డి. అరుణ
పక్కదాని పట్టించే జెండర్ స్పృహ ప్రమాదకరమని, ఇటీవలి కాలంలో జెండర్ స్పృహ ముసుగులో వస్తున్న క్రైం వార్తలు అటువంటివేనని జర్నలిస్ట, రచయిత్రి గీత అరవముదం స్పష్టం చేశారు. పాప్యులేషన్ ఫస్ట్ సంస్థ బెంగూళూరులో సెప్టెంబర్ 7,8 తేదీలలో నిర్వహించిన జెండర్ అండ్ మీడియా వర్క్‌షాప్‌లో ఆమె ప్రధానోపన్యాసం చేశారు.లాడ్లీ మీడియా అవార్డుల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ని కో ఆర్డినేట్ చేస్తున్న భూమిక ఎంపిక చేసిన ఆరుగురు మహిళా జర్నలిస్ట్‌లు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.
హెచ్‌మ్‌టివి నేను, సూర్యపత్రిక నుండి అరుణ, వనితా ఛానల్ నుండి లిల్లీరాణి, దీప్తి, సాక్షి నుంచి మంజరి ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఇటువంటి వార్తల ఫలితంగా బాధితులైన మహిళలు మరింత వేదనకు గురవుతున్నారని, ఒక రకంగా ఇది పితృస్వామిక వ్యవస్థలు మహిళలపై నిర్భంధాలను విధించేందుకు మిషగా వాడుకుంటున్నాయని ఆమె అన్నారు. దేశం ఇంత పురోగతి చెందుతున్నప్పటికీ కుటుంబంలో మహిళ స్థానం, ఆమె కనే బిడ్డ పైనే ఆధారపడి ఉండటం విషాదకరమన్నారు. ఇటువంటి పరిస్థితులో ఆడపిల్లను కని ఆమెను కూడా బాధపెట్టడమెందుకని తల్లులు ప్రశ్నిస్తున్నారని, సమాజం దీని గురించి ఆలోచించాలని గీత అన్నారు.
జెండర్ అంశాన్ని అంశాన్ని ఇతర విషయాలనుంచి వేరు చేసి చూడరాదని, దీనిని దారిద్య్రం, అక్షరాస్యత, ఉపాధి తదితర అంశాలతో అనుసంధానం చేసి చూసినపుడే దానికి ప్రాధాన్యత పెరుగుతుందని కర్నాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి మదన్ గోపాల్ చెప్పారు. వర్క్‌షాప్‌లో అయిన ముఖ్య ఆతిధిగా పాల్గొని ప్రసంగించారు. క్షేత్ర స్థాయి నాయకుల నుండి పై వరకు జెండర్ స్పృహను కలిగించే ప్రయత్నం జరగాలన్నారు. గర్భధారణ సమయంలో మహిళ 9 నుంచి 10 కిలోల బరువు పెరగాల్సి వుండగా భారతదేశంలో అది 2-3 కిలోలు మాత్రమే పెరుగుతున్నారని, ఫలితంగా పుడుతున్న శిశువులు బరువు తక్కువగా ఉంటున్నారని చెప్పారు. ఇదంతా కుటుంబంలో మహిళ పట్ల ఉండే వివక్షే కారణమన్నారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాలలో, దిగువ మధ్యతరగతి మధ్య తరగతి కుటుంబాలలో కూడా ఇది కనిపిస్తుందన్నారు. కనుక, దీనిని సమగ్రంగా పరిశీలించి పరిష్కరించే యత్నం చేయాలని మదనగోపాల్ అభిప్రాయపడ్డారు. మీడియాకు కూడా ఇందులో సానుకూల పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. మీడియా ఇటువంటి అంశాల పట్ల ప్రజలలో చైతన్యం తీసుకువచ్చే కథనాలను ప్రచురించవచ్చని సూచించారు.
2001-11మధ్యకాలంలో 12 మిలియన్ల ఆడపిండాల, పిల్లల (ఆడపిల్లలు) జరిగాయని చెప్పారు. ఆడపిల్లల హత్యలకు సంబంధించిన వార్తలను సంచలనాత్మకంగా ప్రచురించిన మీడియా-పాలోఅప్ కథనాలు ఇవ్వలేదని పట్టి చూపారు. జెండర్ స్పృహ విషయంలో సమాజ వైఖరిలో మార్పు రావాల్సిన అవసరముందన్నారు.
గర్భస్రావమనేది జెండర్, మానవ హక్కులకు సంబంధించిన అంశమని మేధాగాంధీ, వినోజ్ మానింగ్ అన్నారు. గర్భస్రావం, లింగ ఎంపిక అన్న అంశంపై వారు ప్రసంగించారు. ప్రమాదానికి దారితీసే విధంగా, జరిగే అరక్షిత గర్భస్రావాలు ప్రపంచవ్యాప్తంగా విషాదమన్నారు. సరైన ప్రత్యామ్నాయం లేక నిమిషానికి 40 మంది మహిళలు ఇటువంటి గర్భస్రావాలు చేయించుకుంటున్నారు. అర్హత లేనివారి వద్ద ఇటువంటి గర్భస్రావాలు చేయించుకుంటున్న కారణంగా శాశ్వతంగా గాయపడుతున్నారని, ఫలితంగా వారి పునరుత్పత్తి సామర్ధ్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశముందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంవత్సరానికి దాదాపు 67 వేలమంది నిరుపేద మహిళలు మరణిస్తున్నారని చెప్పారు. ఈ మహిళలు వారి కుటుంబాలలో కీలకమైన వారని వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరముందున్నారు. ప్రపంచ స్థిరత్వానికి, ఆరోగ్యకరమైన జనాభాకోసం మహిళల స్థితిగతులను మెరుగు పరచాలన్నారు. దేశంలో దాదాపు 53% మంది, మహిళలు మాత్రలు, మసాజ్‌ల వంటి పద్ధతుల ద్వారా గర్భస్రావం చేయించుకుంటున్నారని చెప్పారు. దాదాపు 41% మంది సరైన అర్హత లేని వ్యక్తుల వద్దకు వెళ్ళగా, 15 % మంది రెండవసారి వెళ్ళారని, 12 % మంది ఆసుపత్రులకు, 3% మంది ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను దర్శించారని తమ సర్వేలో తేలిందని వారు వివరించారు. కనుక, గర్భస్రావం విషయంలో మహిళల్లో చైతన్యం పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
సమాన అవకాశాలు ఇవ్వడంద్వారా మాత్రమే మహిళ సాధికారత సాధించడం సాధ్యంకాదని, ఫలితాలు కూడా సమానంగా ఉండేలా చూసినప్పుడే విధానాలు విజయవంతం అవుతాయని సరోజిని గంజు ఠాకూర్ అభిప్రాయపడ్డారు. జెండర్ రెస్పాన్సివ్ బడ్జెట్స్ అన్న అంశంపై ఆమె ప్రసంగించారు. ఈ తేడాలను అర్థం చేసుకోవడం కీలకమన్నారు.
1961లో 1000 మంది మగశిశువులకు 976 మంది ఆడ శిశువులుండగా, 2011నాటికి ఆడశిశువులు సంఖ్య 914కు పడి పోయిందని, ఇది ఆందోళన కలి గించే అంశమని ఆమె చెప్పారు. గర్భస్రావం చేయించుకోవడం మహిళ హ్కని అయితే లింగ ఎంపిక గర్భస్రావాలు ఖండించడం ద్వారా గర్భస్రావ హక్కుని తక్కువ చేయకూడదన్నారు. పితృస్వామిక హద్దులను దాటి మహిళలు తమ హక్కులను సాదించుకున్నప్పుడు లింగ ఎంపిక గర్భస్రావాల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. లింగ ఎంపిక సందర్భంలో కూడా గర్భస్రావం చేయించుకునేది మహిళే కనుక నింద ఆమెపై వేయడం జరుగుతోందని, వీరులు, శూరులైన కుమారులకు తల్లిగా కీర్తించడం ద్వారా ఆమెను భ్రమలలోకి నెట్టడం జరుగుతోందన్నారు. కొడుకుని కనేందుకు అనేక సాకులు, సమర్థింపులు చూపేటప్పుడు ఆడపిల్లలను కనేటప్పుడు వాటిని ఎందుకు ప్రస్తావించరని ఆమె ప్రశ్నించారు.
వర్క్‌షాప్‌లో డా. మాయా ఓల్గా, నూపుర్‌బసు, డా. గీతా ప్యానెల్ గార్లు పాల్గొన్నారు. ‘మహిళల హక్కులు; అవసరాల పట్ల మన సేవా వ్యవస్థలు ఎంత సున్నితంగా ఉంటున్నాయి, స్పందిస్తున్నాయి’ అనే అంశంపై వారుమాట్లాడారు. ‘పిసిపిఎన్‌డిటి చట్టం అమలు’ పై విమోచనకు చెందిన డోనాఫెర్నండెజ్ ప్రసంగించగా, ‘జెండర్ అండ్ మీడియా’ అన్న అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ శూంతల నరసింహన్ మాట్లాడారు.
ప్రధాన స్రవంతి మీడియాలో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో జండర్ స్పృహ పెరగాల్సిన అవసరం ఎంత వున్నదో, ముఖ్యంగా భాష విషయంలోను, దృశ్యాలను చూపించే తీరులోను పెనుమార్పులు చోటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుందని ఈ వర్క్‌షాప్‌కు వెళ్ళి వచ్చాక అనిపించింది. ఇలాంటి వర్క్‌షాప్ క్రితం సంవత్సరం భూమిక ఆధ్వర్యంలో జరిగింది. మరికొంత లోతుగా , ఎక్కువమంది మీడియా వ్యక్తుల్ని, ముఖ్యంగా క్రియేటివ్ హెడ్స్‌ని (సృజనాత్మక బుర్రల్ని) కలుపుకుంటూ చేస్తే ఆవుంటుందని భూమిక సత్యవతితో అంటే తప్పక చేద్దాం. ఇలాంటి వర్క్‌షాప్స్ మీడియాలో పనిచేసేవారికి చాలా అవసరమేనంటూ హామీ ఇచ్చారు. సో.. త్వరలోనే మరో మీడియా వర్క్‌షాప్ జరుగుతుందని ఆశిద్దాం. మంజుల్ భరద్వాజ్ ఓపెన్ డిస్కషన్‌తో వర్క్‌షాప్ ముగిసింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags