వేలూరి సుధారాణి
నాలుగేళ్ళనుంచి ప్రేమిస్తున్నానన్నాడని
నాలుగు లక్షలు కట్నం ఇచ్చి కట్టుకున్నాను వాడ్ని
పెళ్ళికి ముందు “సీతాకోకచిలుక “ అన్నవాడు
ఏడాది గడిచేసరికి “గొంగళి” పురుగు అన్నాడు
ప్రతినెలా వేల జీతం చేతిలో పెట్టినా,
వందల రాతుల్రు “సుఖాన్ని పంచినా,
ఇంకా ఏదో దాహం….
పసిబిడ్డకు పాలు ఇస్తున్న తల్లి స్తన్యంలో
కూడా ఆబగా దేనికో వెతుకులాట
వరకట్నంతో మొదలు మా బతుకంతా
పీల్చే రక్త పిపాసివాడు
మెటర్నటీ లీవు వేతనం లేకపోతే
అసలు గర్భమే వద్దనే పబ్రుద్దుడు వాడు
డబ్బు సంచుల కోసం పెళ్ళాం గర్భసంచినైనా
వ్యాపార వస్తువుగా మార్చేయగల సమర్ధుడు వాడు
స్కానింగులో ఆడపిల్లని తేలినప్పుడల్లా
ఒక్క ఒక్క అబార్షన్ “పిల్స్ ని” తినిపించగల ఘనుడు
యత నార్యంస్తు పూజ్యంతే రమంతే
తత దేవతా: అంటూనే…
బీరు సీసాలకి ఆమె, బీడి కట్టలపై ఆమె
ఎయిడ్స్ నిరోధానికి పచ్రార సాధనం ఆమె
విలాస వస్తువు, వ్యాపార పక్రటన ఆమె
కటి భాగంలో సిగరెట్ చురకలు
బూటు తన్నులతో కమిలిన శరీరం
ఆమె కనుకొలకుల్లోంచి కన్నీరు
మండుతున్న రెప్పల చిప్ప నుండి కుప్పలుగా రాలాయి
వాడి “విస్కీ” గ్లాసులోకి “ఐసు” వాటరుగా
అర్దేచా, కామేచా, నాతి చరామి అన్న మాటల్ని
ఆర్ధికేచా, కట్నేచా, “నాతిచెరా”మి అన్నాడు వీడు
మంచి పద్యం. చక్కని ప్రతీకలు, ఒక్క గొంగళిపురుగు మినహా. ఎందుకంటే అన్ని గొంగళీపురుగులూ
సీతాకోకచిలుకలు కాలేవు. (అలాగని నేను చిన్నప్పుడు విని, ఒక చాలా పేలవమైన ఇంగ్లీషు పద్యం
రాసాను. చెప్పుకుంటే సిగ్గు!)
ఫెమినిష్టు ధోరణిలో మగపురుగులని చీదరించుకోకండా ఎవరన్నా పద్యాలు రాస్తే చూడాలని ఉంది.
ముందు ముందు ఇంకా మంచి పద్యాలు రాస్తారని ఆసిస్తూ….
వేలూరి వేంకటేశ్వర రావు,
http://www.eemaaTa.com
నాతి చరామిబాగుంది