రేణుక అయోలా
వార్త చిన్నదే ”చెత్త కుప్పలో ఆడపిల్ల శవం”
నా ప్రతిబింబమే నాకు ఎదురైనట్లు భావన
నా అడుగులు నావైపే నడచినట్లు అలికిడి..
మూగిన జనాల్ని చెల్లాచెదురుచేసి చేస్తే
నిర్జీవ ప్రతిబింబం ఆ చెత్తకుండిలో, కుళ్ళుకాల్వలో –
పురుగులతో, చీమలతో శవంపైన చీకటి
నీడలా పాకుతూ మింగేస్తోంది
ఇలాంటి మృత్యువు నడకని ఆపేయగలుగుతున్నామా!?
మనల్ని మనమే గొంతుపిసికి చంపుకుంటున్నామా?
ఎక్కడో పునర్నిర్మించుకున్న మనుగడదశ దాటి
అడుగు వెనక్కి పడుతోందా?
కన్నీళ్ళ శిథిలాలు ఎక్కి మొండిగా కూర్చుని
నిలబడేవున్నామని
అన్నింటిని లోలోపలనే జీర్ణం చేసుకుంటూ
అందరి నడుంచుట్టూ చెయ్యివేసి నడుస్తూనే వున్నాం.
ఇవేమిటీ ఇన్ని మూఖాలు
వీళ్ళంతా మనవాళ్ళేనా?
మరి ఇలా ఈ ఆడపిల్ల ఇక్కడెందుకుంది!?
ముసుగులు వేసుకున్న ముఖాలని
ఇన్నాళ్లూ నమ్మామని
ఒకవైపు దుఃఖం సుడులు తిరుగుతుంటే-
అప్పుడే నిజం తెలిసినంత ఆశ్చర్యం… విభ్రమం!!
ఇవన్నీ అబద్ధాలు అనుకుంటే గుండెమంట చల్లారుతుంది
కాలికి చక్రాలుకట్టీ కుటుంబాన్ని సహనంతో మోసే
అదృష్టంలాంటి ”ఆడపిల్ల” నాది అనుకుంటే
ఏ హాస్పటల్లోనో గర్భంలో విచ్చుకుంటున్న మొగ్గ
ఇలా రోడ్డుదారి పట్టదు కదా…!
మట్టిలోంచి మొలుచుకొచ్చిన మొలకలని
గుండెకి హత్తుకుని నీరుపోసినట్లు
ఆడపిల్లని ఒడిలోకి చేర్చుకోవాలి
సమయం శాసిస్తుంది.
శాసనాల మధ్యలో కాలం ఓడిపోతుంది
గెలుపు ఓటమి
ఏమీ సాధించలేని దిగులుని మిగులుస్తుంది
విషాదానికి విరుగుడు
”ఆడపిల్లని కాపాడుకుందాం”
నినాదం కాదు
ఎన్నో తుఫానుల తరువాత వెలిసిన
ఇంద్రధనుస్సులాంటిది.
లోకాన్ని జయించినట్లు నడవాలి
మనల్ని మనం కాపాడుకోవడానికి
వెనకాల వచ్చే ఎన్నో స్వరాలకు జవాబుగా!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags