సరికొండ నరసింహ రాజు
రాలిన ఆకుల గూర్చి
చింతంచదు చెట్టు
రేపటి చిగురుకై
రేయింబవళ్ళు శ్రమిస్తుంది!
మరలి పోయిన అలకై
నీరసించదు సందం!
పోటెత్తే అలలతో
పొంగి పొంగి పొర్లుతుంది!
ఒక్క మొక్క మొలవనంతనే
కుంగిపోదు నేల
మొక్కవోని దీక్షతో
మొలకలెత్తి మోసులెత్తి
చిలుకలు వాలిన చెట్టౌతుంది!
రాలిన చినుకు గూర్చి
ఆలోచించదు ఆకాశం!
కరిగి… కరిగి… వానై..వాగై..
జలధారలు కురిపిస్తుంది!
జాలు వారిన కిరణాలకై
తపించరు సూర్యచందుల్రు
నిత్య నూతన పక్రాశమై
లోకానికి వెలుగు చీర బహూకరిస్తారు!
మరి మనిషేంటి…
ఒక్క అపజయంతోనే
అధ:పాతాళంలో తన్ను తాను పాతేసుకుంటాడు!!?