డా|| వాసా ప్రభావతి
హరిత చందనమై అరిగిపోతూ
చల్లగా పరిమళిస్తూ!
కన్నబిడ్డలనే కాదు
ఆత్మీయతానురాగాలకు
ఆలంబనమైన నీ గొంతు
ఏ స్వాప్నికులకైనా మేలుకొలుపే!
ఏ కోకిలగానానికైన ఆదర్శమే!
ఈ భౌతికలోకంలో నీ కాయకష్టాన్ని
ఏ హృదయ త్రాసులు తూచలేవు?
ఏ మానవ మనోనేతాల్రు గుర్తించలేవు!
నీ మనోఫలకాలపై చితిత్రమవుతున్న
జీవితానుభవ చితప్రటాలను
ఏ కెమెరాలు ఫొటోలు తియ్యలేవు?
కారే కన్నీటిని కంటిరెప్పలతో అప్పళిస్తూ
పొంగివచ్చే దుఃఖాన్ని మునిపళ్ళతో నొక్కుతూ!
తెచ్చుకున్న చిరునవ్వుతో
ఆత్మీయంగా పలకరించే శక్తీ, యుక్తీ నీదే!
మగడు కొట్టినా, తిట్టినా, ఈసడించినా,
పక్షిలా రెక్కలు చాచి కాపాడుకుంటూ
ఇంటిగుట్టును గడప దాటనీయక
కొంగుచాటున ముడివేసుకునే
నీ నైజానికి
మాసిన నీ ఆరుగజాల చీరకుచ్చెళ్ళు
ఆ కాటుక అంటె మరకల
ఆ పమిటకొంగే సాక్ష్యం!
నీ చేతిగోరుముద్దలు తిని
ఎందరు నాయకులు, కళాకారులు
శాస్త్రవేత్తలు, సాహితీమూర్తులు
పప్రంచపఖ్య్రాతులయ్యారో
లెక్కించలేవు!
ఈ ఇల్లు, ఈ వూరు, ఈ దేశం
ఎంత ఎదిగిపోతూన్న,
నాగరికత పెరిగి వికృత విన్యాసాలు చేస్తున్నా!
తుపాకులు, బాంబులు చేతపట్టి
మనిషి విలయతాండవం చేస్తున్నా!
చల్లని నీ ఒడిలో పెరగని వారెవ్వరు?
ఓ మహిళా! ఈ కళలన్నీ
నీ చేతి మునివేళ్ళ స్పర్శలతో.
పులకించి మారుమోగ్రుతున్నవే?
ఏ బంగారు ఆభరణాలు
ఏ ముత్యాలసరాలు
నీ హృదయసౌందర్యాన్ని విప్పి చూపగలవు?
నీ పీఠం ఆ నాలుగు గోడల మధ్యలో అయినా
ఈ నేలంతా నీ పారాణి పాదముదల్రే?
ఏ కళలోనైనా మారుమోగ్రేది
నీపాద మంజీరనాదాలె?
ఈనాడు నీ అలంకారం
నీ ఆత్మస్థైర్యమే?
ఇంటా, బయటా ఎదిగిపోతున్న నీకు
విచ్చిన కత్తుల్లా ఎదురొచ్చే
ఈ ఆంక్షలన్నీ వట్టి గడ్డిపోచలే!
ఇక ఈ రౌడీల రోడ్డు షోలన్నీ!
చెల్లాచెదరు కాకమానవు?
నీ వెనుక నీడలా,
బొమ్మవెనుక బొరుసులా
సుఖాల వెనుక కష్టాలు
కమ్ముకొచ్చే సమస్యలు
కాలచకభ్రమ్రణంలో
కదిలే నీ పాదాల కింద
నలిగి నశించక మానవు?
ఇకపై నడిపించేది నీచేతనవ్వం!
నడిచేది ఈ లోకం!
అమ్మా! నాన్నా అంటూ నోరారా పిలిచె
ఈ పిల్లలంతా నీవారె?
తీయని తెనుగును
ఉగ్గుపాలతో రంగరించి పోసే
తీయని మూర్తివి నువ్వు!
మాటలతో, పాటలతో
పరవశించె ఈ తెలుగు ఉద్యానవనం
కొమ్మలతో, రెమ్మలతో పులకించి
తెలుగు మహిళా విన్యాసంతో
రంగు రంగు పూలు పుష్పించి
తెలుగుభాషాపరిమళాలు
వాడవాగులా గుబాళింపక మానవు!