కన్నతల్లి నా కళ్లజోడు

వై. శ్రీరంగనాయకి
అవునూ…
భూదేవి నీ బుగ్గన ముద్దెట్టిందా?
ఆకాశం నీతో ఆడిందా?
అని అడిగేవాళ్ళకు
కాళ్ళకు చక్రాలు కట్టుకుని పరుగులెత్తుతున్న, ఉరుకులెత్తుతున్న
ఈ చందమామను చూపిస్తాను!
దోసిళ్లతో ప్రేమను
లాలగా పోసింది
ఈ బెజ్జ మహాదేవి!
వేకువను పాటగా నేర్పి
కరవాలాన్ని కాటుకగా దిద్ది
వెన్నెలను తీపిగా అద్ది
తిక్కన తెనుగుదనాన్ని, వేమన పద్యాల్ని
గుక్కలుగుక్కలుగా నాలోకి పోసింది
ఈ ఒజ్జమహాదేవి!
నా తక్కిరి బిక్కిరితనాన్ని సరిచేస్తూ…
తరుముకొస్తున్న అరణ్యాల్ని ఉద్యానవనాల్ని చేస్తూ…
ఆమె ఓపిక హారతి కర్పూరమైంది!
అమ్మ కావడం అంటే
అన్నం వండి వార్చడం కాదు
నన్నొక జక్కనబొమ్మనుచేసే క్రమంలో…
ఆమె అతుకులబొంత అయింది!
నే పెద్దయ్యేకొద్దీ
అమ్మ అందాలమోము
కొంచెంకొంచెంగా అలానే ఉంది కానీ…
నా బాల్యంతో
తన బొమ్మని చేస్తూ
కాల్చిన సలాకుతో పెట్టినట్లున్న వాతలు
పొట్టమీద బిడ్డచారలై
ప్లాస్టిక్‌ను కదిలించినట్లు
నా చేతులకు పరపరా తగులుతున్నాయి!
నన్ను లోకానికివ్వాలని
తన శరీరాన్ని నెఱ్ఱెలుగా నెరుపుకుంది
నేను తెలీక చేసిన తప్పులకు
తను అగ్నిప్రవేశం చేసింది!
అమ్మ అనే రెండక్షరాల పదవిని కోరి
వెఱ్ఱితల్లి
నిండుజీవితాన్ని బలిదానం చేసుకుంది!
నా భవితచుట్టూ ప్రవహించిన నది
నాకు రెక్కల్నిచ్చి ఎగిరించిన గాలిపటం
ఇప్పుడు
మినుకుమినుకుమంటూ కునుకుతోంది!
నా ఈ పెద్దచిన్నపిల్లని
మాటవినని మొండిఘటాన్ని
చెవులు మెలెయ్యనూలేను
ఉయ్యాలజంపాల ఆడించనూ లేను
నన్ను నడిపిన కలకు, నన్ను నిలిపిన గెలుపుకు
నిశ్చయంగా నేనిచ్చే సూడిద
నోరారా అమ్మా అని పిలవడం
నెమ్మళంగా ఆమె ఓ అన్నంముద్దైనా తిన్నదోలేదో అడగటం!
అమ్మ చూపుడువేలెప్పుడూ
ఆ వాక్యం దగ్గరే నాకళ్ళనాపుతుంది
”కనికరము కలవారు ధన్యులు – వారు కనికరము పొందుదురు.”
తమ్మెర రాధిక
ధిక్కారం సైతునా!!

ఇప్పటి వరకూ ఈ పల్లెని
ఎవ్వరూ స్పర్శించలేదు.
అందుకే మట్టి తొవ్వెంబడి
పురాతన జ్ఞాపకాలు మన వెంట వొస్తున్నయి.
పడిపోతున్న గోడలూ
కుప్ప కూలిపోతున్న బ్రతుకులూ
పిచ్చి మ్కొలు మొలిచిన జాగాలో
అస్తిత్వాన్ని వెతుక్కుంటున్నాయి.
ప్రశాంతమైన పగటి వెలుగు
పొలాల మీది పైరగాలిని
మర్రి ఊడలకు ఉయ్యాల కట్టి ఊగుతుంటే
బ్రతుకు నీడలు కదిలిపోతున్నాయి.
జారిపోయిన గూనపెంకూ
విరిగిపోయిన కట్టుగొయ్యా
అమ్మ నాయినల ఆత్మీయ బంధాలవ్వి!
ఎన్నేండ్లు కాపురం జేసిందో ఆ తల్లి పెంకు జారనీయకుండా!
ఎన్నాళ్ళు సాదాడో ఆ తండ్రి కొయ్య కుదేలయి పోకుండా!
గుడి ప్రాకారం పట్టు సడలిపోతోంది
పారిజాతాలు పూజకు నోచుకోక పోవడమే సాక్ష్యం.
కోనేరు మెట్లు పోయి
ఎన్నో గ్రామకథలు నెమరువేసుకుంటోంది.
చెరువు అంచు వెంబడి
చాకలి సున్నపు బానలు
పొద్దు గూకిన వేళలో
శిథిల జీవితాలకు కావలి కూర్చున్నట్లుంది.
కలత బారిన కన్ను సముద్రాన్ని సృష్టిస్తోంది.
తనను ఎవ్వరూ పట్టించుకోనితనం
పల్లె ధిక్కారాన్ని చేత బట్టుకుంది.
పాత తరానికి ప్రతినిధిలా – తనను తాను రూపుదిద్దుకుంది.
ఎవ్వరి సానుభూతినీ, ఆశ్చర్యాన్నీ ఆవేదననీ
తలదాల్చలేదు
కాలాలు వస్తూ పోతూ వున్నా
కూలిన గోడలూ… ఇంకిన జలాశయాలూ
విరిగిన శిల్ప సంపదా…
మాసిపోయిన చారిత్రక నిజాల మరుగూ
ఇవికాదా పల్లె కోల్పోయిన వెలుగూ.
బి. అంజనా
వివక్ష

పిండంగా వుండగానే మొదలవుతుంది వివక్ష
సమానత్వంపై సందేహాలు సవాలక్ష
మనువు నుంచి మన్మోహన్‌ దాకా
”నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి” పాపం.
”వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం”
ఆకాశంలో సగం ముప్పైమూడు శాతం వరం
అడవి జంతువును చంపితే కఠిన శిక్షలన్న చట్టం
ఆడకూతురు హత్యపై అంతులేని జాప్యం
స్వప్నికలు, ప్రణీతలు రూపుమారిన అహల్యలు, అనార్కలీలు
ఉగ్రవాదం కన్నా ప్రమాదమౌతుంది ప్రేమోన్మాదం
ఆడపిల్లను అల్లరిపెడితే ‘గాంధీ’లో ఊడ్పించడం కాదు
లేబర్‌ రూంలో కట్టిపడెయ్యండి
తన ఉనికి ప్రారంభానికి
కడుపు చీల్చుకునే తల్లుల తపన బోధపడుతుంది.
కె.శోభారాణి
చారిక – (ఖడ్గమా/కార్మికురాలు)

కాలం చెక్కిలిపై తడి ఆరని
కన్నీటిచారిక..గృహపరిచారిక
విషాదనాయిక…

ఏండ్లనుండి రాణివాసపు..స్త్రీలవెంబడి
వచ్చిన రాక…ఆగని వెట్టి
నాటినుండి నేటిదాక
చట్టాలకు న్యాయాలకు అతీతంగా…
అన్యాయమైపోతున్న…అతివ
సహాయకురాలు దాసి
పేరేదైనా ..వెట్టి రూపాంతరాలు
వేరైనా..చేసేది..పని
ఒకటే పని…విరామం… విశ్రాంతి లేకుండా
దౌర్జన్యాలకు, ఫిర్యాదులేదు, దాతు లేదు
బతుకు పరమపద సోపానపటంలో ఎక్కే
నిచ్చెనలకంటే..మింగే పాములే ఎక్కువ

పొట్టకూటికోసం,మెరుగైన బతుకుకోసం..
ఎడారిదేశాలకు..కొండొకచో..ఎండమావులకూ
పయనం..
వీసాలు మోసాలు…దాటుకొని
కుటుంబాన్ని వదిలి వెళ్ళలేక…జారిపోతున్న
ధైర్యాన్ని కూడగట్టుకొని
పూడుక పోతున్న మాటలు
ఢగ్గుత్తికతో..
వెక్కిళ్ళ మధ్య అదృష్టాన్ని వెతుక్కుంటూ
చెన్నై, హైద్రాబాద్‌, న్యూఢిల్లీ, కలకత్తాలకు
తెల్లవారు జామనేది లేకుండా రాత్రి ఏడున్నరకు
చేరే…కోల్‌కత్తా…తుఫాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో
ప్రయాణించటానికి…
పేద మహిళలు పడే అగచాట్లకు లెక్క లేదు
చేసిన పనికి..వేదన ప్రతిఫలం…గౌరవం
గాలిలో దీపమే…
చట్టాలు, చర్చలు..కొల్లలుగా…
ఉద్దరించటానికి..సమాచార సేకరణ అంటే
వారి వ్యక్తిగత స్వేచ్ఛ హరించటమేనని
ఏలికల…నాలుక..మడతవేసిన..వాదన

రాజ్యంలో జన్మించిన…పౌరురాలైనందుకు
వారికి కనీస సౌకర్యాలు కరువే
పసలేని ప్రభుత్వాల ముచ్చట ఏమైనా

ఆ రెండు లాలించే చేతులకే మొక్కాలి
కనీ పెంచి, పెద్దచేసి, కష్టించి కాపాడి
తోడై నీడై..తానై నిలిచిన..నిలుస్తున్న
తల్లులకు..తలవంచి దండాలు!!!
(కొద్దిరోజుల్లో స్విట్జర్లాండ్‌లోని జెనివాలో అంతర్జాతీయ కార్మిక సంఘం 100వ సదస్సు జరుగనుంది. దాన్లోనైనా వారి సంక్షేమంకై ఉపయుక్తమైన చట్టం చెయ్యాలని ఆశిస్తూ  పేపర్‌లో ఆర్టికల్‌ని చూసి బాధగా…

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.