మహిళలకు చేయూతగా-గ్యాప్సన్‌ ఆర్ట్స్‌

గీతా శివరాం
గ్రామీణ బలహీన వర్గాల స్త్రీలకు ఆర్థికంగా అండదండలిస్తూ, ఇటు యువతరాన్ని కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది తంజావూరు చిత్రకళ. ఈ చిత్రాల విలువ ఆర్టు మార్కెట్టులో లక్షల్లో వుంటుంది. ఎందుకంటే ఇరవై నాల్గు క్యారెట్ల బంగారం, వజ్రాలు, విలువైన పచ్చ కెంపులలో పొదిగిన చిత్రాలు చూపరులకు ఎంతగానో ఆకర్షిస్తాయి. శ్రీ భారత, భాగవత, రామాయణ చిత్రాల ఇతిహాసాలు, భగవంతుని రూపురేఖలను ఎంతో శ్రద్ధాభక్తులతో రూపొందించిన చిత్రాలివి.
16వ శతాబ్దపు చిత్రకళ పుట్టింది, గుడి గోడలపై పెరిగింది తంజావూరులో. క్రమేపి చెన్నయ్‌ పట్నం చేరి మరింత రూపురేఖలు దిద్దుకుని ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. ఒక్కసారిగా కనుమరుగయ్యిందని అనుకుంటున్న క్షణంలో గ్యాన్సను ఆర్ట్సు కళాబ్రహ్మ శ్రీ గంజి వినోద్‌ కుమార్‌, శ్రీమతి సువర్ణకుమారి, డా. వాసవి, చి|| సంతోష్‌ సభ్యులు ఈ తంజావూరు చిత్రకళను పెంచి పోషించడం నిజంగా ఓ శుభసూచకంగా చెప్పుకోవచ్చును.
అలసిన హృదయాలను సేద తీర్చి అలరించే తంజావూరు చిత్రకళ కంటికి ఆనందాన్నివ్వడమే కాదు, పేదవారి ఆకలి కూడా తీర్చటం ఆసక్తిదాయకంగా ఉంది. సాంప్రదాయపు తంజావూరు కళలో మౌలిక శిక్షణనిచ్చి చేసేపనిని బట్టి పీసు రేటును నిర్ణయించి ఇస్తారు. ఈ విధంగా నెలకు  6-7 వేల వరకు సంపాదించవచ్చు తీరికవేళల్లో ఈ కళను చేపట్టినవారు. జీవనాధారంగా చేపట్టినవారు 10-15 వేల వరకూ కూడా సంపాదిస్తున్నారు. అంగవికలురకు, మానసిక వికలాంగులకు సైతం, ప్రత్యేక బోధనా పద్ధతిలో ఎంతో శ్రద్ధతో తంజావూరు చిత్రకళను నేర్పించడం ఇక్కడి ప్రత్యేకత. మహిళల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను, వారిలోని విలక్షణమైన అభిరుచులను బైటకు తీయడమే మా లక్ష్యం అంటున్నారు కళాతపస్వి డా. వాసవి ఫైనాన్సు డైరెక్టర్‌ భూమికతో మాట్లాడుతూ-
ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద తంజావూరు చిత్రకళా ఆర్టు గ్యాలరీ గ్యాప్సన్‌ ఆర్ట్సు ఒక్కటే. ఇక్కడ 650 వివిధ కళాకృతులు, మూడువేలకు పైగా తంజావూరు చిత్రాలు కొలువుతీరి ఉన్నాయి. ఈ ఆర్టు గ్యాలరీని ఎంతో వ్యయప్రయాసలకోర్చి కళాబ్రహ్మ వినోద్‌ కుమార్‌ నిర్మించడం ఎంతో గర్వించ దగిన విషయం. ప్రముఖ కళాకారులు కలసి నెలకొల్పిన ఏకైక సంస్థ గ్యాప్సన్‌ ఆర్ట్సు.
ప్రొద్దున్నే 10.30 ని||ల నుండి సాయంత్రం 7 గం||ల వరకు ప్రతిరోజూ సందర్శకులతో, కళాప్రియులతో విదేశీ కళాభిమానులతో, కళకళలాడుతూ ఉంటుంది. అన్ని వర్గాల వారికీ, అందరికీ ఆహ్వానం పలుకుతోందీ సంస్థ. ఇతర రాష్ట్రాలైన ఒడిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక నుండీ కూడా యువత విచ్చేసి విద్యనభ్యసించడం విశేషం. గ్యాప్సన్‌ ఆర్ట్సుతో తంజావూరు విభాగంలో వందకుపైగా మహిళలు, త్రెడ్‌ ఎంబ్రాయిడరీలో యాభైమంది, గ్రీటింగ్‌ కార్డు విభాగంలో, ఇంకా పెయింటింగ్‌ విభాగంలోనూ, పట చిత్ర, మినియేచర్‌, మ్యూరల్‌ వర్కు, మధుబని, 650 రకాల కళాకృతులను ప్రాక్టీసు చేస్తున్నారు. బంగారు చిత్రాలు దీపాల కాంతిలో ధగధగా మెరిసిపోతూ ముక్కోటి దేవతలు గ్యాన్సన్‌ ఆర్ట్సు గ్యాలరీకి విచ్చేసినట్లుంటుంది. దేవుడు సృష్టించిన మనుషులు, దేవుడి రూపాన్ని మదిలో తలచుకుంటూ, భగవంతుని రూపురేఖల్ని తమకుంచెతో అందంగా అద్దుతున్న మహిళామణులు, యువతీ యువకులు ధన్యజీవులు.
రాష్ట్రంలోని గ్రామ గ్రామాలకు తంజావూరు చిత్రకళను వ్యాప్తి చేసేనిమిత్తమై గ్రామీణ మహిళలకూ చేయూతగా నిచ్చే ఆలోచన కూడా ఉందని చెప్పారు డా. వాసవి భూమిక ప్రతినిధితో. కళల్ని మనం పోషిస్తే కళలు మనల్ని పోషిస్తాయి అన్న మాటల్ని నిజం చేసి చూపించారు. గ్యాన్సన ఆర్ట్సు అధినేత కళాబ్రహ్మ. తంజావూరు చిత్రాలను అభ్యసించడానికి విచ్చేసే డాక్టర్లు ఒత్తిడి నుంచీ రూపుమాపే దివ్య ఔషధంగా కొనియాడుతున్నారు. ఇంజనీరు మహిళలు కాలక్షేపంగా ఉందంటే, గ్రామీణ మహిళలు భక్తి, ముక్తి, భుక్తి కూడా తంజావూరు చిత్రాల ద్వారా పొందుతున్నాం అంటున్నారు. ఆర్టు గ్యాలరీకి వచ్చి పరిశీలిస్తే, కాలక్షేపం కోసం చిత్రకారులుగా మారిన మహిళలు మనకెందరో కనిపిస్తారు. వీరు చిత్రకారులుగా మారడానికి ఏమీ ఖర్చు కాలేదన్న విషయం మీకే తెలుస్తుంది. కావలసిందల్లా ఓర్పు, నేర్పు, సమయం మాత్రమే అంటున్న డా. యస్‌. వాసవి మాటలు అక్షర సత్యాలు. గ్యాన్సన్‌ ఆర్ట్సు నూతన సంవత్సరంలో ఇంకా ఎందరికో చేయూతనిస్తూ ముందడుగు వేస్తూ భూమిక పాఠకులకు వివరించారు గ్యాన్సన్‌ ఆర్ట్సు ఫైనాన్సు డైరెక్టర్‌   డా.యస్‌. వాసవి.
మీరూ తంజావూరు చిత్రాలు చిత్రీకరించడంలో శిక్షణ పొందాలంటే సంప్రదించండి- 040-27730147, సెల్‌ – 09966777733
తంజావూరు చిత్రాలను కొనండి, కళాకారులకు చేయూత నివ్వండి.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో