అడవుల్లోంచి పొలాల్లోకి

కొడవంటిగంటి  రోహిణిప్రసాద్‌
తెలుగు సమాజంలో 21 వ శతాబ్దంలో కూడా శాస్త్రీయ దృక్పథం సమగ్రంగా, సవ్యంగా వ్యక్తం కావడం లేదు. ప్రకృతి పట్ల, సమాజం పట్ల, మనిషిపట్ల ఉండవలసిన హేతుబద్ద, భౌతికవాద, శాస్త్రీయ ఆలోచనలు చాలామందిలో ఉండడం లేదు. ప్రాథమిక స్థాయి నుంచి శాస్త్ర విజ్ఞానం పాఠ్యాంశాలు ఉంటున్నప్పటికీ, చదువుకున్న వారిలో కూడా శాస్త్రీయ భావాలు అలవడాల్సినంతగా అలవడడం లేదు. ఈ స్థితిలో సమాజంలో శాస్త్రీయ భావాలు వ్యాప్తి చెందాలంటే ప్రకృతి రహస్యాలను గురించి, సమాజం పరిణామం గురించి రోజు రోజుకు విస్తరిస్తున్న సమాచార సంపదను సూటిగా, సరళంగా వివరించే పుస్తకాలు కావాలి. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చేందుకే కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌గారు సామాన్య జనానికి కూడా అర్థమయ్యే చక్కటి భాషలో అనేక వ్యాసాలు రాసారు. ఆ వ్యాసాలన్నీ ”అందరిదీ విజ్ఞానం” అనే పుస్తక మాలికగా వచ్చాయి.
కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌ అణు భౌతిక శాస్త్రంలో డాక్టరేట్‌ చేసి ముంబైలోని బాబా అణుపరిశోధనా కేంద్రంలో అణుధార్మిక శాస్త్రవేత్తగా పనిచేశారు. కొంత కాలంగా అమెరికాలోని అట్లాంటాలో కన్సల్టెంట్‌గా ఉన్నారు. ఆయన శాస్త్రీయ సంగీతంలో విశేష జ్ఞానం కలిగిన ప్రతిభాశాలి. సితార్‌ వాయించడలో నిష్ణాతుడు. అమెరికాలోనూ, ముంబైలోనూ తన సితార్‌ కార్యక్రమాలతో అశేష ప్రజానీకాన్ని అలరించి అబ్బురపరిచారు.
కొంతకాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడి 8.9.2012 నాడు తుది శ్వాస విడిచారు. ఆయనకు నివాళి అర్పిస్తూ ఆయన రచించిన ఒక వ్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

గత అయిదారువేల ఏళ్ళుగా వివిధ దేశాల్లో జరిగిన చారిత్రాత్మక మార్పులన్నిటికీ పునాది అతి ప్రాచీనకాలంలోనే కనిపిస్తుంది. మనం ప్రాచీన నాగరికతలుగా భావిస్తున్నవన్నీ అంతకు ముందు నుంచీ ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ‘అటవిక’ ప్రజలు సాధించిన విజయాలే. నేటి పాలస్తీనాలోని జెరికో క్రీ.పూ 9000 నుంచీ నగరవాసులకు నివాస స్థలంగా ఉండేదట. అప్పటికీ ప్రపంచంలో దాన్ని పోలినవేవీ ఉండేవికావు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇలా జరగడానికి కారణాలేమిటో పరిశోధకులు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఇలా ముందు వెనకలుగా జరిగిన సాంగికపరిణామాలే తరువాతి చరిత్ర గతిని మార్చేశాయి. 80,90 వేల సంవత్సరాలుగా గుహాల్లో ఉంటూ, వేటాడుతూ బతికిన ఆది మానవులు నాగరికతను సాధించారంటే అందుకు ముఖ్య కారణం వ్యవసాయం చేపట్టడమే. మునుపటి జీవితంతో పోలిస్తే వ్యవసాయం వారు కనిపెట్టిన అద్భుతమైన విజ్ఞానంలా అనిపిస్తుంది. పంటలు పండించడమనేది పొట్టనింపుకునే ప్రయత్నంగానే మొదలైనప్పటికీ దానివల్ల కలిగిన దీర్షకాలిక ప్రభావాలు అంతా ఇంతా కాదు.
వేటాడడం కంటే పంటలు పండించి ఆహారం సంపాదించడం ‘నాగరిక’ లక్షణంలా కనిపిస్తుంది. వేటాడి, ఏరుకుతినే ప్రజలు ఒక చోట స్థిరంగా ఉండలేరు. వన్యమృగాలను అనుసరిస్తూ అడవుల్లో పెరిగే కాయగూరలూ, దుంపలూ, పళ్ళూ గింజలూ మొదలైనవన్నీ వెతుక్కుని ఏరుకుతింటూ కాలం గడుపుతారు. వారి జనాభా త్వరగా పెరగదు. ఎందుకంటే ఎక్కువ విశ్రాంతి ఉండదు కనుక మొదటి సంతానం నడక నేర్చినదాకా స్త్రీలు మలికాన్పుకు ప్రయత్నించరు. వ్యవసాయం చేసుకు బతికే జనాభా సంచార జీవితం గడపలేదు. ఒక చోట స్థిరనివాసానికి అలవాటుపడ్డ మానవ సముదాయాల్లో పిల్లలు త్వరగా పుట్టుకురావడం, జనాభా పెరిగిపోవడం జరుగుతుంది. పంటలు పండిస్తే ఎకరం నేలలో ఏరుకు తినేవారితో పోలిస్తే 10 నుంచి 100 రెట్లమందికి సులువుగా జరిగిపోతుంది. నాట్లు వేసి గింజలు పండించడంతో పాటు ఇలాంటి ప్రజలు జంతువులను మచ్చిక వేసి మందలుగా పెంచడం, కూరగాయలూ, పళ్ళూ వగౖైెరాలు సాగుచెయ్యడం మొదలైనవికూడా చేస్తారు. గొడ్డు, గోదా ఉన్న చోట ఎరువులూ, పాడి, తోళ్ళూ, ఉన్నీ మొదలైనవికూడా లభిస్తాయి. కనుక ప్రజలకు చాలా రకాల అవసరాలు తీరుతాయి.
పత్తీ, జనుమూ మొదలైన పంటలద్వారా కట్టుకునేందుకు బట్టలు తయారౌతాయి. తాత్కాలిక అవసరాలకు మించి ఆహారం ఉత్పత్తి కావడంతో దాన్ని నిలువుంచుకునేందుకు వీలవుతుంది. వ్యవసాయం మొదలవని యుగానికి చెందిన కొన్ని ఆరాధనాస్థలాల ఆనవాళ్ళు కనబడ్డాయనేది నిజమైనప్పటికీ, శ్రమవిభజన కారణంగా సమాజంలో వర్గాలు ఏర్పడి, పూజలూ, తంతులూ జరిపేవారూ, పెత్తనం చేసే నాయకులూ, వారి చెప్పుచేతల్లో మెలిగే సైన్యమూ ఇలా ఆధునిక నాగరికతలో వుండే సుగుణాలూ, ఆవలక్షణాలూ అన్నీ స్థిర నివాస జీవితంలో మొదలౌతాయి. నిలకడ లేకుండా చెట్లూ, తుప్పలవెంట తిరిగే ద్రిమ్మరి జీవితానికి, దీనికీ పోలికే ఉండదు.
1991 లో ఆల్ప్స్‌ మంచుకొండల్లో 5300 సంవత్సరాల క్రితం చచ్చిపోయిన ఒక వ్యక్తి శరీరం దొరికింది. కుళ్ళిపోకుండా ఇన్నేళ్ళూ మంచులో భద్రంగా ఉండిపోయిన ఆ వ్యక్తి ధరించిన బట్టలూ, బాణాలూ, గొడ్డలివంటి  ఆయుధాలూ, పనిముట్లూ అన్నీ దొరికాయి. ఆ వివరాలన్నీ లోహాలూ వగైరాల గురించి తెలియని కాలంలో మనుషులు ఎలా బతికేవారో ఇన్నాళ్ళుగా పరిశోధకులు ప్రతిపాదించినట్టే ఉన్నాయి. వాటివల్ల ఎంతో విలువైన సమాచారం లభించింది. అలాగే స్కాట్లండ్‌ మొదలైన ప్రాంతాల్లో అయిదు వేల  క్రితం రాతి గృహాల్లో వ్యవసాయం చేసుకునే మనుషులు నివసించిన సాక్ష్యాలు లభించాయి. ఇటువంటి ఆధారాలతో శాస్త్రవేత్తలు ప్రాచీన మానవుల జీవితాల గురించి చెప్పగులుగుతారు.
వేటా, వ్యవసాయం అనేవి రెండూ ఒకదానితో ఒకటి సంబంధం లేని విభిన్న జీవనశైలులుగా అనిపిస్తాయి. కాని అది పూర్తిగా నిజంకాదు. చేపలువంటివి పుష్కలంగా దొరికే వాయవ్య అమెరికాలోని పసిఫిక్‌ తీర ప్రాంతాలవంటి ప్రదేశాల్లోని ప్రజలు తిరుగుతూ ఉండవలసిరాలేదు. అలాగని వారు ఆహారాన్ని పండించనూ లేదు. అసలు మొదట్లో వేటాడి పొట్టపోసుకున్న మనుషులు ఆ పని ఎందుకు మానుకోవలసివచ్చింది?
ఒక్క అమెరికా తప్ప తక్కిన భూభాగాలన్నిటినీ మనుషులు 30, 40 వేల ఏళ్ళ క్రితమే ఆక్రమించేశారు. అప్పటి జంతువుల అవశేషాలనుబట్టి చూస్తే మనుషులు కాలుపెట్టిన చోటల్లా పెద్ద  జంతువులన్నీ అంతరించిపోయాయని తెలుస్తుంది. ఆఫ్రికావంటి ప్రాంతాల్లో లక్షల ఏళ్ళనుంచీ మనుషులు నివసించడం ప్రారంభించారు. అందుచే మనుషులకు వేటలో అంతగా నైపుణ్యం అలవడని దశలో జంతువులుకూడా వారికి దూరంగా మసలడం నేర్చుకుని ప్రాణాలు దక్కించుకోగలిగాయి. ఆస్ట్రేలియా తదితర ప్రాంతాలకు వలస పోయిన మనుషులు అప్పటికే వేటలో ఆరితేరి ఉండడంతో అక్కడి ప్రాణులు వారి ఆయుధాలు బారిన పడకతప్పలేదు. క్రీస్తుకు 12 వేల సంవత్సరాల క్రితం అమెరికాఖండాల్లోనూ అదే జరిగింది.
మొత్తం మీద మనుషుల వేట చాలా జంతువులకు ప్రాణసంకటం అయిపోయింది. జనాభా పెరగడం, వన్యప్రాంతాల్లో తగిన ఆహారం అక్కడక్కడా తగ్గిపోవడంతో అప్పటి ప్రజలు మనుగడకై రకరకాల పద్ధతులు అవలంభింకతప్పలేదు. ఇది ఆకస్మాత్తుగా విప్లవంలాగాకాకుండా స్థానిక అవసరాలనిబట్టి నెమ్మదిగా జరిగిన మార్పు. ఆహారం సంపాదించే మార్గాలూ, నివసించే పద్ధతులూ అన్నీ పరిస్థితిని బట్టి మారిన సందర్భాలున్నాయి. తరువాతి దశలలో వ్యవసాయం మొదలైన పాలస్తీనాలోనూ, దక్షిణ అమెరికాలోని పెరూలోనూ, జపాన్‌ తదితర ప్రాంతాల్లోనూ వేటాడే దశలో ఉండిన ప్రజలు కూడా స్థిరనివాసాలు ఏర్పరుచుకున్నారు.
మరొకవంక న్యూగినీ వంటి ప్రదేశాల్లో కొన్ని తెగలు అరటి, బొప్పాయి వంటి మొక్కలను నాటి, అవి పెరిగే లోపున వెళ్ళి వేటాడుతూ జీవించేవారు. అలాగే అమెరికాలోని కొన్ని ఇండియన్‌ తెగలు వేసవిలో వ్యవసాయం చేపట్టి, చలికాలంలో  వేటకు పోయేవారు. పూర్తిగా వ్యవసాయంలోకి దిగని తరుణంలో మనుషులు తమకు పనికొచ్చే మొక్కలు పెరిగే చోట కలుపుమొక్కలవంటివాటిని పీకెయ్యడం, అవసరమైన మేరకు నీరు పారేలా చెయ్యడం, దుంపలు మళ్ళీ మొలకెత్తేలా చూడడంవంటి పనులు చేస్తూ ఆహారం సంపాదించేవారు.
వేటాడదగిన జంతువులు తగ్గిపోవడంతో కొన్ని ప్రాంతాలల్లోని ప్రజలకు తిండి కొరత ఏర్పడసాగింది. అందుచేత ప్రకృతి సిద్ధ్ధంగా దొరికే వనరులమీదనే ఆధారపడకుండా ఇతర పద్ధతులద్వారా ఆహారం సంపాదించడం మనుషులకు అలవాటయింది. తాము తిన్న గింజల, కాయగూరల విత్తనాలనుంచి మళ్ళీ మొక్కలు మొలకెత్తుతాయని వారు గమనించారు. మనుషులూ, జంతువులూ మలవిసర్జన చేసినప్పుడు బైటపడిన విత్తనాలకు ఎరువు కూడా లభించడంతో మొక్కలు మరింత బాగా పెరిగేవి. అలాగే జంతువుల్లో కొన్ని సాధువుగా ఉండేవి. ఇదంతా గమనించి ఆ సమాచారాన్ని ఇతరులకు అందించిన మనుషులకు ఈ ‘విజ్ఞానం’ ఎంతో లాభించింది.
అన్ని రకాల పంటలనూ బుద్ధి పూర్వకంగా వెయ్యడమూ, అన్ని రకాల జంతువులను మచ్చిక చెయ్యడమూ ఒకేసారిగా జరగలేదు. ఇవన్నీ ఎంతోకాలంపాటు నింపాదిగా క్రమంగా జరిగిన పరిణామాలు. కొందరు ఏదో ఒక స్థాయిలో వ్యవసాయం మొదలుపెట్టిన ప్రాంతాల్లోని దరిదాపుల్లోనే ఇతరులు కూడా ఉండి, వారిని గమనిస్తూ ఉండేవారు. ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడం అనేక సందర్భాల్లో జురిగింది. మొత్తం మీద ప్రజలందరూ పూర్తి  ఆటవిక జీవితంనుంచి బైటపడి వ్యవసాయం మీద ఆదారపడిన సంఘటనలు మొసపొటేమియావంటి కొన్ని ప్రాంతాల్లో పది, పదిన్నర వేల సంవత్సరాల క్రితమే మొదలయ్యాయి. మరొకవంక ఆస్ట్రేలియావంటి ప్రాంతాల్లోని ఆదిమతెగలు ఇప్పటికీ వ్యవసాయం జోలికి పోకుండా బతుకుతున్నాయి. నేటి సమాజపు అసమానతకు ఇంతకన్నా మంచి నిదర్శనం దొరకదు.(‘మానవ పరిణామం’ నుండి)

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.