తెల్ల మబ్బుల గొడుగులు పట్టుకొని
కాపలా కాసే భటుల్లా
బారులు తీరిన ఆకుపచ్చని కొండలు,
సువిశాలంగా పరుచుకున్న గోదావరిపై
తేలియాడుతూ తెల్లని నురగల మల్లెలు
నవ్వినప్పుడు బుగ్గలు చొట్టలుపడినట్టు
చిన్ని చిన్న సుడిగుండాలు
సన్నని సవ్వడితో అలలు మెల్లమెల్లగా విరిగిపడుతూ
అంతలోనే కలిసిపోతూ
గాజుపలకల్లా మెరిసిపోతూ
కొండ అంచుల్లో గోదావరి
ఆకుపచ్చని కాంతులీనుతూ
ప్రకృతి అందాలకు పరవశించిన
కవయితుల్ర బృందగానాలు
నవ్వుల పారిజాతాలు వెదజల్లుతూ కాసేపు
సుదీర్ఘాలోచనలతో
వాదోపవాదాలతో మరికొంతసేపు
మాకంతరాయం కలిగిస్తూ
ఉన్నట్టుండి హోరెత్తిన
‘‘నాకున్నది పదహారేళ్ళ వయసంటూ’’ పాట
ఆడుతున్న పన్నెండేళ్ళ అమ్మాయి బాల్యాన్ని హత్య చేసింది
రోజూ టీవీల్లో, స్కూళ్ళల్లో
కన్నవాళ్ళే హంతకులవుతున్న వేళ
కళ్ళముందు జరిగిన హత్యకు
కాసేపు మౌనం పాటించాం
***
వంపులు తిరిగిన గోదావరిలో
ఎన్నెన్నో జీవిత సత్యాలు
జీవితంలోనూ మలుపులుంటాయి
మలుపు తిరుగుతున్నప్పుడు తెలియదు
ఒక్కోసారి….
జీవితం మలుపు తిరిగిందని కూడా తెలియదు
గోదావరి ప్రతి మలుపులో
ఒక ఉద్వేగభరిత ఆనందం
మలుపు ఆవలి
రహస్యాన్ని ఛేదించాలని
మనసులో ఆరాటం మొలకెత్తుతుందా
మలుపు తిరిగేసరికి మరో మలుపు కవ్విస్తుంది
ఏ అందమైనా అందకుండా పోతుందని
రెండు కళ్ళు చాలనితనం వెక్కిరించింది
ఉన్నట్టుండి దారికడ్డంగా వేలాడుతూ
నీలిమబ్బుల తెరలు
గోదావరిని దాచేస్తూ
తెరల్ని తొలగించుకొని చూడబోతే
మమ్మల్ని నిలువునా తడుపుతూ పాపికొండల పన్నీటి జల్లు
వర్షించే మబ్బులు మమ్మల్ని తమలోకి లాక్కున్నాయో,
మేమే రెక్కలు చాచి ఆకాశంలోకి ఎగిరిపోయామో
ప్రకృతిలో కలగలిసిపోయిన
అవ్యక్తమైన అద్భుత ఆనందంతో నిలువెల్లా వణికిపోతూ
అందరం ఒకే కవితగా పలవరించి
ఒకే పేమ్రను వరించాం
***
కొన్ని నిముషాలు గడిచి, మబ్బులు కరిగి
పాపికొండల మధ్య ఇరుకుదారిలో
సాగిపోతున్న గోదావరి
అలలు లేవు గలగలలు లేవు
మౌనం తపస్సు చేస్తున్నట్టు
ధీర గంభీరంగా గోదావరి
ఏటికెదురీదే సాహసానికి పాణ్రం పోస్తూ