ్హ భాగం రచయిత్రి హిందూ మతములో ఇన్ని దురాచాలున్నప్పుడు ఎందుకు నయతార ఈ మతములోనికి వచ్చింది అని ప్రశ్నించడానికే కేటాయించారు. దాన్నే వ్యతిరేకించాల్సి వచ్చింది. ఏమతమూ కడిగిన ముత్యం కానప్పుడు ఒక మతమునుండి ఇంకో మతానికి మారడాన్ని వ్యతిరేకించాల్సిన పని లేదు. ఒక వేల వ్యతిరెకించినా ఆ మతముపై ఇంతగా విరుచుకు పడాల్సిన అవసరమూ లేదు. మీకీవిషయం అర్థం కాకపోతే వదిలేయండి.
ఒక మతమును విమర్శించడం తప్పు కాదు, హిందూ మతములోని లోపాలను ఎత్తిచూపిన ప్రతీసారీ ఇతర మతాలలో కూడా లోపాలున్నాయి అంటు ఏకరువు పెట్టాల్సిన అవసరమూ లేదు. ఈ విషయాన్ని నేనూ అర్థం చేసుకోగలను. కానీ, ఈ సాకును చూపి, కేవలం ఒక మతాన్ని మాత్రమే తప్పుపట్టి, ఆమతములోనుండి ఈ మతములోని ఎందుకు వచ్చావమ్మా అని అడగడం విడ్డురమే. ఎందుకంటే, అదే ఆర్టికలులో, చాలా మంది ఈ మతములోని వివక్షను తట్టుకోలేక మతము మారారు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అన్ని మతాలలో జరిగే మత మార్పిడుల ప్రస్తావన వచ్చింది. అలాంటప్పుడు కూడా నేను కేవలం ఒకే మతాన్ని విమర్శిస్తాను అనో లేక కంటి తుడుపు చర్యలుగా చివరి లైన్లు న్యూట్రలుగా రాయడమో చేస్తే వ్యతిరేకించడం తప్పుకాదు. దీన్ని అర్థం చేసుకోవడానికి చిన్న పిల్లల మనస్తత్వం నుండి బయటకు వచ్చి ఆలోచించాల్సి ఉంటుంది లెండి.
hotchpotch అంటే ఏమీటో తెలుసా, మనము చెప్పాలనుకున్న దానిలో సగం నిజం, సగం సంభంధములేని, నిజం కాని విషయాలను చొప్పించడం. అమెరికాలో అమ్మాయి పెల్లి చేసుకోవాలంటే మతం మారాల్సి వచ్చింది అనే నిజాన్ని చెప్పి, దాని తరువాత దీనికి కారణం ఆర్థిక విధానాలు, పెట్టుబడిదారి విధానం అని చెప్పడం ఆకోవలోనికే వస్తాయి.
మెజారిటీ మతమే అధికార మతం అనుకునే మీరు వంచకులు కాకపోతే ఏమిటి? ఇంగ్లాండ్‌లోని రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పని చేసిన ఆంటోనియా (సోనియా) రాజీవ్ గాంధీ కోసం మతం మార్చుకుంటే అది ఆర్థిక బలహీనత అనుకుంటాం. కానీ ఆర్థికంగా అన్నీ ఉన్న & పెళ్ళైన తరువాత కూడా సినిమాలలో నటించాలనుకుంటోన్న డయానా మరియం (నయనతార) ఏ బలహీనతకి లొంగి మతం మార్చుకుంది?
ప్రవీనూ,
ఇక్కడ మెజారిటీ మతాన్ని అధికార మతము అన్నది నేను కాను, ప్రసాదు. మరైతే నువ్వెందుకు రియాక్తయ్యావు అని అడక్కు. ఎందుకంటే, ఇప్పటివరకూ జరిగిన వాదన నీకూ నాకూ మధ్య మాత్రమే జరిగింది. పైపెచ్చు, మెజారిటీ మతాన్ని అధికార మతం అనడం అయితే అమాయకత్వం అవుతుంది లేదా తెలీని తనమో, అతి తెలివి తనమో అవుతుంది. అంతే కానీ వంచన అవ్వదు. ఇది చెప్పడానికే రిప్లై ఇస్తున్నా.
వంచన (హిపోక్రిసీ) అనేది అతితెలివికి సంబంధించిన విషయమే నాయనా. తెలివితేటలు ఉన్నోడే ఇతరులని వంచిస్తాడు.
ఈ లింక చదువు: http://radicalfeminism.stalin-mao.in/16-32
ఇది భారత దేశం. అంటే కుల మత వర్ణ వర్గ విచక్షణ లేని రాజ్యాంగాన్ని కలిగి వున్న ప్రజా స్వామిక దేశం. కాబట్టీ, ఇక్కడ ఇలాంటి కుల మత చర్చలు అనవసరం. అందుచేత ఎవరయినా ఏ మతాన్నించీ ఏ మతానికి అయినా గెంతవచ్చు. కాదనకూడదు. ఆ అమ్మాయి సినిమా నటి కాకుండా ఏ సంఘ సామాన్యురాలో అయివుంటే అసలు ఈ వ్యాసంగానీ మీ చర్చలుగానీ మధ్యలో పానకంలో పుడకలా నా వ్యాఖ్యలుగానీ వుండేవా ?
శ్రీ పుల్లారావు గారూ,
రచయిత్రి రాసిన కింద మాటలు మరొక సారి చదవండి. మీ మాటలకి సమాధానం లభిస్తుంది:
వారి వ్యక్తిగత విషయాలు మనకెందుకని వదిలేసినా నయనతార ‘ఒక సెలబ్రెటి’ ఆమె చర్యలు సామాన్య స్త్రీలపై తప్పక ప్రభావం చూపిస్త్తాయి.నయనతారను సీతమ్మవారుగా బాపు ‘రామరాజ్యం’ లో ప్రాణం పోసాడు. మనకు ఇప్పుడు నయనతార అంటే అపర సీతమ్మవారు. మళ్ళీ మనవాళ్ళలో కొందరైనా సీతమ్మవారి కష్టాలు చూసి కన్నీళ్ళు పెడతారు. స్త్రీల చైతన్యం కొంతమేరకు పెరుగుతున్నప్పుడల్లా మధ్య మధ్యలో తిరిగి సీతమ్మతల్లిని ఆదర్శంగా తెరమీదకు తీసుకొస్తుంటారు. నయనతారలాంటివాళ్ళు హిందూ మత ప్రస్థానం కూడా ఆ విషయాన్నే నొక్కి చెప్పుతుంది.
భవదీయుడు,
ఉదయ్