– శైలజామిత్ర
అమ్మాయి పుడితే ఆడపిల్ల అంటారు
పుట్టిననాడే ఆ పేరులో ఒక ప్రశ్నే..,
యుక్త వయసును జాగత్త్రంటూ దాచిపెడతారు
పప్రంచాన్ని చూడనీయక ఆ వయసంతా ఒక ప్రశ్నే…,
పెళ్లయింది మొదలు కోడలు కూతురవు తుందా? అంటారు
మెట్టినింట ఆ మాటతో ఒక ప్రశ్నే…
మాతృత్వంలోనే వుంది ఆడజన్మ సార్దకం అంటారు
కన్ననాటినుండి అన్ని సుఖాలకు ఒక ప్రశ్నే…
కళ్ళుమూసుకుపోయి మగడు మరొక ఆడదానితో తిరిగితే
మగడి నుండి మమకారం ఒక ప్రశ్నే…,
కట్నకానుకల పోరాటంలో కన్నకలలన్నీ ఒక ప్రశ్నే…,
విధి వకించి ఒంటరిదయితే
మొత్తం సమాజానికే ఒక ప్రశ్న…,
కామాంధుల చేతికి చిక్కితే
ఎంతటి సుశీల అయినా శీలం ఒక ప్రశ్నే..,
అసూయ స్వార్దం చేతిలో చిక్కితే
ఎంతటి వ్యక్తిత్వం ఉన్నా
నిందారోపణలతో
జీవితమే ఒక ప్రశ్న..,