గృహహింస బాధితులకోసం నిర్వహించిన పబ్లిక్‌ హియరింగ్‌

కె. సత్యవతి

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు అంతర్జాతీయంగా స్త్రీల పరంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. నవంబరు 25ని స్త్రీల మీద హింసకు వ్యతిరేక దినంగా పాటిస్తే, డిసెంబరు 10 ని అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా జరపడం చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. దీనిని పదహారు రోజుల కార్యాచరణగా (16 రోజుల ఆక్టివిజమ్‌) కూడా పిలుస్తున్నారు. ఈ పదహారు రోజులు అంతర్జాతీయంగా స్త్రీల అంశాపై భిన్నమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి. స్త్రీల అంశాలమీద పనిచేసే వారంతా సమావేశాలు, సెమినార్లు, ర్యాలీలు, పబ్లిక్‌ హియరింగ్‌లాంటివి ఏర్పాటు చేస్తుంటారు.

ఈ పదహారు రోజుల కార్యాచరణలో భాగంగా భూమిక ప్రతి సంవత్సరం, ఆక్స్‌ఫామ్‌ ఇండియాతో కలిసి భిన్నమైన కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తోంది. క్రితం సంవత్సరం ‘స్వేచ్ఛ’ పేరుతో ఒక ర్యాలీని జరిపితే ఈ సంవత్సరం గృహహింస బాధిత స్త్రీలతో పబ్లిక్‌ హియరింగ్‌ కార్యక్రమాన్ని జరిపాం. డిసెంబర్‌ 5న తార్నాకాలోని సత్యోదయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం మహిళా కమీషన్‌, భూమిక, ఆక్స్‌ఫామ్‌ ఇండియా సంయుక్తంగా దీన్ని నిర్వహించాయి. గృహహింస నిరోధక చట్టం అమలు తీరు తెన్నులు, బాధిత స్త్రీలకు న్యాయం అందుతున్నదా లేదా? వారి వారి కేసులు ఎక్కడ? ఎందుకు ఆగిపోయి వున్నాయి వారికి అవసరమైన న్యాయసహాయం అందుతున్నదా? లేదా? వారికి కావలసిన కౌన్సిలింగ్‌, సలహా అందుతున్నాయా లాంటి అంశాలను దృష్టిిలో వుంచుకుని పబ్లిక్‌ హియరింగ్‌ జరిపాం.

విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి, లా కమీషన్‌ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ పి. వెంకటరామిరెడ్డిగారు, విశ్రాంత లోకాయుక్త, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామానుజంగార్లు పబ్లిక్‌ హియరింగ్‌కి ముఖ్య అతిధులుగా విచ్చేసారు. వివిధ రంగాలకు చెందినవారు జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించి ఆ రోజు 32 గృహహింస బాధిత స్త్రీల కథనాలను విన్నారు. ప్రముఖ రచయిత్రులు డా.కె.బి.లక్ష్మి, ఖరీ.కుప్పిలిపద్మ , హైకోర్టు న్యాయవాదులు శ్రీ విద్యాసాగర్‌ రెడ్డి, ఖరీ.శేషవేణి, ఐ.జి.సి.డి. శ్రీ ఉమాపతి, మహిళా కమీషన్‌ సెక్రటరీ ఖరీ.రాజ్యలక్ష్మి గార్లు జ్యూరీ మెంబర్లుగా వుండి బాధితులకు అవసరమైన కౌన్సిలింగ్‌, న్యాయసలహాలను అందించారు. ఈ కేసుల్ని ఎలా ముందుకు నడిపించాలనే అంశంమీద ఆయా సంస్థలకి సలహాలను, సూచనలను అందించారు.

భూమిక ఆధ్వర్యంలో నడిచిన ఈ పబ్లిక్‌ హియరింగ్‌లో గృహహింస చట్టం అమలులో ఎదురౌతున్న కష్టనష్టాలు, లోపాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తిస్థాయి, స్వతంత్రంగా పనిచేయగల రక్షణాధికారులు లేకపోవడం, వాళ్ళు కూడా జిల్లా కేంద్రాల్లో వుండటం, ఒక కేంద్రీకృత వ్యవస్థ రూపొందకపోవడం, రక్షణాధికారిగా వున్న ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరక్టర్‌ చాలా రకాల పనుల వొత్తిళ్ళలో వుండడం అనేవి గృహహింస చట్టం అమలులో ఎదురౌతున్న సవాళ్ళు. రక్షణాధికారుల కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు కౌన్సిలర్ల మీదే వాస్తవానికి పని బరువంతా పడుతోంది. వారికి సమయానికి జీతాలురాకపోవడం ట్రావెల్‌ అలవెన్సులు అందకపోవడంలాంటి సమస్యలు వున్నాయి. ఈ కౌన్సిలర్లకి భూమిక ఆధ్వర్యంలో జరిగిన రెండు శిక్షణా కార్యక్రమాలు తప్ప, శాఖాపరంగా ఎలాంటి శిక్షణా కార్యక్రమం జరగలేదు. చట్టం అమలు గురించి, పాటించాల్సిన విధి విధానాల గురించి, ఒకే పద్ధతిని రూపొందించి అందరు రక్షణాధికారులకు వివరించడం కూడా జరిగినట్టు కనబడదు. దీనివల్లనే రక్షణాధికారులు తమకు తోచిన విధంగా దీనిమీద పనిచేస్తున్నారు. బాధితురాలు తమవద్దకు వచ్చిన వెంటనే డి.ఐ.ఆర్‌ ఫైల్‌ చెయ్యకుండా కౌన్సిలింగ్‌ పేరుతో కాలయాపన చేస్తున్నట్టు కనబడుతోంది. ఈ అంశాన్ని పబ్లిక్‌ హియరింగ్‌లో చాలామంది లేవనెత్తారు. అలాగే చట్టంలో న్యాయవాదుల ప్రస్థావన లేకపోయినప్పటికీ నిందితులు డబ్బు ఖర్చుపెట్టి పేరున్న లాయర్లను పెట్టుకోవడంతో బాధితులు కూడా న్యాయవాదులను పెట్టుకోవాల్సిన స్థితిలోకి నెట్టెయబడుతున్నారు. నిజానికి స్త్రీలందరికీ ప్రభుత్వమే న్యాయవాదిని ఉచితంగా నియమించాలని లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఈ బాధ్యత తీసుకోవాలని చట్టం చెబుతున్నప్పటికీ వాస్తవంలో అలా జరగడం లేదు. దీనివల్ల కూడా బాధిత స్త్రీలకు న్యాయం అందడం లేదు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జస్టిస్‌ పి. వెంకటరామిరెడ్డి, జస్టిస్‌ రామానుజంగార్లు పదే పదే ఈ అంశాన్ని నొక్కి చెప్పారు. 32 కేసుల్ని విని బాధితులకి అవసరమైన సలహాలను, సూచనలను ఇచ్చిన జ్యూరీ సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

గృహహింస నిరోధక చట్టం అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో తొలిసారి, పూర్తిస్థాయిలో జరిగిన ఈ పబ్లిక్‌ హియరింగ్‌, ఈ చట్టం అమలులో ఎదురౌతున్న ఎన్నో సవాళ్ళను వెలుగులోకి తెచ్చింది. ఈ సవాళ్ళను, లోపాలను అధిగమించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకోవాల్సిన అవసరముందని ఈ కార్యక్రమం వెల్లడించింది. ఈ సమావేశానంతరం సంబంధిత శాఖకి పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది.

డిసెంబరు 5 వ తేదీని ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక ఉద్వేగ భరితమైన వాతావరణంలో, బాధితుల బాధల గాథల వ్యక్తీకరణల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఎంతోమంది బాధిత స్త్రీలు కన్నీళ్ళ పర్యంతమైనారు. తమ సహచరులుగా వుండాల్సిన తమ భర్తలు, అత్తింటివాళ్ళు తమను హింసిస్తున్న వైనాలను కన్నీళ్ళ మధ్య జ్యూరీ ముందు చెప్పుకున్నారు. న్యాయంకోసం ఆక్రోశించారు. గృహహింస నిరోధానికి చట్టం అమలులో వున్నప్పటికీ, పఠిష్టంగా అమలుకాకపోవడంవల్ల ఈ రోజు వేలాది స్త్రీలు మౌనంగా హింసను భరిస్తున్నారు. భరించలేని స్థితికి చేరినవాళ్ళు ఇలాంటి పబ్లిక్‌ హియరింగ్‌లాంటి వేదికల ముందు తమ సమస్యలను చెప్పుకోగలుగుతున్నారు.

గృహహింస నిరోధక చట్టం పఠిష్టంగా అమలు జరగాలని, బాధితులకు కావలసిన అన్ని సహాయలను అందుబాటులోకి తేవాలని, వారిని అన్ని సపోర్ట్‌ సిస్టమ్స్‌ ఎల్లవేళలా ఆదుకోవాలని ముఖ్య అతిధులు, జ్యూరీ సభ్యులు, బాధితులు ఆశాభావం వ్యక్తం చేసారు. ఆ దిశలో ప్రభుత్వానికి సూచనలు చేసారు. భూమిక హెల్ప్‌లైన్‌ బాధితులకు అండగా వుంటుందని, అవసరమైనప్పుడల్లా కాల్‌ చేయొచ్చని, సలహా పొందొచ్చని సత్యవతి హామీ ఇచ్చారు. ఆక్స్‌ఫామ్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ రంజన వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఆక్స్‌ఫామ్‌ ఇండియా, రీజనల్‌ మేనేజర్‌ శ్రీ అన్వర్‌ రోజంతా ఈ కార్యక్రమంలో వుండడం విశేషం. భూమిక టీమ్‌ ఎంతో శ్రమతో పనిచేసి పబ్లిక్‌ హియరింగ్‌ను విజయవంతంగా నిర్వహించారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.